News March 6, 2025

‘ఎమ్మెల్సీ’ తీర్పుతో ప్రజావ్యతిరేకత అర్థమైంది: కిషన్ రెడ్డి

image

TG: సమష్టి కృషితో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ నెరవేర్చలేదని, అందుకే ఆయనను ఎవరూ పట్టించుకోవట్లేదని ఎద్దేవా చేశారు. పాలకులు మారినా పాలన మారలేదని, ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పుతో ప్రజావ్యతిరేకత అర్థమైందని తెలిపారు. విద్యావంతులు బీజేపీ వైపు నిలిచారన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.

News March 6, 2025

‘RC16’.. జాన్వీ కపూర్ స్పెషల్ పోస్టర్

image

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ బర్త్ డే సందర్భంగా ‘RC16’ చిత్రయూనిట్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతుండగా నిన్న కన్నడ నటుడు శివరాజ్ కుమార్ లుక్ టెస్టు పూర్తిచేశారు. త్వరలోనే ఈ సినిమా నుంచి అప్డేట్స్ రావొచ్చని సినీవర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఈ ఏడాది చివరిలోగా ‘RC16’ విడుదలయ్యే అవకాశం ఉంది.

News March 6, 2025

తగ్గిన బంగారం ధరలు!

image

రెండు రోజులుగా దాదాపు రూ.1360 పెరిగిన బంగారం ధర ఈరోజు కాస్త తగ్గి సామాన్యుడికి ఉపశమనం కలిగించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.450 తగ్గి రూ.80,200లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.490 తగ్గడంతో రూ.87,490కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.100 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,06,900గా ఉంది.

News March 6, 2025

NPS వాత్సల్య’తో పిల్లలకు మంచి భవిష్యత్తు: PFRDA ఛైర్‌పర్సన్

image

NPS వాత్సల్య పథకంలో ఇప్పటివరకూ లక్షమంది చేరినట్లు PFRDA ఛైర్‌పర్సన్ దీపక్ మహంతి వెల్లడించారు. ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే లక్షమంది చేరినందుకు ధన్యవాదాలు తెలిపారు. అప్పుడే పుట్టిన శిశువులను ఇందులో చేర్చవచ్చన్నారు. పిల్లల భవిష్యత్తుకు ఇది మంచి స్కీం అని తెలిపారు. ఈ పథకాన్నికేంద్రం గతేడాది సెప్టెంబర్‌లో ప్రారంభించింది. 18సంవత్సరాల లోపు పిల్లలు ఇందులో చేరడానికి అర్హులు.

News March 6, 2025

ప్రియుడితో తమన్నా బ్రేకప్.. కారణమిదే?

image

హీరోయిన్ తమన్నా, విజయ్ శర్మ <<15649806>>విడిపోయారంటూ <<>>జరుగుతున్న ప్రచారానికి వాళ్ల మధ్య వచ్చిన మనస్పర్థలే కారణంగా తెలుస్తోంది. మిల్కీ బ్యూటీ త్వరగా పెళ్లి చేసుకుని సెటిల్ కావాలనుకుంటుండగా విజయ్ నుంచి సానుకూలత రాలేదని సమాచారం. అలాగే ఆమె నియంత్రించే స్వభావం కారణంగా ఇరువురి మధ్య తరచూ విభేదాలు వస్తున్నాయని టాక్. ఈ కారణాలతోనే వారు విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

News March 6, 2025

మిల్లర్ సిక్స్.. బంతితో స్టేడియం నుంచి పరార్!

image

ఛాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీఫైనల్లో విచిత్రమైన సంఘటన జరిగింది. సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ డీప్ కవర్ వైపు భారీ సిక్సర్ కొట్టారు. దీంతో బంతిని పట్టుకున్న ఇద్దరు వ్యక్తులు లాహోర్ స్టేడియం నుంచి బయటకు పరుగులు తీశారు. ఐసీసీ ఈవెంట్లో ఇలా జరగడం మొదటిసారి అని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, టీమ్‌ను గెలిపించేందుకు మిల్లర్ చేసిన పోరాటం అనిర్వచనీయమని నెట్టింట ప్రశంసలొస్తున్నాయి.

News March 6, 2025

ఎమ్మెల్సీగా నాగబాబు.. అంబటి సెటైర్లు

image

AP: ఎమ్మెల్యే కోటాలో జనసేన నేత <<15658136>>నాగబాబును<<>> ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు Xలో సెటైర్లు వేశారు. ‘అన్నను దొడ్డిదారిలో మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చారు. నాగబాబు, పవన్ కళ్యాణ్‌లను ట్యాగ్ చేశారు.

News March 6, 2025

తొలి 5 సెంచరీలు ఐసీసీ టోర్నీల్లోనే.. రచిన్ రికార్డ్

image

న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర వన్డేల్లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. తన తొలి 5 సెంచరీలనూ ఐసీసీ టోర్నీల్లోనే చేసిన తొలి ఆటగాడిగా నిలిచారు. 2023 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌పై 123*, ఆసీస్‌పై 116, పాక్‌పై 108, CT-2025లో బంగ్లాపై 112, నిన్న సౌతాఫ్రికాపై 108 రన్స్ బాదారు. కాగా ఇప్పటివరకు 32 వన్డేలు ఆడిన రచిన్ 44.29 యావరేజ్, 108.72 స్ట్రైక్ రేటుతో 1,196 పరుగులు చేశారు.

News March 6, 2025

ఘోర ప్రమాదాలు.. 10 మంది మృతి

image

AP వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి జరిగిన 4 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 10 మంది మృతి చెందారు. HYD నుంచి కాకినాడ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఏలూరు(మ) సోమవరప్పాడులో లారీని ఢీకొని ముగ్గురు చనిపోయారు. చిత్తూరు ఇరువారం జంక్షన్ వద్ద బైకును కారు ఢీకొట్టడంతో ఇద్దరు, విశాఖ కంచరపాలెంలో చెట్టును బైక్ ఢీకొట్టి ఇద్దరు, నిన్న రాత్రి గువ్వలచెరువు ఘాట్‌లో కారును తప్పించబోయి లారీ లోయలో పడి ముగ్గురు మృతి చెందారు.

News March 6, 2025

రాహుల్‌పై కోర్టు ఆగ్రహం.. జరిమానా ఎంతంటే?

image

లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీకి ఉత్తరప్రదేశ్‌లోని లక్నో‌కోర్టు రూ.200 జరిమానా విధించింది. సావర్కర్‌పై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బుధవారం విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే వేరే కార్యక్రమాలు ఉన్నందున రాలేరని రాహుల్ తరపు న్యాయవాది తెలిపారు. దీంతో కోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 14న తప్పనిసరిగా హాజరుకావాలని లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేసింది.