News March 7, 2025

మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి: మంత్రి నారాయణ

image

AP: రాజధాని అమరావతి నిర్మాణం 3 ఏళ్లలో పూర్తవుతుందని మంత్రి నారాయణ తెలిపారు. హడ్కో, ప్రపంచ బ్యాంకు ద్వారా తీసుకునే రుణాలు.. అమరావతిలో భూముల అమ్మకంతో వచ్చే నిధులనే రాజధాని కోసం వాడతామన్నారు. ప్రజలు కట్టే పన్నుల నుంచి ఒక్కపైసా కూడా వాడబోమని వెల్లడించారు. రోడ్లు, డ్రైనేజీ, పార్కుల వంటి వసతులు పూర్తైతే భూముల ధర పెరుగుతుందని చెప్పారు. ఇప్పటికైనా రాజధానిపై YCP ఓ విధానంతో ముందుకు రావాలని హితవు పలికారు.

News March 7, 2025

TODAY HEADLINES

image

☛ తెలుగు ప్రజలకు రుణపడి ఉంటాను: చంద్రబాబు
☛ APకి ఏ లోటు లేకుండా చూస్తాం: నిర్మల
☛ బ్యాలెట్‌ విధానంలో ఎన్నికల కోసం డిమాండ్‌ చేయాలి: జగన్
☛ SC వర్గీకరణ ముసాయిదా బిల్లుకు TG క్యాబినెట్ ఆమోదం
☛ రేవంత్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ BJPదే గెలుపు: KTR
☛ TG: ఈనెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
☛ UKలో విదేశాంగ మంత్రి జైశంకర్‌పై దాడికి యత్నం
☛ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సునీల్ ఛెత్రి

News March 7, 2025

తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు

image

*HYDలో మిస్ వరల్డ్ పోటీల ఆతిథ్యానికి ఆమోదం
*ORRకు ఇన్నర్ సైడ్ ప్రాంతం కోర్ తెలంగాణ.. ORR నుంచి RRR వరకు అర్బన్ తెలంగాణ. మిగతా ప్రాంతమంతా రూరల్ తెలంగాణ
*సెర్ప్, మెప్మాల విలీనం
*మహిళా సంఘాల వయోపరిమితి 15-65 ఏళ్లుగా నిర్ణయం
*డీలిమిటేషన్ అంశంపై అఖిలపక్ష సమావేశం
*యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

News March 7, 2025

30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ: మంత్రి పొంగులేటి

image

TG: ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా 90 పోస్టులు మంజూరు చేశామని చెప్పారు. 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలతో HMDAను విస్తరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. HMDA పరిధిలో కొత్తగా 332 రెవెన్యూ గ్రామాలు ఏర్పాటు చేస్తామన్నారు.

News March 7, 2025

త్వరలో ఉచిత ఆన్‌లైన్ డీఎస్సీ కోచింగ్: మంత్రి

image

AP: బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో త్వరలో ఉచిత ఆన్‌లైన్ డీఎస్సీ కోచింగ్ ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఈ నెల 10 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. BC, EWS అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని, టెట్‌లో ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ జిల్లాలకు చెందిన బీసీ సంక్షేమ శాఖాధికారులను సంప్రదించాలని మంత్రి వివరించారు.

News March 6, 2025

రాజన్న ఆలయంలో దర్గాను తొలగించాలని హుండీలో చీటీలు

image

తెలంగాణలోని ప్రముఖ వేములవాడ రాజరాజేశ్వర ఆలయ ప్రాంగణంలోని దర్గాను తొలగించాలని కొద్ది రోజులుగా పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు భక్తులు ‘దర్గా హఠావో.. వేములవాడ బచావో’ అని చీటీలు రాసి హుండీలో వేశారు. ఆలయ సిబ్బంది వీటిని గమనించి తొలగించారు. కాగా, ఈ దర్గాను రెండు ముస్లిం వర్గాలు నిర్వహిస్తున్నాయి.

News March 6, 2025

నోటిఫికేషన్ విడుదల

image

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 357 సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో BSFలో 24, CRPFలో 204, CISFలో 92, ITBPలో 4, SSBలో 33 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసి, 20-25 ఏళ్ల వయసు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ టెస్టులు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 25.
సైట్: upsc.gov.in/

News March 6, 2025

విద్యకు దూరమైన బాలిక.. స్పందించిన సీఎం

image

TG: బర్త్ సర్టిఫికెట్, ఆధార్ లేదంటూ HYD సనత్‌నగర్‌కు చెందిన శ్రీవిద్య(8)ను స్కూలులో చేర్చుకోలేదన్న వార్తపై CM రేవంత్ స్పందించారు. ‘శ్రీవిద్య సమస్య నా దృష్టికి వచ్చింది. ఆమె పాఠశాలకు వెళ్లకపోవడానికి ఆధార్ లేకపోవడం కారణం కాదని విచారణలో తేలింది. కుటుంబ కారణాల వల్లే ఆమె స్కూలుకు దూరమైంది. అధికారులు ఆమెను తిరిగి స్కూలులో చేర్పించారు. తను మంచిగా చదివి భవిష్యత్తులో గొప్పగా రాణించాలి’ అని ట్వీట్ చేశారు.

News March 6, 2025

రిటైర్మెంట్ నిర్ణయంపై సునీల్ ఛెత్రి యూ టర్న్

image

భారత ఫుట్‌బాల్ టీమ్ మాజీ కెప్టెన్ సునీల్ ఛెత్రి తన అంతర్జాతీయ రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ నెలలో జరిగే FIFA ఇంటర్నేషనల్ మ్యాచుల్లో జాతీయ జట్టుకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తారని ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ వెల్లడించింది. ఈ 40 ఏళ్ల ప్లేయర్.. గత ఏడాది జూన్‌లో రిటైర్మెంట్ ప్రకటించారు. IND తరఫున 151 మ్యాచుల్లో 94 గోల్స్ చేశారు.

News March 6, 2025

విజయమ్మ, షర్మిల షేర్ల బదిలీ రద్దు చేయాలని జగన్ పిటిషన్

image

తమ సంతకం లేకుండానే తన, భారతి షేర్లను తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని, వాటిని రద్దు చేయాలని మాజీ CM జగన్ HYD జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌(NCLT)లో పిటిషన్లు వేశారు. అందులో విజయమ్మ, షర్మిలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. షేర్ల బదిలీపై స్టే కోరుతూ గతవారం జగన్ దాఖలు చేసిన మధ్యంతర, తాజా పిటిషన్లపై కౌంటర్ దాఖలుకు వాద, ప్రతివాదులు గడువు కోరారు. దీంతో APR 3కి విచారణ వాయిదా పడింది.