News March 7, 2025

హిందీపై స్టాలిన్ ప్రేలాపనలకు అర్థం లేదు: అన్నామలై

image

NEP అనుకూల సంతకాల సేకరణకు ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తోందని TN BJP చీఫ్ అన్నామలై అన్నారు. హిందీపై CM స్టాలిన్‌ది నకిలీ ఉద్యమమని, ఆయన చెప్పేవన్నీ వ్యర్థ ప్రేలాపనలని విమర్శించారు. ‘https://puthiyakalvi.in/ ద్వారా మేం చేపట్టిన ఉద్యమానికి 36 గంటల్లోనే 2 లక్షల మందికి పైగా మద్దతిచ్చారు. రాష్ట్ర వ్యాప్త సంతకాల సేకరణకు ఊహించని స్పందన వస్తోంది. ఇక స్టాలిన్ ప్రేలాపనలకు అర్థంలేదు’ అని ట్వీట్ చేశారు.

News March 7, 2025

BREAKING: స్కూల్ విద్యార్థులకు GOOD NEWS

image

AP: విద్యార్థులపై బ్యాగ్ భారం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి లోకేశ్ అసెంబ్లీలో తెలిపారు. ఇకపై సెమిస్టర్ల వారీగా సబ్జెక్టుల పుస్తకాలను బైండ్ చేసి ఇస్తామన్నారు. అలాగే వారికి నాణ్యమైన యూనిఫామ్‌తో కూడిన కిట్ ఇస్తామని చెప్పారు. వన్ క్లాస్-వన్ టీచర్ విధానాన్ని 10K స్కూళ్లలో అమలు చేస్తామని వెల్లడించారు.

News March 7, 2025

త్వరలో టీచర్ల బదిలీల చట్టం: మంత్రి లోకేశ్

image

AP: విద్యావ్యవస్థలో టీచర్లది కీలక పాత్ర అని, వారిపై భారం ఉంటే పనిచేయలేరని మంత్రి లోకేశ్ చెప్పారు. ఉపాధ్యాయులపై ఒత్తిడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అసెంబ్లీలో తెలిపారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల బదిలీల చట్టం తీసుకొస్తున్నామని ప్రకటించారు. చాలా పారదర్శకంగా సీనియారిటీ జాబితాను టీచర్ల ముందు పెడతామని పేర్కొన్నారు. ఏదైనా తప్పులు ఉంటే వెంటనే కరెక్షన్ చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు.

News March 7, 2025

ఢిల్లీ బయల్దేరిన సీఎం రేవంత్

image

TG: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కోసం సీఎం రేవంత్ ఢిల్లీ బయల్దేరారు. అక్కడ ఏఐసీసీ పెద్దలతో చర్చించి అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం. అనంతరం ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం ఆయన హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. రేపు మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని అనంతరం మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు.

News March 7, 2025

పేర్ని నాని, విక్రాంత్‌రెడ్డికి ముందస్తు బెయిల్

image

AP: మాజీ మంత్రి పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించింది. రేషన్ బియ్యం కేసులో A6గా ఉన్న ఆయనకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో ఇప్పటికే నాని భార్యకు కూడా బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. అలాగే కాకినాడ పోర్టు వాటాల బదలాయింపు వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డికి కూడా న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది.

News March 7, 2025

మహిళా రైడర్లకు రేపు ఆటోలు, ఈ-బైక్‌ల పంపిణీ

image

AP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రేపు ప్రభుత్వం వినూత్న కార్యక్రమం ప్రారంభించనుంది. రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో ఆసక్తిగల డ్వాక్రా మహిళలకు 1,000 ఈ-బైక్‌లు, ఆటోలను అందించనుంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం చంద్రబాబు స్వయంగా పలువురు రైడర్లకు వాహనాలను పంపిణీ చేయనున్నారు. కాగా అద్దెకు వాహనాలను నడిపేందుకు ఇప్పటికే ర్యాపిడో సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

News March 7, 2025

POK స్వాధీనం: మోదీ సర్కారు బిగ్ ప్లానింగ్!

image

POK స్వాధీనంపై మోదీ సర్కారు గురిపెట్టిందని నిపుణుల అంచనా. వారు ఉదహరిస్తున్న జియో పొలిటికల్ ఈవెంట్లు ఇవే. అంతర్గత వివాదాలతో అట్టుడుకుతున్న పాక్‌ నుంచి బలూచిస్థాన్ స్వతంత్రం ప్రకటించుకొనే అవకాశముంది. తాలిబన్లు డ్యూరాండ్ రేఖను ఆక్రమిస్తున్నారు. కార్గిల్లో భారత్ అతిపెద్ద యుద్ధ విమానాన్ని దించింది. POK స్వాధీనంతో కశ్మీర్ సమస్య అంతమవుతుందని లండన్లో జైశంకర్ అన్నారు. మరి ఎవరు ఆపారని JK CM ప్రశ్నించారు.

News March 7, 2025

జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రతిపాదనలు లేవు: మంత్రి అనగాని

image

AP: గత ప్రభుత్వం జిల్లాలను అస్తవ్యస్తంగా విభజించిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. దీనిపై క్యాబినెట్‌లోనూ చర్చించలేదని మండలిలో విమర్శించారు. మరోసారి జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలేవీ లేవని పేర్కొన్నారు. అద్దంకి, మడకశిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సానుకూలంగా ఉన్నామన్నారు. అలాగే ఎమ్మిగనూరు, ఉదయగిరిలను రెవెన్యూ డివిజన్లుగా మార్చాలని ప్రతిపాదనలు అందాయని తెలిపారు.

News March 7, 2025

అవినీతిని అరికట్టేందుకు నిందితుడి స్వేచ్ఛను హరించొచ్చు: సుప్రీం

image

‘అవినీతి’ నిందితుల హక్కులపై సుప్రీం కోర్టు కీలక తీర్పుచెప్పింది. కరప్షన్‌ను అరికట్టేందుకు అవసరమైతే నిందితుడి వ్యక్తిగత స్వేచ్ఛను హరించినా తప్పేం లేదని పేర్కొంది. లంచం తీసుకుంటూ చిక్కిన ఓ అధికారికి హరియాణా హైకోర్టు ముందస్తు బెయిల్‌ను తిరస్కరించగా అతడు సుప్రీంను ఆశ్రయించాడు. హైకోర్టు తీర్పునే సుప్రీం ధర్మాసనం సమర్థించింది. అవినీతి కేసుల్లోని నిందితుల స్వేచ్ఛను హరించినా తప్పులేదని వ్యాఖ్యానించింది.

News March 7, 2025

కోతులకే కాదు మనుషులకూ వర్తిస్తుంది.. పోస్ట్ వైరల్!

image

అడవిలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఓ బోర్డును షేర్ చేస్తూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ఆలోచింపజేస్తోంది. ‘కోతులకు ఆహారం పెట్టకండి. అలా చేస్తే అది వాటి సహజ స్వభావాన్ని మార్చివేస్తుంది’ అని ఆ బోర్డులో రాశారు. ‘ఇది ప్రజలకూ వర్తిస్తుంది. ఉచితాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులను చేయకండి’ అని ఆ నెటిజన్ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఇది నిజమేనంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.