News March 7, 2025

సైకో అంటారు.. మేం తిరిగి అంటే ఏడుస్తారు: తాటిపర్తి

image

AP: కూటమి నేతలపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఫైరయ్యారు. ‘జగన్‌ను మీరు సైకో, శాడిస్ట్, క్రిమినల్, ఉగ్రవాది, తీవ్రవాది అనొచ్చు.. మిమ్మల్ని కార్పొరేటర్‌కు ఎక్కువ అంటే ఏడుస్తారు. తిరిగి బూతులు తిడతారు. ఇదేం చోద్యం?’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని జగన్ సెటైర్ వేయడంతో కూటమి నేతలు రగిలిపోతున్న విషయం తెలిసిందే.

News March 7, 2025

ఇందిరమ్మ ఇళ్లు.. రీవెరిఫికేషన్ ప్రారంభం

image

TG: ఇందిరమ్మ ఇళ్లకు రెండో దశ లబ్ధిదారుల ఎంపిక ప్రారంభమైంది. JAN 26న మండలానికి ఓ గ్రామం చొప్పున 562 పంచాయతీల్లో 72వేల ఇళ్లను మంజూరు చేయగా, ఇప్పుడు మిగిలిన చోట్ల రీవెరిఫికేషన్ మొదలైంది. ఇందుకోసం అధికారులు ఒక్కో మండలానికి నాలుగైదు బృందాలను ఏర్పాటుచేశారు. వీరు 21L మంది దరఖాస్తుదారుల నివాసాలకు వెళ్లి పరిశీలన చేస్తారు. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం <<15634727>>తెలిసిందే.<<>>

News March 7, 2025

హైకోర్టుకు బోరుగడ్డ బురిడీ?

image

AP: అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టయిన బోరుగడ్డ అనిల్ హైకోర్టునే బురిడీ కొట్టించి బెయిల్ పొందినట్లు ఆంధ్రజ్యోతి కథనంలో పేర్కొంది. తల్లికి అనారోగ్యం పేరుతో ఫేక్ సర్టిఫికెట్ అందించినట్లు తెలిపింది. దీంతో గత నెల 15నే బెయిల్ వచ్చిందని రాసుకొచ్చింది. అయితే ఆ ధ్రువపత్రం తాము ఇవ్వలేదని సదరు ఆస్పత్రి వెల్లడించినట్లు వివరించింది. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కోర్టు విచారణకు ఆదేశించిందని పేర్కొంది.

News March 7, 2025

TG నుంచి APకి ₹1700cr ప్రాజెక్ట్.. ఇది సిగ్గు చేటు: KTR

image

TG: గతంలో BRS తీసుకొచ్చిన పెట్టుబడులను కాంగ్రెస్ కాపాడుకోలేకపోతోందని KTR విమర్శించారు. ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ కంపెనీకి చెందిన రూ.1700 కోట్ల సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ TG నుంచి APకి వెళ్లిపోయిందన్న సోషల్ మీడియా పోస్టుపై ఆయన స్పందించారు. ‘గుజరాత్‌కు కేన్స్, తమిళనాడుకు కార్నింగ్‌ను వదిలేశారు. ఇప్పుడు ప్రీమియర్ ఏపీకి వెళ్తోంది. ఇది సిగ్గు చేటు రాహుల్ గాంధీ’ అని ట్వీట్ చేశారు.

News March 7, 2025

ఆ వీడియో నాదే.. కానీ అందులోని..: గోరంట్ల మాధవ్

image

అత్యాచార బాధితురాలి పేరు బయటకు చెప్పిన వీడియో తనదే కానీ, ఆ వాయిస్ కాదని గోరంట్ల మాధవ్ పోలీసులకు చెప్పారు. గురువారం విచారణకు హాజరైన మాజీ ఎంపీ ఆ బాధితురాలి పేరు తనకు తెలియదని తెలిపారు. కాగా పోక్సో కేసులో బాధితురాలి పేరు బయటకు చెప్పొద్దన్న నిబంధనను ఓ కేసులో మాధవ్ ఉల్లంఘించారని మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయన్ను ప్రశ్నించారు.

News March 7, 2025

నేడు కేసీఆర్ కీలక సమావేశం

image

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో జరగనున్న ఈ భేటీలో పార్టీ సభ్యత్వ నమోదు, రజతోత్సవ కార్యక్రమాలు, సంస్థాగత అంశాలతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత మందిని బరిలోకి దింపాలనే అంశంపైనా చర్చిస్తారని తెలుస్తోంది.

News March 7, 2025

పరువు హత్య కేసులో సంచలన విషయాలు

image

AP: అనంతపురం(D)లో కలకలం రేపిన <<15657872>>పరువు హత్య<<>> కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘వేరే కులం వ్యక్తితో ప్రేమ వద్దని తండ్రి చెప్పినా కూతురు వినలేదు. చావడానికైనా సిద్ధమేనని చెప్పింది. దీంతో ఉరివేసుకోవాలని తండ్రి గద్దించగా కూతురు అలాగే చేసింది. తర్వాత పెద్ద అల్లుడి సాయంతో మృతదేహాన్ని కిందకు దించాడు. సర్టిఫికెట్లు, పుస్తకాలను బాడీపై ఉంచి పెట్రోల్‌తో కాల్చేశాడు’ అని పోలీసులు తెలిపారు.

News March 7, 2025

రోహిత్ అలా సంతృప్తి పడిపోకూడదు: గవాస్కర్

image

వన్డేల్లో జట్టుకు వేగంగా ఆరంభాల్ని ఇచ్చేందుకు రోహిత్ దూకుడుగా ఆడి ఔట్ కావడం సరికాదని మాజీ క్రికెటర్ గవాస్కర్ అన్నారు. ‘రోహిత్‌కు ఉన్న ప్రతిభకు ఈ ఆట కరెక్ట్ కాదు. అతడిలాంటి ఆటగాడు క్రీజులో ఓ 25 ఓవర్లు ఆడి కుదురుకుంటే ప్రభావం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఈ 20-30 రన్స్‌కే అతడు తృప్తి పడిపోకూడదు. రోహిత్ ఎక్కువ సేపు ఉంటే మ్యాచ్‌పై తన ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది’ అని పేర్కొన్నారు.

News March 7, 2025

OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ ‘రేఖాచిత్రం’

image

మలయాళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘రేఖాచిత్రం’ ఓటీటీలోకి వచ్చేసింది. సోనీ లివ్‌లో ఈ మూవీ తెలుగుతోపాటు మొత్తం ఆరు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఆసిఫ్ అలీ లీడ్ రోల్‌లో నటించారు. గత జనవరి 10న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద రూ.55 కోట్లు వసూలు చేసి ఈ ఏడాది మలయాళంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.

News March 7, 2025

వర్సిటీల్లో 3,282 పోస్టులు.. ఈ ఏడాదే భర్తీ: లోకేశ్

image

AP: రాష్ట్రంలోని వర్సిటీల్లో 3,282 ఉద్యోగాలను ఈ ఏడాదే భర్తీ చేస్తామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. వన్ మ్యాన్ కమిషన్ నివేదిక ఇవ్వగానే ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. విశ్వవిద్యాలయాల్లో 4,330 శాంక్షన్డ్ పోస్టులంటే గత ప్రభుత్వం 1,048 ఉద్యోగాలనే భర్తీ చేసిందని తెలిపారు. వర్సిటీల బలోపేతానికి రూ.2వేల కోట్లు కేటాయించామని చెప్పారు. న్యాయ వివాదాలను తావులేకుండా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని వివరించారు.