News March 8, 2025

25న గోదావరి బోర్డు భేటీ.. ‘బనకచర్ల’పై చర్చ

image

ఈ నెల 25న తెలుగు రాష్ట్రాల అధికారులతో గోదావరి బోర్డు సమావేశం జరగనుంది. గోదావరి పరీవాహకంలోని 16 ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను తమకు అప్పగించాలని AP, TGలను బోర్డు కోరనుంది. అలాగే వివాదాస్పదమైన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ జరగనుంది. ఏపీకి చెందిన 4, తెలంగాణకు చెందిన 11 ప్రాజెక్టుల అనుమతులపైనా వివరాలు సేకరించనుంది.

News March 8, 2025

భార్యను చదువు మానేయమనడం క్రూరత్వమే: హైకోర్టు

image

అర్ధాంతరంగా భార్యను చదువు మానేయమనడం క్రూరత్వమేనని మధ్యప్రదేశ్ హైకోర్టు తెలిపింది. ఇది ఆమె కలలను నాశనం చేయడమేనని పేర్కొంది. ఆమెను చదువుకోకుండా నిర్బంధించడం మానసిక క్రూరత్వమేనని స్పష్టం చేసింది. విడాకులు మంజూరు చేసేందుకు ఇది సరైన కారణమేనని పేర్కొంది. హిందూ వివాహ చట్టం ప్రకారం ఇలాంటివారికి విడాకులు ఇవ్వడం సమంజసమేనని తెలిపింది.

News March 8, 2025

నేడు ఇందిరా మహిళా శక్తి మిషన్ ఆవిష్కరణ

image

TG: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ HYD పరేడ్ గ్రౌండ్స్‌లో లక్ష మందితో ప్రభుత్వం సభ నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఇందిరా మహిళా శక్తి మిషన్-2025ను CM రేవంత్ ఆవిష్కరిస్తారు. సెర్ప్, మెప్మాలను విలీనం చేసి కోటి మంది మహిళలకు రూ.లక్ష కోట్ల రుణం అందించడమే దీని ఉద్దేశం. మహిళల ఆధ్వర్యంలో 150అద్దె బస్సులను, 31 జిల్లాల్లో పెట్రోల్ బంకులను CM ప్రారంభిస్తారు. రుణబీమా, ప్రమాద బీమా చెక్కులను అందిస్తారు.

News March 8, 2025

జీన్స్ ధరించండి.. మీ జీన్స్ మర్చిపోవద్దు: చిదానంద

image

AP: ధరించే దుస్తులు కాకుండా ఎలాంటి విలువలు పాటిస్తున్నామనేదే ముఖ్యమని పరమార్థ్ నికేతన్ ఆశ్రమ గురువు చిదానంద సరస్వతి చెప్పారు. మహాకుంభమేళాలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ‘ఆధ్యాత్మికత వైపు వెళ్లాలంటే ధరించే వెళ్లాలంటే జీన్స్‌కు బదులు సంప్రదాయ దుస్తులు ధరించాలా? అని ఓ యువకుడు అడిగాడు. జీన్స్‌తో ఇబ్బంది లేదని, జన్యుమూలాల(జీన్స్)ను మర్చిపోవద్దని సూచించా’ అని పేర్కొన్నారు.

News March 8, 2025

పాపం క్లాసెన్.. ఎక్కడ అడుగుపెట్టినా ఓటమే..!

image

అంతర్జాతీయ క్రికెట్‌లో సౌతాఫ్రికాకు ఎంత దురదృష్టం ఉందో ఆ జట్టు స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్‌కు అంతకంటే ఎక్కువగా ఉంది. క్లాసెన్ ఎక్కడ నాకౌట్ మ్యాచులు ఆడినా అతడి జట్టు ఓటమిపాలవుతోంది. 2023 MLC లీగ్ ఫైనల్, 2024 SAT20 ఫైనల్, 2024 IPL ఫైనల్, 2023 ODI WC సెమీస్, 2024 T20 WC ఫైనల్, 2025 CT సెమీస్‌లో ఆయన ప్రాతినిధ్యం వహించిన జట్లన్నీ ఓటమి పాలయ్యాయి. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ అతడిపై జాలి చూపిస్తున్నారు.

News March 8, 2025

ఒక్క ఛాన్స్ ప్లీజ్.. ఎమ్మెల్సీ ఆశావహులు!

image

AP: MLA కోట MLC సీటు కోసం ఆశావహులు CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ చుట్టూ తిరుగుతున్నారు. తమకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని వారిని కోరుతున్నారు. SVSN వర్మ, దేవినేని ఉమ, వంగవీటి రాధా, బీదా రవిచంద్ర, K శ్రీధర్, బుద్ధా వెంకన్న, KS జవహర్, మోపిదేవి, KE ప్రభాకర్, పీతల సుజాత, E ప్రతాప్ రెడ్డి, తిప్పేస్వామి, ప్రభాకర్ చౌదరి, మల్లెల లింగారెడ్డి, నాగుల్ మీరా, రుద్రరాజు పద్మరాజు తదితరులు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.

News March 8, 2025

హనీమూన్ ఎంజాయ్ చేస్తోన్న చైతూ-శోభిత

image

టాలీవుడ్ హీరో నాగచైతన్య-శోభిత ధూళిపాళ విదేశాల్లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇవి చూసిన నెటిజన్లు క్యూట్ కపుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా చైతూ నటించిన ‘తండేల్’ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. కార్తీక్ వర్మ దండుతో మరో మూవీ చేయనున్నారు. మరోవైపు శోభిత కూడా పలు మూవీస్, వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నారు.

News March 8, 2025

CT: ఫైనల్ మ్యాచ్‌కు టాస్ కీలకం

image

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టాస్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరిగే ఈ తుది పోరుకు భారత్-పాకిస్థాన్ ఆడిన పిచ్‌నే క్యూరేటర్లు సిద్ధం చేశారు. స్లో, స్లగ్గిష్ పిచ్ కావడంతో రెండో ఇన్నింగ్స్ ఛేదనకు కష్టంగా మారనుంది. దీంతో టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. కాగా పాక్‌తో జరిగిన మ్యాచులో ఇండియా 244 టార్గెట్‌ను అతికష్టం మీద ఛేదించిన సంగతి తెలిసిందే.

News March 8, 2025

నేడు మార్కాపురానికి CM చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ జరిగే మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఉండవల్లి నుంచి ఉదయం 10.45 గంటలకు మార్కాపురం చేరుకుంటారు. సభలో ప్రసంగించిన అనంతరం స్టాళ్ల ప్రదర్శన, లబ్ధిదారులకు పథకాలు పంపిణీ చేస్తారు. ఆ తర్వాత జిల్లా నేతలు, అధికారులతో సమావేశమవుతారు. సాయంత్రం 4.42 గంటలకు తిరిగి ఉండవల్లి చేరుకుంటారు.

News March 8, 2025

ట్రంప్‌తో వాగ్వాదం.. జెలెన్‌స్కీకి పెరిగిన ప్రజల మద్ధతు

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వాగ్వాదం తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి 10 శాతం ప్రజా మద్ధతు పెరిగినట్లు KIIS రిపోర్టు తెలిపింది. ట్రంప్‌తో భేటీకి ముందు ఆయనకు 57 శాతం మద్ధతు ఉందని, ఇప్పుడు అది 67 శాతానికి పెరిగిందని పేర్కొంది. ట్రంప్ తమ దేశాధినేతను అవమానించినట్లు ఉక్రెయిన్ ప్రజలు భావించారని, అందుకే ఆయనకు మద్ధతుగా నిలిచారని వెల్లడించింది.