News April 30, 2024

సాధారణ వ్యక్తులే మా స్టార్ క్యాంపెయినర్లు: వైసీపీ

image

AP: 12 మందితో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను వైసీపీ విడుదల చేసింది. గంగు కళ్యాణి, షేక్ సందానీ, జనార్దన్ రెడ్డి, దాజప్పగారి జనప రూపాని, పరంజ్యోతి, పందలనేని శివప్రసాద్, కట్టా జగదీశ్, కృష్ణం రామకృష్ణ, గొల్లపల్లి శ్రీను, సయ్యద్ అన్వర్, అరుషభట్టు అనంత లక్ష్మి, ఈశ్వరి ఈ జాబితాలో ఉన్నారు. వీరిలో నలుగురు గృహిణులు, ఇద్దరు రైతులు, ఆటో డ్రైవర్, టైలర్, నలుగురు మాజీ వాలంటీర్లు ఉన్నట్లు వైసీపీ ట్వీట్ చేసింది.

Similar News

News December 5, 2025

MBNR: ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వెయ్యండి: కలెక్టర్

image

గ్రామపంచాయతీలో ఓటరుగా ఉండి, ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి అర్హులని కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. ఇప్పటివరకు ఫారం-14 (పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు) దరఖాస్తు చేసుకున్న వారికి పోస్టల్ బ్యాలెట్ పంపడానికి ఎన్నికల యంత్రాంగం కసరత్తు చేపట్టిందని, మరో అవకాశంగా పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు.
SHARE IT.

News December 5, 2025

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకెక్కిన సీఎం నితీశ్

image

బిహార్ CM నితీశ్ కుమార్ అరుదైన ఘనత సాధించారు. ఇటీవల పదోసారి CMగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌(లండన్)లో చేరినట్లు JDU తెలిపింది. 2000లో తొలిసారి CM అయిన నితీశ్ వారం రోజులే పదవిలో ఉన్నారు. తర్వాత 2005 నుంచి వరుసగా 5సార్లు సీఎం అయ్యారు. సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలతో పలుమార్లు రాజీనామాలు చేసి మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు.

News December 5, 2025

కప్పు పట్టేస్తారా? పట్టు విడుస్తారా?

image

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన IND 3 వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచు గెలిచి ఊపు మీద కనిపించింది. దీంతో ఇంకొక్క మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే అనుకున్నారంతా. కానీ బౌలింగ్ ఫెయిల్యూర్, చెత్త ఫీల్డింగ్‌తో రెండో వన్డేను చేజార్చుకుంది. దీంతో రేపు విశాఖలో జరిగే చివరి వన్డే కీలకంగా మారింది. మరి భారత ఆటగాళ్లు ఈ మ్యాచులో సమష్టిగా రాణించి, సిరీస్ పట్టేస్తారో లేక SAకు అప్పగిస్తారో చూడాలి.