News March 6, 2025

బాబర్ ఆజమ్‌‌పై విమర్శలు.. తండ్రి ఆగ్రహం

image

CTలో విఫలమైన పాక్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌ను విమర్శించిన మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్‌పై ఆయన తండ్రి ఆజమ్ సిద్ధిఖీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘2024 ICC T20 టీమ్‌లో ఉన్న ప్లేయర్‌ను నేషనల్ T20 జట్టు నుంచి తొలగించారు. PSLలో రాణించి అతడు కమ్‌బ్యాక్ ఇస్తాడు. అతడిని విమర్శించే మాజీ క్రికెటర్లు జాగ్రత్తగా మాట్లాడాలని సూచిస్తున్నా. ఎవరైనా ఎదురు తిరిగి మాట్లాడితే మీరు తట్టుకోలేరు’ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు.

News March 6, 2025

రన్యారావు తండ్రిపై గతంలో ఆరోపణలు

image

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన నటి <<15652905>>రన్యారావు<<>> తండ్రి రామచంద్రరావు (DGP) కర్ణాటక హౌసింగ్ కార్పొరేషన్ CMDగా ఉన్నారు. 2014లో ఈయన IGPగా ఉన్నప్పుడు కేరళకు వెళ్తున్న బస్సును మైసూరు దగ్గర ఆపి రూ.20 లక్షల నగదును సీజ్ చేశారు. అయితే అందులో రూ.2.27 కోట్లు ఉన్నాయని, పోలీసులు డబ్బును పక్కదారి పట్టించారని ఆ వ్యాపారులు వెల్లడించారు. ఈ కేసును సీఐడీ విచారించింది. కొన్ని రోజులకు ఆయనకు వేరే పోస్టింగ్ ఇచ్చారు.

News March 6, 2025

21 Years: అమెరికాలో భయం గుప్పిట్లో భారతీయ యూత్!

image

H4 వీసా కింద మైనర్లుగా అమెరికాకు వలసవెళ్లిన భారతీయులు భయం భయంగా బతుకుతున్నారు. వారికి 21 ఏళ్లు వస్తుండటమే ఇందుకు కారణం. H1B వీసా కలిగిన తల్లిదండ్రుల వద్ద వారు ఇకపై డిపెండెంట్లుగా ఉండలేరు. సాధారణంగా H4 నుంచి ఇతర వీసాలు పొందేందుకు గతంలో రెండేళ్ల గడువు ఉండేది. ఇప్పుడా విధానం రద్దు చేశారు. FY26 H1B వీసా ప్రక్రియకు కేవలం 17 రోజులే టైమిచ్చారు. దీంతో యువత UK, కెనడా వంటి దేశాలకు వెళ్లాలని భావిస్తోంది.

News March 6, 2025

గంభీర్, రోహిత్ అలా.. షమీ ఇలా

image

CTలో IND తన మ్యాచులన్నీ దుబాయ్‌లోనే ఆడటం అడ్వాంటేజ్‌గా మారిందని పేసర్ షమీ అన్నారు. ‘ఒకే గ్రౌండ్‌లో ఆడుతుండటం మాకు హెల్ప్ అవుతోంది. పిచ్ కండిషన్స్, బిహేవియర్ గురించి తెలుస్తుంది’ అని పేర్కొన్నారు. అయితే అంతకుముందు ఈ అంశంపై గంభీర్, రోహిత్ భిన్నంగా స్పందించారు. పిచ్ కండిషన్స్ ప్రతీ మ్యాచుకు మారుతున్నాయని, తాము ప్రాక్టీస్ చేసే ICC అకాడమీ, మ్యాచ్ ఆడే దుబాయ్ గ్రౌండ్ పిచ్‌లు డిఫరెంట్ అని పేర్కొన్నారు.

News March 6, 2025

రేవంత్ ఆరోపణలను ప్రజలు పట్టించుకోలేదు: కిషన్ రెడ్డి

image

TG: BJPపై CM రేవంత్ చేసిన ఆరోపణలను ప్రజలు పట్టించుకోలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. MLC ఎన్నికల్లో విజయంతో తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు. HYDలో విజయోత్సవ సంబరాల అనంతరం మాట్లాడుతూ ‘ప్రజలు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా BJPని చూస్తున్నారు. కాంగ్రెస్‌ను వారు నమ్మడం లేదని ఈ ఫలితాలతో రుజువైంది. మేం కష్టపడితే MP ఎన్నికల్లోనూ మరిన్ని సీట్లు గెలిచేవాళ్లం’ అని వ్యాఖ్యానించారు.

News March 6, 2025

నోబెల్ శాంతి బహుమతి రేసులో డొనాల్డ్ ట్రంప్!

image

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారని తెలిసింది. 338 నామినేషన్లలో 244 వ్యక్తులు, 94 సంస్థలు ఉన్నాయని నోబెల్ కమిటీ పేర్కొంది. అందులో ఆయన పేరునూ చేర్చామని వెల్లడించింది. సాధారణంగా నామినేట్ అయిన పేర్లను కమిటీ రహస్యంగా ఉంచుతుంది. ఒకవేళ అదే స్వయంగా నామినేట్ చేస్తే చెప్తుంది. శాంతి బహుమతికి ట్రంప్ కన్నా అర్హులు ఇంకెవరూ ఉండరని రిపబ్లికన్ పార్టీ అంటోంది. మీరేమంటారు?

News March 6, 2025

YS జగన్‌పై పోలీసులకు ఫిర్యాదు

image

AP: Dy.CM పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ సీఎం జగన్‌పై జనసేన కార్యకర్తలు ఏలూరు(D) ద్వారకా తిరుమల పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఎంపీడీవో ఆఫీసు ఎదుట నిరసనకు దిగారు. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ’ అని నిన్న జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

News March 6, 2025

ఇండియాకు అప్పగిస్తే చిత్రహింసలు పెడతారు: రాణా

image

తనను ఇండియాకు అప్పగించొద్దని ముంబై 26/11 ఉగ్రదాడి నిందితుడు తహవూర్ రాణా అమెరికా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఒకవేళ అప్పగిస్తే ఆ దేశం తనను చిత్రహింసలు పెడుతుందని, అప్పగింతపై స్టే ఇవ్వాలని కోరాడు. 2023 మానవ హక్కుల నివేదిక ప్రకారం.. భారత ప్రభుత్వం మైనారిటీలపై వివక్ష చూపుతోందని తెలిపాడు. కాగా రాణా ప్రస్తుతం LA జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని తమకు అప్పగించాలని కోరగా ట్రంప్ ఓకే చెప్పారు.

News March 6, 2025

ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు క్యాబినెట్ ఆమోదం

image

TG: ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ముసాయిదాకు తుది మెరుగులు దిద్దాలని, న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడాలని మంత్రులకు సీఎం రేవంత్ సూచించారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలన్నారు.

News March 6, 2025

PHOTO: కస్టడీలో రన్యా రావు

image

దుబాయ్ నుంచి బెంగళూరుకు బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన కన్నడ నటి రన్యా రావు కస్టడీ ఫొటో వెలుగులోకి వచ్చింది. ఓవైపు తనకు బెయిల్ ఇవ్వాలని ఆమె పిటిషన్ దాఖలు చేయగా, మరోవైపు 2వ సారి కస్టడీకి కోరుతూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI) మరో పిటిషన్ వేసింది. నటి ఏడాదిలో 27సార్లు దుబాయ్ వెళ్లిందని, పూర్తి వివరాలు రాబట్టడానికి మరోసారి కస్టడీ అవసరం అని పేర్కొంది. ఈ పిటిషన్లపై రేపు విచారణ జరగనుంది.