News October 8, 2025

అలాంటివారికే దేవుడు సాక్షాత్కారమవుతాడు

image

శ్రీకృష్ణుడి ఎడబాటును భరించలేక, ప్రతి క్షణాన్ని ఆయనతో ఉన్నట్లుగా భావించింది రుక్మిణీ దేవి. ఆయన జ్ఞాపకాలనే తన జీవనాధారంగా చేసుకుంది. అంతటి ఉత్తమమైన భక్తిని, పరమాత్మపై ప్రేమను కలిగిన రుక్మిణిని చూసి భగవంతుడు ప్రత్యక్ష దర్శనంతో కనికరించాడు. అటువంటి ఉత్తమ ధర్మాన్ని ఆచరించే భక్తులకు పరమాత్మ తప్పక తన సాక్షాత్కారాన్ని ఇస్తాడు. నిస్వార్థమైన, నిరంతరాయమైన భక్తి ఉంటే దైవానుగ్రహం తప్పక లభిస్తుంది.<<-se>>#Bakthi<<>>

Similar News

News January 17, 2026

BREAKING: మేయర్ల రిజర్వేషన్లు ఖరారు

image

TG: కార్పొరేషన్ మేయర్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మహిళలకు 50% రిజర్వేషన్లు కేటాయించినట్లు మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి వెల్లడించారు.
*నిజామాబాద్- మహిళ జనరల్ *నల్గొండ- మహిళ జనరల్
*ఖమ్మం- మహిళ జనరల్ *గ్రేటర్ వరంగల్- జనరల్
*GHMC- మహిళ జనరల్ *కరీంనగర్- బీసీ జనరల్
*మంచిర్యాల- బీసీ జనరల్ *మహబూబ్‌నగర్- బీసీ మహిళ
*రామగుండం- ఎస్సీ జనరల్ *కొత్తగూడెం- ఎస్టీ జనరల్

News January 17, 2026

3 రోజుల్లోనే రూ.61.1 కోట్లు

image

నవీన్ పొలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లోనే రూ.61.1 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 14 విడుదలైన ఈ మూవీ తొలి రోజు రూ.22 కోట్లు, రెండు రోజుల్లో రూ.41.2కోట్లు సాధించింది. మారి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటించారు.

News January 17, 2026

నగలు సర్దేయండిలా..

image

మహిళలకు అలంకారం, ఆభరణాలు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. మార్కెట్లోకి లేటెస్ట్‌గా ఏ నగ వచ్చినా సరే కొనేయాల్సిందే. అయితే వాటిని సరిగ్గా భద్రపరచకపోతే అవి కొన్నాళ్లకు రంగుమారి పాడైపోతాయి. ఇలాకాకుండా ఉండాలంటే..ఆభరణాలు భద్రపరిచే ముందు శుభ్రంగా తుడిచి ఆరబెట్టిన తర్వాతే బాక్సుల్లో సర్దాలి. అన్ని రకాల నగలను ఒకే బాక్సులో పెట్టకూడదు. విడివిడిగా ఎయిర్‌టైట్ బాక్సులు, జిప్ లాక్ బ్యాగులు వాడాలి.