News May 13, 2024

మాచర్లలో మరోసారి ఉద్రిక్తత

image

AP: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఉద్రిక్తతల నడుమ పోలింగ్ కొనసాగుతోంది. తాజాగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. పాల్వాయిగేటు వద్ద జరిగిన ఈ దాడిలో ఎమ్మెల్యే కారు ధ్వంసమైంది. మరోవైపు గన్నవరం నియోజకవర్గంలోని ముస్తాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రావు వర్గీయుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

Similar News

News December 14, 2025

రిటైరయ్యే ఉద్యోగులకు శుభవార్త

image

AP: గ్రాట్యుటీ, పెన్షన్ ఇతర బెనిఫిట్స్‌కు దరఖాస్తు ప్రక్రియ గజిబిజిగా ఉండి రిటైర్డ్ ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీన్ని పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ ‘రిటైర్మెంటు బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్’ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల అనవసర ప్రక్రియలు తొలగనున్నాయి. ఐటీ సిస్టమ్స్‌ ద్వారా CFMS, పేరోల్ వ్యవస్థలు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (PAG)కి నేరుగా అనుసంధానమై ఉద్యోగులకు మేలు జరగనుంది.

News December 14, 2025

CM చంద్రబాబుపై MLA చంద్రశేఖర్ సెటైర్లు

image

CM చంద్రబాబుపై YCP MLA చంద్రశేఖర్ పరోక్షంగా సెటైర్లు వేశారు. ‘వరుస ఓటములతో ఇక ఫుట్‌బాల్ ఆడనన్నాడు. నేను దావోస్ వెళ్లినప్పుడు అర్జెంటీనా నుంచి వచ్చి కలిశాడు. ఆటలో చిట్కాలు చెప్పా. ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు మెస్సీ. HYD వస్తారా, నన్నే అమరావతి రమ్మంటారా అని ఫోన్లు. వీలైతే ఈసారి విశాఖలో లోకేశ్ టీమ్, నీ టీమ్‌కూ మ్యాచ్ పెడదామన్నాను, ఆనందపడ్డాడు. మీకు ఎవరైనా గుర్తొస్తే నాకు సంబంధం లేదు!’ అని ట్వీట్ చేశారు.

News December 14, 2025

IPL మినీ ఆక్షన్‌.. ఈ ప్లేయర్‌కే అత్యధిక ధర?

image

ఎల్లుండి జరిగే IPL మినీ ఆక్షన్‌లో AUS ఆల్‌రౌండర్ గ్రీన్ అత్యధిక ధర పలకొచ్చని క్రీడా విశ్లేషకులు అంచనా. ఈ వేలానికి ఆయన బ్యాటర్‌గా రిజిస్టర్ చేసుకోగా, మొదటి సెట్‌లోనే ఎక్కువ ప్రైస్ రావాలని అలా చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే తన మేనేజర్ పొరపాటున ఆప్షన్ తప్పుగా పెట్టాడని, తాను బౌలింగ్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు గ్రీన్ తెలిపారు. అత్యధిక పర్స్ ఉన్న (₹64.30Cr) KKR ఆయన్ను కొనే ఛాన్సుంది.