India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పాకిస్థాన్ క్రికెటర్ సౌద్ షకీల్ అరుదైన రీతిలో ఔటయ్యారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో నిద్ర పోయి క్రీజులోకి రాకపోవడంతో ఆయన టైమ్డ్ అవుట్ అయ్యారు. పాకిస్థాన్ టెలివిజన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ జట్టు ఆటగాడు షకీల్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. 3 నిమిషాలలోపు అతడు బ్యాటింగ్‌కు రాకపోవడంతో అంపైర్ ఔట్‌గా ప్రకటించారు. ఆ ఓవర్లో హ్యాట్రిక్ సహా మొత్తం నలుగురు ఔటయ్యారు.

TG: భూములు అమ్మితే తప్ప ప్రభుత్వాన్ని నడపలేని స్థితికి సీఎం రేవంత్ రాష్ట్రాన్ని తీసుకొచ్చారని KTR విమర్శించారు. గచ్చిబౌలి పరిధిలో 400 <<15655774>>ఎకరాలను <<>>అమ్మి రూ.30వేల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోందన్న వార్తలపై మండిపడ్డారు. ఈ భూములు అమ్మడం లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన రేవంత్ మాట మార్చారని దుయ్యబట్టారు. హైడ్రా, మూసీ పరిధిలో కూల్చివేతలతో రాష్ట్ర ఆదాయం తగ్గిందని ఆరోపించారు.

TG: SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ కోసం రోబోలను వాడే ప్రయత్నం జరుగుతోంది. HYDకు చెందిన NV రోబోటిక్స్ ప్రతినిధులు టన్నెల్‌లోకి వెళ్లి పరిస్థితులు అధ్యయనం చేశారు. రోబోలను పంపే సాధ్యాసాధ్యాలపై వీరు రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి పంపనున్నారు. దానినిబట్టి రోబోలను వాడే అంశంపై సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు కన్వేయర్ బెల్ట్ మరోసారి టెక్నికల్ ప్రాబ్లమ్‌తో నిలిచిపోవడంతో సహాయక చర్యలు నిలిచిపోయాయి.

AP: సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ డైరెక్టర్ ఆర్జీవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే FIR నమోదు చేశారని ఆయన చెప్పారు. అందులో పేర్కొన్న ఆరోపణలన్నీ నిరాధారమైనవి తెలిపారు. CBFC సర్టిఫికెట్ జారీ చేశాక 2019లో కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా రిలీజ్ చేశామన్నారు. దీనిపై 2024లో కేసు నమోదు సరికాదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

TG: మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ఈ నెల 10న NLG అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు ఇవ్వనుంది. కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడన్న కక్షతో మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో ఈ హత్య చేయించాడని పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు. 78 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి, ఎనిమిది మంది నిందితులపై ఛార్జ్‌షీటు దాఖలు చేశారు. A1 మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా, తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

ఏపీలో ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఫస్టియర్ విద్యార్థులకు మ్యాథ్స్ 1A, బోటనీ పేపర్-1, సివిక్స్ పేపర్-1 సబ్జెక్టులకు పరీక్ష ఉంది. వీటికి సెట్ నెంబర్ 2 ప్రశ్నపత్రం ఎంపిక చేసినట్లు బోర్డు వెల్లడించింది.

TG: ప్రముఖ బ్రాండెడ్ కళ్లజోళ్ల పరిశ్రమల్లో ఒకటైన లెన్స్‌కార్ట్ రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధమైంది. తుక్కుగూడలో ఉన్న నాన్ సెజ్ జనరల్ పార్కులో ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయనుంది. రూ.1500 కోట్లతో ఏర్పాటు చేసే ఈ పరిశ్రమకు మంత్రి శ్రీధర్‌బాబు ఇవాళ శంకుస్థాపన చేస్తారు. గత డిసెంబర్‌లోనే ప్రభుత్వంతో ఒప్పందం జరగ్గా, ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకు కళ్లద్దాలను ఎక్స్‌పోర్ట్ చేయనున్నారు.

కిశోర్ తిరుమల డైరెక్షన్‌లో రవితేజ ఓ చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ సినిమాకు ‘అనార్కలి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో కయాదు లోహర్, మమతా బైజు హీరోయిన్లుగా నటిస్తారని టాక్. వచ్చే సంక్రాంతికి చిత్రాన్ని రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

AP: పంచాయతీల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆన్‌లైన్ పన్ను వసూలు విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ‘స్వర్ణ పంచాయతీ’ పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. క్యూఆర్ స్కానర్ల ద్వారా సిబ్బంది ఆస్తి, లీజులు, ఇతర పన్నులను వసూలు చేస్తారు. దీనిద్వారా రూ.250 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా. కాగా రాష్ట్రంలోని గ్రామాల్లో ఇళ్లు, షాపులు, ఇతర భవనాలు 85 లక్షల వరకు ఉన్నట్లు తేలింది.

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరుకున్నాయి. కాగా ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్‌పై భారత్‌కు అంత గొప్ప రికార్డులేమీ లేవు. ఆ జట్టుతో ఆడిన రెండు ఫైనల్స్‌లోనూ టీమ్ ఇండియా ఓటమి చవిచూసింది. గతంలో 2000 CT ఫైనల్, 2021 WTC ఫైనల్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. రెండు సందర్భాల్లోనూ కివీస్‌దే పైచేయి. మరోవైపు కివీస్ ఐసీసీ టోర్నీల్లో భారత్ తప్ప మిగతా జట్లతో ఆడిన నాలుగు ఫైనల్స్‌లోనూ ఓడిపోవడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.