News March 6, 2025

నంద్యాలలో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత

image

AP: నంద్యాల జిల్లాలో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని ఆత్మకూరులో నిన్న 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ప్రకాశం జిల్లాలోని కొనకనమిట్లలో 40, కృష్ణా జిల్లా కంకిపాడులో 39.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావారణ శాఖ తెలిపింది. రాష్ట్రంపైకి పొడిగాలులు వీయడం వల్లే ఎండలు మండిపోయినట్లు పేర్కొంది. ఇవాళ కూడా సాధారణం కంటే 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని అంచనా వేసింది.

News March 6, 2025

ఉ.11 గంటల్లోపే ఉపాధి పనులు.. ఆదేశాలు జారీ

image

AP: ఎండలు పెరిగిన నేపథ్యంలో ఉపాధి హామీ పనులను ఉ.6 నుంచి 11 గంటల్లోపే ముగించాలని ప్రభుత్వం కలెక్టర్లు, డ్వామా పీడీలను ఆదేశించింది. అవసరమైతే సా.4 నుంచి 6 గంటల వరకు పనులు కొనసాగించాలని పేర్కొంది. పని ప్రదేశాల్లో నీటి వసతి, నీడ ఉండేలా షెడ్స్ ఏర్పాటు చేయాలంది. ప్రథమ చికిత్స కిట్లు, ORS ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని పేర్కొంది.

News March 6, 2025

కార్గిల్ యుద్ధంపై వెబ్ సిరీస్?

image

దేశ చరిత్రలో కీలకమైన కార్గిల్ యుద్ధంపై నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సిరీస్ తెరకెక్కించనున్నట్లు సమాచారం. పాక్ సైన్యాన్ని తరిమికొట్టేందుకు వాయుసేన చేపట్టిన ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ ఘట్టాన్ని ఇందులో చూపిస్తారని తెలుస్తోంది. సిద్ధార్థ్, జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ, మిహిర్ కీలక పాత్రల్లో నటిస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని టాక్.

News March 6, 2025

వీర్యం నాణ్యతగా ఉంటే దీర్ఘాయుష్షు?

image

నాణ్యమైన వీర్యం ఉన్న వ్యక్తులు ఇతరుల కంటే రెండు మూడేళ్లు ఎక్కువగా బతుకుతారని డెన్మార్క్‌లోని కోపెన్ హెగెన్ వర్సిటీ సైంటిస్టులు గుర్తించారు. వీరు 50 ఏళ్లుగా 80 వేల మంది పురుషులపై స్టడీ చేశారు. శుక్ర కణాల సంఖ్య 120 మిలియన్లకుపైగా ఉన్నవారు 5 మిలియన్లు ఉన్న వారి కంటే 2.7 సంవత్సరాలు ఎక్కువగా బతుకుతారని తెలిపింది. స్పెర్మ్ క్వాలిటీ ఉండేవారు 80.3, తక్కువగా ఉండేవారు 77.7 ఏళ్లు జీవిస్తారని పేర్కొంది.

News March 6, 2025

బిలియనీర్లలో భారత్‌కు మూడో స్థానం

image

ఇండియాలో మిలియనీర్లు, బిలియనీర్లు పెరుగుతున్నారని నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది. మిలియనీర్ల పరంగా భారత్ నాలుగో స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. ఈ జాబితాలో అమెరికా, చైనా, జపాన్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయని పేర్కొంది. అలాగే అపర కుబేరుల జాబితాలో ఇండియా మూడో ప్లేస్‌లో ఉన్నట్లు తెలిపింది. తొలి రెండు స్థానాల్లో అమెరికా, చైనా ఉన్నాయి. మన దేశంలో 191 మంది బిలియనీర్లు ఉన్నట్లు వెల్లడించింది.

News March 6, 2025

నాలుగేళ్లలో విశాఖ మెట్రో పూర్తి: మంత్రి నారాయణ

image

AP: విశాఖ గాజువాక నుంచి భోగాపురం వరకు 34.6KM మేర మెట్రోను ప్రతిపాదించామని మంత్రి నారాయణ తెలిపారు. త్వరలోనే దీనికి కేంద్రం ఆమోదం తెలుపుతుందని, ఆ వెంటనే పనులు ప్రారంభిస్తామని అసెంబ్లీలో చెప్పారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పూర్తయితే ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు మెట్రోను తీసుకొస్తున్నామన్నారు. నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తామని ప్రకటించారు.

News March 6, 2025

ఏడాదిలో 30 సార్లు దుబాయ్‌కు.. ట్రిప్‌కు రూ.13 లక్షలు..!

image

దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకువస్తూ DRI అధికారులకు దొరికిపోయిన నటి రన్యా రావు కేసులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఏడాదిగా ఆమె 30 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవధిలో ఆమె రూ.కోట్లు గడించినట్లు సమాచారం. ఒక్కో కిలోకు ఆమె రూ.లక్ష ఫీజు తీసుకునేది. ఒక్కో ట్రిప్‌కు దాదాపు రూ.13 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది. గత 2 నెలల్లో 10 సార్లు అక్కడికి వెళ్లి వచ్చారు.

News March 6, 2025

నేడు మద్యం దుకాణాలకు లాటరీ

image

AP: రాష్ట్రంలో గీత కార్మికులకు కేటాయించిన మద్యం దుకాణాలకు ఇవాళ లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. 15 జిల్లాల్లో 227 దుకాణాలకు లాటరీ తీయనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని షాపులకు లాటరీ నిర్వహించి లైసెన్సులు మంజూరు చేయనున్నారు. కాగా ఇప్పటికే 10 జిల్లాల్లో లాటరీ తీశారు.

News March 6, 2025

త్వరలో UPI ద్వారా EPF విత్‌డ్రా?

image

త్వరలోనే UPI ద్వారా EPF నగదు విత్‌డ్రా చేసే సదుపాయం రానుంది. ఈ విధానం ద్వారా ATMతోపాటు UPI ద్వారా కూడా డబ్బులు తీసుకోవచ్చు. ఇందుకు సంబంధించి NPCI(నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)తో EPFO చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది జూన్ నాటికి ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది అమలైతే ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా EPF విత్ డ్రా చేసుకోవచ్చు. నగదు పరిమితిపై ఇంకా క్లారిటీ రాలేదు.

News March 6, 2025

ALERT.. నేడు రాష్ట్రంలో తీవ్ర వడగాల్పులు

image

AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు తీవ్ర వడగాల్పులు, మరికొన్ని చోట్ల వడగాల్పులు వీస్తాయని APSDMA హెచ్చరించింది. అల్లూరి జిల్లా అడ్డతీగల, దేవీపట్నం, గంగవరం, రంప చోడవరం మండలాలతో పాటు ప.గో. జిల్లాలోని ఆకివీడు మండలంలో తీవ్ర వడగాల్పులు వీస్తాయంది. అలాగే, పలు జిల్లాల్లోని 143 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని APSDMA <>లిస్ట్<<>> విడుదల చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.