India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: కాంగ్రెస్ ముఖ్యనేత విజయశాంతి హస్తిన బాట పట్టారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు కోసం ఆమె తన ప్రయత్నం మొదలుపెట్టారు. AICC అధ్యక్షుడు ఖర్గేను కలిసిన ఆమె తనకు సీటు కేటాయించాలని కోరారు. పార్టీ కోసం తాను చేసిన త్యాగాలు సహా మరికొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

AP: సినీ నటుడు పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఊరట దక్కింది. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. దీంతో ఆయా కేసుల్లో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం లేకుండా పోయింది.

నాణ్యమైన నిద్ర కోసం విడిగా పడుకునే జంటల సంఖ్య పెరుగుతోంది. భాగస్వాముల గురక, బెడ్ టైమ్స్ వేరుగా ఉండటమూ కారణాలుగా తెలుస్తోంది. దీన్నే ‘స్లీప్ డివోర్స్’ అంటున్నారు. గ్లోబల్ స్లీప్ సర్వే ప్రకారం ఈ జాబితాలో IND అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 78% జంటలు విడిగా పడుకుంటున్నాయి. ఆ తర్వాత చైనా(67%), సౌ.కొరియా(65%), US, UK(50%) ఉన్నాయి. కలిసి పడుకోవడం వల్ల డిప్రెషన్, ఒత్తిడి తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రజలు తక్షణమే పిల్లల్ని కనాలన్న TN CM స్టాలిన్ టార్గెట్ ఈజీ కాదని డేటా చెబుతోంది. దేశ జనాభాలో TN వాటా 5.2%. నిజానికి అక్కడ 7.18%కు సమానమైన 39 LS సీట్లు ఉన్నాయి. ఒకవేళ 2026 జనాభా ప్రాతిపదికనే డీలిమిటేషన్ చేస్తే అదనంగా కోటిమంది కావాలి. ఇప్పుడున్న 1.52 TFR (ఫెర్టిలిటీ రేటు)తో 77లక్షల జననాలే సాధ్యం. మిగిలిన 23లక్షల మందిని కనాలంటే 3.23 TFR అవసరం. అంటే 15-45 ఏళ్ల గృహిణులు ఏడాదిలో ఇద్దర్ని మించి కనాలి.

AP: మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణకు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత తోడల్లుళ్లు ఒకే వేదికపై కనిపించారు. విశాఖలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, దగ్గుబాటి సతీమణి, ఎంపీ పురందీశ్వరి తదితరులు పాల్గొన్నారు.

AP: డైరెక్టర్ ఆర్జీవీకి హైకోర్టులో ఊరట లభించింది. సీఐడీ నమోదు చేసిన కేసులపై స్టే విధించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. 2019లో విడుదలైన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై 2024లో కేసు నమోదు చేయడమేంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. కాగా రాజకీయ దురుద్దేశంతోనే తనపై FIR నమోదు చేశారని, దీన్ని కొట్టేయాలని ఆయన కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

AP: తిరుమల శ్రీవారి అన్నప్రసాదంతో పాటు మసాలా వడల పంపిణీని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. భక్తులకు ఆయన స్వయంగా వడ్డించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనం అధికారులు తొలి రోజున 35వేల వడలను తయారుచేశారు. క్రమంగా ఈ సంఖ్యను లక్ష వరకు పెంచడానికి చర్యలు తీసుకోనున్నారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి భారత్‌కు ఇస్తేనే అక్కడి సమస్య పరిష్కారమవుతుందని కేంద్రమంత్రి జైశంకర్ స్పష్టంచేశారు. భారత ప్రభుత్వం కశ్మీర్ అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు. లండన్‌లోని ఛాఠమ్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలన్నింటికీ సమాన అధికారాలు ఉండాలనే విధానంలో ట్రంప్ పాలన సాగుతోందని, భారత్‌కు అది సరిగ్గా సరిపోతుందని తెలిపారు.

CT ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో IND తలపడనుంది. గ్రూప్ స్టేజీలోనే NZని ఇండియా చిత్తు చేసిందని, ఫైనల్‌లో గెలుపు మనదేనని కొందరు IND ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో జరిగిన కొన్ని టోర్నీలను మరికొందరు గుర్తుచేస్తున్నారు. 2017 CTలో గ్రూప్ స్టేజీలో పాక్‌ను ఓడించినా ఫైనల్‌లో అదే టీమ్‌పై ఇండియా ఓడిపోయింది. 2023 ODI WCలోనూ ఇలాగే AUS ఫైనల్స్‌లో మనల్ని ఓడించింది. ఈసారి ఇది బ్రేక్ కానుందా?

AP: వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న(85) <<15662269>>మృతిపై<<>> ఆయన భార్య సుశీలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఇంట్లో లేని సమయంలో ఎవరో ఏదో చేసి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసుకుని పులివెందుల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాసేపట్లో ఆయన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
Sorry, no posts matched your criteria.