India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎల్లుండి NZతో జరిగే CT ఫైనల్‌లో IND జట్టులో ఒక మార్పు జరిగే ఛాన్సుంది. స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్న స్పిన్నర్ కుల్దీప్ స్థానంలో సుందర్‌ను జట్టులోకి తీసుకుంటారని సమాచారం. NZలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ ఎక్కువగా ఉండటంతో రైటార్మ్ ఆఫ్ స్పిన్నర్‌ను ఆడిస్తే బాగుంటుందని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సుందర్ ఆడితే బ్యాటింగ్ బలం కూడా పెరగనుంది. అటు NZలో యంగ్ స్థానంలో కాన్వే ఆడొచ్చు.

AP: డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఈనెలలోనే విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ మరోసారి స్పష్టం చేశారు. 16,347 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. రిజర్వేషన్ల ఖరారు కోసం ఏకసభ్య కమిషన్ వేశామని, కమిషన్ నుంచి రిపోర్టు రాగానే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ‘DSC నోటిఫికేషన్ ఎప్పుడిచ్చినా కేసులయ్యేవి. గతంలో దాఖలైన కేసులపై స్టడీ చేస్తున్నాం. అభ్యంతరాలు లేని నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని తెలిపారు.

భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం అని చదువుతూ వస్తున్నాం. అయితే, అభివృద్ధితో పాటు దేశంపై అప్పు కూడా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఇండియాపై రూ.181 లక్షల కోట్ల అప్పు ఉన్నట్లు బడ్జెట్‌లో కేంద్రం తెలిపింది. ఇది వచ్చే ఏడాది వరకు రూ.196 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. కాగా, తెలంగాణపై రూ.5లక్షల కోట్లు, ఏపీపై రూ.9 లక్షల కోట్ల అప్పు ఉన్నట్లు తెలుస్తోంది.

కొత్త సినిమా రాగానే టికెట్ ధరలు అమాంతం పెరుగుతున్న వేళ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక కొత్త బడ్జెట్ ప్రతిపాదన ప్రకారం అన్ని నేషనల్, స్టేట్ మల్టీప్లెక్సుల్లో సినిమా టికెట్ ధరను రూ.200కి పరిమితం చేసింది. దీంతో ఏ థియేటర్లోనైనా రూ.200 కంటే ఎక్కువ టికెట్ ధర ఉండకూడదు. దీనిపై సినీ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తుండగా, సినీ ఇండస్ట్రీ మాత్రం తప్పుబడుతోంది. దీనిపై మీ కామెంట్?

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికా నుంచి మరో దేశానికి వెళ్లినట్లు సమాచారం. వీరిద్దరిని విచారిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని HYD పోలీసులు భావిస్తున్నారు. వారికి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడానికి కావాల్సిన ప్రక్రియను సీఐడీ పూర్తి చేసింది. రెడ్ కార్నర్ నోటీసులు జారీ కాగానే వాళ్లు ఎక్కడున్నా దొరికిపోతారని పోలీసులు చెబుతున్నారు.

AP: రాష్ట్ర అప్పులపై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో రాతపూర్వక సమాధానమిచ్చారు. జూన్ 12, 2024 నాటికి ఏపీ ప్రభుత్వ అప్పులు రూ.5,19,192 కోట్లు, ప్రభుత్వ గ్యారంటీతో PSUల అప్పులు రూ.1,58,657 కోట్లు, GOVT గ్యారంటీ లేని PSU అప్పులు రూ.90,019 కోట్లు అని వెల్లడించారు. 2014 నుంచి సంవత్సరాల వారీగా అప్పుల వివరాల పీడీఎఫ్ కాపీ కోసం <

ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం ODI కెప్టెన్సీకి రోహిత్ గుడ్ బై చెప్పే అవకాశం కనిపిస్తోంది. NDTV కథనం ప్రకారం.. చీఫ్ సెలక్టర్ అగార్కర్, కోచ్ గంభీర్‌తో జరిగిన సమావేశంలో రోహిత్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తర్వాతి ODI ప్రపంచకప్ సమయానికి టీమ్ ఇండియా కొత్త సారథిని తయారుచేసేందుకు ఇదే సమయమని ఆయన భావించినట్లు తెలుస్తోంది. ఫిట్‌నెస్ బాగున్నంత కాలం ప్లేయర్‌గా కొనసాగేందుకు ఆయన సుముఖత చూపించినట్లు సమాచారం.

లాభదాయకత, ఆదాయం పెంచుకొనేందుకు సెల్లర్లు, యూజర్లకు బ్లింకిట్, జెప్టో షాకివ్వబోతున్నట్టు తెలిసింది. యూజర్ల ఫీజు, సెల్లర్లు, బ్రాండ్ల కమీషన్ పెంచుతాయని సమాచారం. క్విక్ కామర్స్ వ్యాపారాలకు ఎక్కువ నగదు అవసరం అవుతోంది. ఇది ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. ఫలితంగా జొమాటో, స్విగ్గీ వంటి షేర్ల విలువలు పడిపోతున్నాయి. అందుకే యూనిట్ ఎకనామిక్స్‌ను బలోపేతం చేసుకోవాలని సదరు కంపెనీలు నిర్ణయించుకున్నాయి.

కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు CM స్టాలిన్ విరుచుకుపడ్డారు. ద్రవిడులు జాతికి దిశానిర్దేశం చేస్తారు తప్ప ఢిల్లీ నుంచి ఆదేశాలు తీసుకోరని అన్నారు. ‘కేంద్ర విద్యామంత్రి మా రాష్ట్రంపై బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. గెలుపనేదే లేని యుద్ధాన్ని ఆయన ప్రారంభించారు. చరిత్ర స్పష్టంగా ఉంది. తమిళనాడుపై హిందీని రుద్దడానికి ట్రై చేసినవారు ఓడిపోయారు లేదా తర్వాత మాతో కలిసిపోయారు’ అని గుర్తుచేశారు.

TG: ‘కళ్యాణ లక్ష్మీ’ పథకంలో భాగంగా తులం బంగారం ఇస్తామన్న హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మందగించడంతోనే దీనిని అమలు చేయడం ఆలస్యమవుతోందని తెలిపారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని, ఇప్పటికే పలు హామీలను నెరవేర్చామని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.