News March 8, 2025

శుభ్‌మన్ గిల్‌కు పాక్ క్రికెటర్ క్షమాపణలు

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌తో మ్యాచ్‌లో ఓవరాక్షన్ చేసిన పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ ఎట్టకేలకు దిగి వచ్చారు. టీమ్ ఇండియా ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌కు క్షమాపణలు చెప్పారు. ‘వికెట్ తీసిన తర్వాత అలా సెలబ్రేట్ చేసుకోవడం నా నైజం. కానీ నా స్టైల్ కొందరికి నచ్చలేదు. అందుకే నా సెలబ్రేషన్స్ ఎవరినైనా బాధిస్తే క్షమించండి’ అని ఆయన పేర్కొన్నారు. కాగా గిల్ ఔటైన అనంతరం ఇక వెళ్లు అన్నట్లు అబ్రార్ చూశారు.

News March 8, 2025

ప్రభుత్వ ఉద్యోగులూ… జాగ్రత్త

image

TG: ACB పేరుతో ప్రభుత్వ ఉద్యోగులకు బెదిరింపు కాల్స్ వస్తే నమ్మవద్దని ఏసీబీ సూచించింది. కొందరు వ్యక్తులు అవినీతి కేసులు నమోదు చేస్తామని, అలా చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని ఉద్యోగుల్ని బెదిరిస్తున్నట్లు తెలిపింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో కేసు నమోదైందని పేర్కొంది. బెదిరింపు కాల్‌వస్తే వెంటనే 1064కు డయల్ లేదా 9440446106కు వాట్సాప్ చేయవచ్చంది. స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించింది.

News March 8, 2025

SLBC రెస్క్యూ ఆపరేషన్‌లో కీలక పరిణామం

image

TG: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సొరంగంలో చిక్కుకుపోయిన వారి ఆనవాళ్లకు సంబంధించి పలు అనుమానిత ప్రాంతాలను కడావర్ డాగ్స్ గుర్తించాయి. దీని ఆధారంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఎన్వీ రోబోటిక్ నిపుణులు కూడా లోపలికి వెళ్లి అధ్యయనం చేశారు. 12 విభాగాలకు చెందిన 650 మంది సభ్యులు నిరంతరం షిఫ్టుల వారీగా కార్మికుల జాడ కోసం కష్టపడుతున్నారు.

News March 8, 2025

రోడ్డు ప్రమాదంలో తీగల కృష్ణారెడ్డి మనవడు దుర్మరణం

image

TG: హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి మనవడు కనిష్క్ రెడ్డి (19) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. హైదరాబాద్ శివారులోని గొల్లపల్లి కలాన్ వద్ద ఓఆర్ఆర్‌పై ముందు వెళ్తున్న లారీని ఆయన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనిష్క్ తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు. కనిష్క్ తల్లి తీగల సునరిత హైదరాబాద్‌లోని మూసారాంబాగ్ కార్పొరేటర్‌గా పనిచేశారు.

News March 8, 2025

మార్చి 08: చరిత్రలో ఈ రోజు

image

1917: విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు జననం
1953 రాజస్తాన్ మాజీ సీఎం వసుంధర రాజే జననం
1954: గోవా మాజీ సీఎం దిగంబర్ కామత్ జననం
1988: మ్యూజిక్ డైరెక్టర్ అమర్ సింగ్ చంకీలా మరణం
1993: చిలకలూరిపేట వద్ద బస్సును తగలబెట్టిన ఘటనలో 23 మంది దుర్మరణం
2012: సినీ నటి రాధాకుమారి మరణం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం

News March 8, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 8, 2025

ఈ రోజు నమాజ్ వేళలు

image

మార్చి 8, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 5.18 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.30 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.24 గంటలకు
ఇష: రాత్రి 7.36 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 8, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 8, 2025

తీన్‌మార్ రీరిలీజ్ కలెక్షన్లన్నీ జనసేనకే: బండ్ల గణేశ్

image

బండ్ల గణేశ్‌, పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య Xలో ఆసక్తికర సంభాషణ జరిగింది. తీన్‌మార్ మూవీని రీరిలీజ్ చేయాలని బండ్లను ఓ అభిమాని కోరారు. విడుదల చేస్తే మీరు బ్లాక్‌బస్టర్ చేస్తారా అని గణేశ్ రిప్లై ఇవ్వగా, ఆ డబ్బులను జనసేనకు పార్టీ ఫండ్‌గా ఇస్తారా అని మరో అభిమాని పోస్ట్ చేశారు. వచ్చిన డబ్బులు మెుత్తం పార్టీ ఫండ్‌గా ఇస్తానని బండ్ల చెప్పారు. త్వరలోనే చిత్రాన్ని రీరిలీజ్ చేస్తానని ప్రకటించారు.

News March 8, 2025

శుభ ముహూర్తం (08-03-2025)

image

☛ తిథి: శుక్ల నవమి, మ.12.01 వరకు
☛ నక్షత్రం: ఆరుద్ర, తె.2.35 వరకు
☛ శుభ సమయం: ఆరుద్ర శివ పూజలకు మంచిది
☛ రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
☛ యమగండం: మ.1.30 నుంచి 3.00 వరకు
☛ దుర్ముహూర్తం: ఉ.6.00-నుంచి 7.36 వరకు
☛ వర్జ్యం: ఉ.11.27 నుంచి 1.00 వరకు
☛ అమృత ఘడియలు: సా.4.53 గంటల నుంచి 6.25 వరకు