News March 22, 2024
నరసరావుపేట బరిలో ఎముకల వైద్య నిపుణులు

AP: పల్నాడు(D) నరసరావుపేటలో మరోసారి ఆసక్తికర పోరు జరగనుంది. TDP నుంచి చదలవాడ అరవింద బాబు, YCP తరఫున గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పోటీకి సై అంటున్నారు. వృత్తి రీత్యా వీరిద్దరూ ఎముకలు, కీళ్లకు సంబంధించిన సీనియర్ వైద్యులు కావడం గమనార్హం. నియోజకవర్గ పరిధిలో సొంత హాస్పిటల్స్ ద్వారా వైద్యం అందిస్తున్నారు. 2019 ఎన్నికల్లో గోపిరెడ్డికి లక్ష ఓట్లు రాగా, చదలవాడకు 68 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి.
Similar News
News July 10, 2025
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరల్లో కొద్దిరోజులుగా హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. నిన్న తగ్గిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹220 పెరిగి ₹98,400కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹200 పెరిగి ₹90,200 పలుకుతోంది. అటు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కేజీ రేట్ రూ.1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News July 10, 2025
రెండు రోజులు వైన్స్ బంద్

ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా హైదరాబాద్‌లో ఈనెల 13, 14 తేదీల్లో వైన్ షాపులు మూతపడనున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు సెంట్రల్, ఈస్ట్, నార్త్ హైదరాబాద్‌లోని మద్యం దుకాణాలకు ఈ నిబంధన వర్తిస్తుందని సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News July 10, 2025
లంచ్ బ్రేక్ సమయానికి ENG స్కోర్ ఎంతంటే?

లార్డ్స్‌లో భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో లంచ్ బ్రేక్ సమయానికి ENG 2 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. ఓపెనర్లు క్రాలే, డకెట్‌లను నితీశ్ కుమార్ పెవిలియన్‌కు పంపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్రీజులో పోప్(12*), రూట్(24*) ఉన్నారు. బుమ్రా, ఆకాశ్ దీప్, సిరాజ్ తొలి వికెట్ కోసం వేట కొనసాగిస్తున్నారు.