News April 1, 2024

మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు

image

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.850 పెరగడంతో రూ.63,600 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.930 పెరిగి రూ.69,380కి చేరింది. కేజీ వెండి ధర రూ.600 పెరగడంతో రూ.81,600కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

Similar News

News February 7, 2026

HYD: మహిళా ఇంజినీర్లకు బంపర్ ఆఫర్

image

HYD ఐఐఐటీలోని ఐహబ్‌-డేటా మహిళా గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్ల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించింది. (AI), మెషీన్‌ లెర్నింగ్‌ (ML) అంశాలపై 6 నెలల పాటు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. మార్చిలో ప్రారంభమయ్యే ఈ కోర్సులో ప్రతి సోమవారం క్యాంపస్‌లో తరగతులు ఉంటాయి. ప్రతిభ కనబరిచిన వారికి మూడు నెలల ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పిస్తారు. ఫిబ్రవరి 20లోగా https://ihub-data.ai వెబ్‌సైట్‌‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News February 7, 2026

టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

image

CSIR-సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (<>CCIO<<>>)లో 7 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్, ఇంటర్ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. స్క్రీనింగ్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.36,306 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.590. SC, ST, PwBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://csio.res.in/

News February 7, 2026

రేపు పఠించాల్సిన సూర్య మంత్రాలు

image

సూర్యారాధనలో మంత్ర పఠనం అత్యంత శక్తిమంతంగా పని చేస్తుందని నమ్మకం. ‘ఓం సూర్యాయ విద్మహే మహాదేవాయ ధీమహి, తన్నో సూర్య ప్రచోదయాత్’ అనే సూర్య మంత్రం బుద్ధిని ప్రకాశింపజేసి, ఆధ్యాత్మిక మేల్కొలుపును కలిగిస్తుంది. ‘ఓం సూర్యాయ నమః’ అనే సూర్య అష్టాక్షరి మంత్రం కూడా చాలా ప్రభావవంతమైనది. సూర్యోదయం సమయంలో ఈ మంత్రాలను పఠిస్తూ అర్ఘ్యం వదిలితే మనస్సు ప్రశాంతంగా మారుతుంది. శరీరంలో కొత్త శక్తి ఉత్తేజితమవుతుంది.