India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కంటికి సరిపడా నిద్ర లేకుంటే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత దెబ్బతింటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేరు. ప్రతి చిన్నదానికి కోపం వస్తుంది. రోగనిరోధక శక్తి తగ్గి, ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ఆకలి ఎక్కువగా వేయడంతో జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది. ఫలితంగా బరువు పెరుగుతారు. అలాగే హార్మోన్లపై ప్రభావం పడి, శృంగారంపై ఆసక్తి తగ్గుతుంది. థైరాయిడ్, టైప్-2 డయాబెటిస్ వస్తాయని వార్నింగ్ ఇస్తున్నారు.

రష్యా పట్ల సానుకూల వైఖరితో ఉన్న ట్రంప్ ఒక్కసారిగా ఆ దేశానికి హెచ్చరికలు జారీ చేశారు. ఉక్రెయిన్‌పై దాడులు ముమ్మరం చేయడంతో ఆగ్రహించిన ట్రంప్ అధిక మొత్తంలో సుంకాలు విధిస్తామని పుతిన్‌కు వార్నింగ్ ఇచ్చారు. అలాగే బ్యాంకింగ్‌లోనూ కొత్తగా ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకునే వరకు అధిక సుంకాల విధింపు ఉంటుందని స్పష్టం చేశారు.

ప్రేగ్ మాస్టర్ చెస్ టోర్నమెంట్‌లో ఇండియన్ గ్రాండ్‌మాస్టర్ అరవింద్ చిదంబరం విజేతగా నిలిచారు. తన ప్రత్యర్థి టర్కీ ఆటగాడు ఎడిజ్ గురేల్‌తో మ్యాచ్‌ను డ్రా చేసి మెుత్తంగా 6/9 పాయింట్లతో విజేతగా నిలిచారు. దీంతో లైవ్‌రేటింగ్ 2743తో ప్రపంచవ్యాప్తంగా 14వ ర్యాంక్ సాధించారు. మ్యాచ్ ఒత్తిడి వల్ల 2 రోజులుగా సరిగ్గా నిద్రపోలేదని, విజయం సాధించటంలో తన మెంటార్ ప్రధాన పాత్ర పోషించాడని గ్రాండ్ మాస్టర్ తెలిపారు.

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండనుంది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ మీటింగ్‌లో నిర్ణయించనున్నారు.

ప్రేమించే వారిని వారికి నచ్చినట్లు ఉండనివ్వాలని.. ప్రేమకు, రిలేషన్‌కు మధ్య తేడా ఉంటుందని హీరోయిన్ తమన్నా అన్నారు. అవతలి వారు తమకు నచ్చేలా ఉండాలనుకుంటే అది బిజినెస్ అవుతుంది, కానీ ‘లవ్’ కాదని చెప్పారు. నిస్వార్థమైన ప్రేమ ఎప్పుడూ వన్‌సైడ్ లవ్‌లోనే ఉంటుందన్నారు. యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో ప్రేమపై తన ఒపీనియన్‌ను తెలియజేశారు. కాగా తమన్నా ఇటీవలే లవర్ విజయ్‌వర్మతో బ్రేకప్ చెప్పారని వార్తలు వస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి రేపు మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘నా నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. తన సతీమణితో పాటు ఖుష్బూ, రాధిక, సుహాసిని, జయసుధ, మీనాలతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు.

AP: వివేకా హత్య కేసు సాక్షులు ఎలా చనిపోయారనే దానిపై సిట్ ఏర్పాటు చేశామని కడప SP అశోక్ కుమార్ తెలిపారు. ‘సిట్‌లో ఇద్దరు DSPలు, ముగ్గురు CIలు, ఇద్దరు SIలు, 10మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. వివేకా హత్య కేసులో ఐదుగురు సాక్షులు అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ఇటీవల చనిపోయిన రంగన్న మృతిపై అనుమానాలున్నాయి. జగన్ కారు డ్రైవర్ నారాయణ మృతిపైనా దృష్టి పెట్టాం. సాక్షులు కోరితే భద్రత కల్పిస్తాం’ అని SP తెలిపారు.

TG: లోక్‌సభలో BRS ప్రాతినిధ్యం లేకపోవటం వల్లే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ 14 నెలల్లోనే ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని మూటగట్టుకుందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఏప్రిల్ 27న WGLలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ (25 ఏళ్ల) వేడుకలకు లక్షలాదిగా ప్రజలు తరలిరావాలని కోరారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి ఫాంహౌస్‌లో పార్టీ నాయకులతో చర్చలు జరిపారు.

సూర్యరశ్మి మన శరీరానికి ఎంత అవసరమో ప్రముఖ వైద్యుడు మోహన వంశీ తెలియజేశారు. ‘సూర్యకాంతి కోసం పండితులు & పెద్దలు సూర్యనమస్కారాలు చేస్తారు. సూర్యుడిని చూస్తూ గాయత్రీ మంత్రం చదువుతారు. వైద్యులు కూడా సూర్యరశ్మి వల్ల విటమిన్-D పెరుగుతుందని, ఎముకలు బలంగా అవుతాయని చెప్తున్నారు. సన్‌లైట్‌కు మూడ్‌ని మార్చేస్తుంది. డిప్రెషన్ తగ్గిపోతుంది. అందుకే రోజూ ఉదయం 10 నిమిషాలు సన్‌లైట్‌లో ఉండండి’ అని తెలిపారు.

CT-2025: ఇండియా-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్‌కు పిచ్ ఏర్పాటు పూర్తయింది. లీగ్ దశలో భారత్-పాకిస్థాన్ ఆడిన పిచ్‌నే క్యూరేటర్లు తుది సమరానికి సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆ మ్యాచులో పాక్ 244 రన్స్ చేయగా భారత్ ఘన విజయం సాధించింది. ఇది వరకు భారత్ మ్యాచులన్నీ కొత్త పిచ్‌లపైనే ఆడగా ఫైనల్ దీనిపై ఆడనుంది. అయితే దుబాయ్‌లో ఆడటం ఇండియాకు కలిసి వస్తోందని పలు దేశాల క్రికెటర్లు విమర్శించిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.