News March 7, 2025

క్వశ్చన్ పేపర్ లీక్.. ఎగ్జామ్ రద్దు

image

AP: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ <<15680685>>పరీక్షా పత్రం లీకేజీ<<>> అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోందని మంత్రి లోకేశ్ తెలిపారు. దీనిపై విచారణ చేయాలని ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అలాగే పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించామన్నారు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

News March 7, 2025

TDP MLA అరవింద్ బాబుపై అధిష్ఠానం ఆగ్రహం

image

AP: నరసరావుపేట TDP MLA చదలవాడ అరవింద్ బాబుపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న ఎక్సైజ్ ఆఫీసులో హల్‌చల్ చేసినట్లు ఫిర్యాదు అందగా, ఆయన వ్యవహరించిన తీరు సరికాదని మందలించింది. ఘటనపై వివరణ ఇవ్వాలని TDP కేంద్ర కార్యాలయం నోటీసులు జారీ చేసింది. YCP హయాంలో నియమించిన ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులను తీసేసి తనవారికి ఉద్యోగాలివ్వాలని లేఖ రాసినా స్పందించలేదని MLA హల్‌చల్ చేసినట్లు సమాచారం.

News March 7, 2025

నాకు రెస్ట్ కావాలి: నటి రన్యా రావు

image

బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన కన్నడ నటి రన్యారావు పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేసే సమయంలో తనకు విశ్రాంతి కావాలని కోరారు. తాను ఇటీవల యూరప్, అమెరికా, మిడిల్ ఈస్ట్, దుబాయ్, సౌదీ అరేబియాకు ట్రావెల్ చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత రెస్ట్ దొరకలేదన్నారు. తప్పు ఒప్పుకోవాలని తనను ఎవరూ బలవంతం చేయలేదని, స్వయంగా ఒప్పుకున్నట్లు చెప్పారు. పోలీసులు ఫుడ్ ఇవ్వగా ఆమె తిరస్కరించారు.

News March 7, 2025

రూ.2 కోట్ల కారులో జూ సఫారీ!

image

రిలయన్స్ ఫౌండేషన్ గుజరాత్‌లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ‘వనతారా’ను స్థాపించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోని విభిన్నమైన జంతువులను ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే, ఇక్కడున్న సఫారీ వాహనం కూడా ఎంతో స్పెషల్. అన్నిచోట్లా బొలేరో వాహనాలను సఫారీగా వాడితే ఇక్కడ మాత్రం రూ.2 కోట్ల విలువైన డిఫెండర్ కారుతో పాటు రూ.25+ లక్షల Isuzu V-Cross కారును వాడుతున్నారు. అంబానీ ఆ మజాకా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News March 7, 2025

నాలుగు పడవలు మునక.. 180మంది గల్లంతు

image

సముద్రంలో నాలుగు పడవలు మునిగి 180 మంది గల్లంతైన ఘటన యెమెన్-డిబౌటీ మధ్య జరిగింది. ఎర్రసముద్రంలో వలసదారులు ప్రయాణిస్తున్న పడవలు మునిగిపోయాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఈ మార్గంలో ప్రయాణిస్తుండగా ఘటన జరిగింది. గతేడాది ఇదే మార్గంలో 558 మరణించారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్(IOM) తెలిపింది. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News March 7, 2025

ఒక్క సీటు కూడా తగ్గకుండా డీలిమిటేషన్: కిషన్ రెడ్డి

image

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)పై కాంగ్రెస్, BRS, DMK తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఒక్క సీటు కూడా తగ్గకుండా డీలిమిటేషన్ ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయన్నారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు.

News March 7, 2025

ప్చ్.. భార్యా బాధిత భర్తలు బతికేదెలా!

image

భరించే వాడే భర్త అనే నానుడికి కాలం చెల్లింది. ఇప్పుడు భరించలేక బాధపడుతున్నాడు భర్త. బరువు మోయలేక, బంధాలు తెంచుకోలేక, బతుకునే త్యాగం చేసేస్తున్నాడు భర్త. కొన్నాళ్లుగా భార్యా బాధితుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. తన బాధను పంచుకుంటే వెక్కిరించే సమాజాన్ని నమ్మలేక, అండగా నిలిచే ధైర్యం దొరక్క, న్యాయ పోరాటం చేయలేక, చట్టాలను ఎదిరించలేక, మౌనంగా రోదిస్తూ ఉరితాడును మెడకేసుకుంటున్నాడు. ఈ పరిస్థితి మారేదెలా?

News March 7, 2025

‘ది ప్యారడైజ్’ కథ ఇదేనట!

image

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న ‘ది ప్యారడైజ్’ సినిమా కథ గురించి సినీ వర్గాలు ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించాయి. ఇది 1980ల నాటి కల్పిత సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే చిత్రమని తెలిపాయి. ఇందులో నాని అణగారిన గిరిజన వర్గానికి చెందిన నాయకుడిగా, వారి హక్కుల కోసం పోరాటం చేస్తారని పేర్కొన్నాయి. ఇప్పటివరకు ఇలాంటి పాత్రను నాని చేయలేదని వెల్లడించాయి. ఆటవికంగా ఉన్నా ఈ చిత్రం అద్భుతంగా ఉంటుందన్నాయి.

News March 7, 2025

ఈశాన్య భారతంలో కీలక పరిణామం.. ఏంటంటే!

image

ఈశాన్య భారతంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మయన్మార్ జుంటా సర్కారుపై పోరాడుతున్న చిన్ స్టేట్ ప్రో డెమోక్రసీ రెబల్ గ్రూప్స్ మిజోరం CM లాల్దుహోమా సమక్షంలో ఐజ్వాల్‌లో విలీన ఒప్పందంపై సంతకాలు చేశాయని తెలిసింది. చిన్‌ల్యాండ్ కౌన్సిల్, ICNCC కలిసి సంయుక్త చిన్ జాతీయ మండలిని ఏర్పాటు చేయనున్నాయి. ఈశాన్యంలో శాంతి స్థాపనకిది కీలకం కానుంది. చిన్‌లో ఉండేది మిజో ప్రజలే. ఇక్కడి వాళ్లతో వారికి సంబంధాలు ఉన్నాయి.

News March 7, 2025

టెన్త్ విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం

image

AP: రాష్ట్రంలో ఈ నెల 17 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో RTC యాజమాన్యం సిబ్బందికి పలు సూచనలు చేసింది. టెన్త్ విద్యార్థుల వద్ద బస్ పాస్ లేకపోయినా హాల్ టికెట్ చూసి పల్లె వెలుగు/ అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కించుకోవాలని ఆదేశించింది. పబ్లిక్ హాలిడే రోజుల్లోనూ పరీక్షలు ఉంటే అనుమతించాలని పేర్కొంది. ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి.