India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తమిళనాడు సీఎం స్టాలిన్ మరో అడుగు ముందుకేశారు. దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు, మాజీ సీఎంలకు, ఉత్తరాదిలో బీజేపీ వ్యతిరేక పార్టీలకూ లేఖలు రాశారు. ఈ నెల 22న చెన్నైలో సమావేశం అవుదామని ఆహ్వానించారు. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా జేఏసీ ఏర్పాటు చేద్దామన్నారు.

స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ముగిశాయి. నిఫ్టీ 22,552 (7), సెన్సెక్స్ 74,332 (-7) వద్ద స్థిరపడ్డాయి. ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టడంతో రోజంతా రేంజుబౌండ్లోనే చలించాయి. మీడియా, O&G, మెటల్స్, కమోడిటీస్, ఇన్ఫ్రా, ఆటో, ఎనర్జీ షేర్లు ఎగిశాయి. రియాల్టి, ఐటీ, PSE, వినియోగం, బ్యాంకు, ఫార్మా షేర్లు ఎరుపెక్కాయి. RIL, నెస్లే, బజాజ్ ఆటో, BEL, హిందాల్కో టాప్ గెయినర్స్. ఇండస్ ఇండ్, NTPC టాప్ లూజర్స్.

తన చావుకు భార్య అపూర్వ, అత్త ప్రార్థనే కారణమంటూ ముంబై టెకీ నిషాంత్ త్రిపాఠి సహారా హోటల్లో సూసైడ్ చేసుకున్నారు. తను పనిచేసే కంపెనీ సైట్లో సూసైడ్ నోట్ అప్‌లోడ్ చేశారు. చావడానికి ముందు ఎవరూ డిస్టర్బ్ చేయొద్దంటూ రూమ్‌కు బోర్డు పెట్టడంతో విషయం ఆలస్యంగా బయటకొచ్చింది. ‘అపూర్వా.. నువ్విది చదివే సరికి నేనుండను. నా చివరి క్షణాల్లో నిన్ను అసహ్యించుకోగలను. కానీ అలా చేయను. ఐ లవ్ యూ’ అని నోట్‌లో పేర్కొన్నారు.

రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొడుతున్నారు. ఓ సెంచరీతో పాటు క్లిష్ట సమయాల్లో ఇండియా గెలుపుకోసం శ్రమిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో కోహ్లీ పేరు మార్మోగుతోంది. ఈ ఏడాది వికీపీడియాలో అత్యధిక సార్లు సెర్చ్ చేసిన ప్లేయర్‌గా విరాట్ నిలిచారు. 6.61లక్షల సార్లు కోహ్లీ గురించి సెర్చ్ చేశారు. ఆ తర్వాత రచిన్ రవీంద్ర గురించి 2.42 లక్షల మంది, శుభ్‌మన్ గిల్ గురించి 2.38 లక్షల మంది శోధించారు.

తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు.
*నిజామాబాద్ సీపీగా సాయి చైతన్య
*ఆదిలాబాద్ ఎస్పీగా అఖిల్ మహాజన్
*కరీంనగర్ సీపీగా గౌస్ ఆలం
*కామారెడ్డి ఎస్పీగా రాజేశ్ చంద్ర
*రామగుండం సీపీగా అంబర్ కిశోర్ ఝా
*వరంగల్ సీపీగా సన్‌ప్రీత్ సింగ్
*సూర్యాపేట ఎస్పీగా నరసింహ
*సంగారెడ్డి ఎస్పీగా పంకజ్ పరితోశ్
*ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధూ శర్మ
*నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేశ్
*పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్

AP: నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె PSలో నమోదైన కేసులో కడప మొబైల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అలాగే పోసాని కస్టడీ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

ఢిల్లీలోని ప్రముఖ మార్గం తుగ్లక్ లేన్ పేరు ‘స్వామి వివేకానంద మార్గ్’గా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఎంపీ దినేశ్ శర్మ, కేంద్ర మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్ తమ ఇంటి బయట నేమ్‌ప్లేట్లలో వివేకానంద మార్గ్ అని మార్చుకోవడంతో రాజకీయవర్గాల్లో ఇప్పుడు పేర్ల మార్పుపై చర్చ నడుస్తోంది. కాగా ఇటీవల ఢిల్లీలోనూ అధికారం దక్కించుకున్న BJP అక్కడి పలు ప్రాంతాల పేర్లను మార్చాలని యోచిస్తున్నట్లు సమాచారం.

షమీ ఎనర్జీ డ్రింక్ తాగడంలో తప్పేం లేదని ఆయన చిన్ననాటి కోచ్ బడారుద్దీన్ సిద్ధిఖీ వ్యాఖ్యానించారు. ‘అన్నింటికంటే పౌరుడికి దేశమే మిన్న. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆ డ్రింక్ షమీకి అవసరం. తను ఫైనల్ ఆడుతున్నాడు. భారత్‌ను గెలిపించాల్సి ఉంది. ఈ సమయంలో ఇలాంటి అంశాల్ని పెద్దవిగా చేయడం కరెక్ట్ కాదు. అతడేమీ నేరం చేయలేదు. దేశంకోసం ఆడుతున్నాడు. ఇవన్నీ తప్పవు. ప్రజలందరూ తనకు మద్దతుగా నిలవాలి’ అని కోరారు.

AP: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ ప్రశ్నాపత్రం లీకైంది. కళాశాల యాజమాన్యాలే దీన్ని లీక్ చేసినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్‌మెంట్ పరీక్ష జరగాల్సి ఉండగా, అరగంట ముందే క్వశ్చన్ పేపర్ లీక్ అయింది.

దేశ వ్యాప్తంగా ఉన్న 15వేల PM జన్ ఔషధీ కేంద్రాల వల్ల 10 లక్షల మంది ప్రజలు ఖరీదైన మందులను తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారని కేంద్ర వైద్యశాఖ మంత్రి JP నడ్డా తెలిపారు. దీని వల్ల ప్రజలకు రూ.30వేల కోట్ల వరకు ఆదా అవుతోందన్నారు. 50-90% తక్కువ ధరలకే జన్ ఔషధీ కేంద్రాల్లో మందులు విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఆయా కేంద్రాల్లో 2వేలకు పైగా మందులు, 300 వరకు సర్జికల్ వస్తువులు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
Sorry, no posts matched your criteria.