India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజలపై భారం ఉండదని, YCP నేతల మాటలు నమ్మొద్దని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధానిపై మాజీ CM జగన్ వ్యాఖ్యలు వింతగా ఉన్నాయన్నారు. రూ.63వేల కోట్లతో రాజధాని నిర్మాణం చేపట్టనున్నట్లు, బడ్జెట్‌లో రూ.6వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 1200 ఎకరాలు వివిధ సంస్థలకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంలోని అత్యుత్తమ 5నగరాల్లో అమరావతిని ఒకటిగా తీర్చుదిద్దుతామన్నారు.

‘దేవర’ పార్ట్-2 షూటింగ్ ఈ ఏడాది చివర్లో లేదా 2026 ప్రారంభంలో మొదలయ్యే అవకాశాలున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. మే/జూన్ వరకు స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేసి, ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయాలని డైరెక్టర్ కొరటాల శివ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం NTR ‘వార్-2’ షూటింగ్‌ను దాదాపుగా పూర్తి చేశారు. త్వరలో ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్‌లో జాయిన్ కానున్నారు. ఆ తర్వాతే ‘దేవర-2’ షూట్ ఉండనుంది.

తక్కువ ధరకే దొరికే పౌష్టిక ఆహార పదార్థాలను ప్రముఖ న్యూట్రీషియన్ సునీత సూచించారు. ‘గుడ్లు, పాలు, ఇంట్లో తయారు చేసిన పెరుగు, వేరుశెనగ, నువ్వులు, కాల్చిన శనగలు, తాజా కొబ్బరి, మొలకలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వైట్ రైస్& గోధుమలు కాకుండా రాగి, జొన్న వంటి మిల్లెట్స్‌ను తినడం మంచిది. ఆకు కూరలు ముఖ్యంగా మునగ ఆకు, మెంతిని ఇంట్లోనే పండించుకోవచ్చు. సీజనల్ ఫ్రూట్ తినడం బెస్ట్’ అని తెలిపారు.

అమెరికా సుప్రీంకోర్టులో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌కు షాక్ తగిలింది. విదేశాలకు ఆర్థిక సాయం నిలిపివేయాలన్న ట్రంప్ సర్కార్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అయితే ఆ డబ్బును ఎప్పుడు విదేశాలకు రిలీజ్ చేయాలనే దానిపై న్యాయస్థానం స్పష్టత ఇవ్వలేదు. ఈ తీర్పుపై వైట్ హౌస్ దిగువ కోర్టుల్లో ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది.

గ్రూప్-1 పరీక్ష ఫలితాలను అతి త్వరలోనే వెల్లడిస్తామని TGPSC ప్రకటించింది. నియామక ప్రక్రియ పారదర్శకంగా, ఎలాంటి తప్పులు లేకుండా జరుగుతోందని స్పష్టం చేసింది. గ్రూప్-1 పోస్టులపై కొంత మంది సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను పోస్ట్ చేస్తున్నారని, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని అభ్యర్థులకు సూచించింది. మార్కుల జాబితాను త్వరలోనే వెబ్‌సైట్‌లో ఉంచుతామని పేర్కొంది.

AP: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడిచే గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువును మార్చి 13 వరకు పొడిగించారు. గతంలో విధించిన గడువు రేపటితో ముగుస్తున్న నేపథ్యంలో తాజాగా పొడిగించారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 13వ తేదీలోగా దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <

ఉత్తర తెలంగాణలో టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాజా గెలుపులతో బీజేపీ సగం తెలంగాణలో పట్టు సాధించినట్లు అయింది. 13 కొత్త జిల్లాలు, 217 మండలాలు, 6 లోక్‌సభ, 42 అసెంబ్లీ స్థానాల పరిధిలో జరిగిన ఈ ఎన్నికల్లో జయకేతనం ఎగరేసింది. దీంతో కాషాయదళ నేతలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిచి సీఎం పీఠంపై BJP జెండా ఎగరేయడమే మిగిలిందని చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్.

సమంతతో తాను మరో సినిమా తెరకెక్కించబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ‘ఓ బేబీ’ మూవీ డైరెక్టర్ నందిని రెడ్డి ఖండించారు. ఒకవేళ ఆమెతో మూవీ చేస్తే ఆ విషయాన్ని తానే అధికారికంగా ప్రకటిస్తానని స్పష్టం చేశారు. నందినికి సమంత బర్త్‌డే విషెస్ చెబుతూ ‘అందరి కళ్లు మీపైనే ఉన్నాయి. ఇది గొప్ప ఏడాది కాబోతోంది. పని ప్రారంభించండి’ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో వీరు మరో మూవీ చేయనున్నారనే టాక్ మొదలైంది.

ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు ప్రస్తుతం రోహిత్ శర్మ(8) పేరిట ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా గంగూలీ(7), సచిన్(7), ధవన్(6), వార్నర్(6), కోహ్లీ(6), సంగక్కర(6), పాంటింగ్(6), రచిన్ రవీంద్ర(5) , అన్వర్(5), దిల్షాన్(5) , గేల్(5) ఉన్నారు. ఈనెల 9న జరిగే CT ఫైనల్‌లో రోహిత్ లేదా కోహ్లీ మరో సెంచరీని తమ ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.

TG: ఆదిలాబాద్-కరీంనగర్-నిజామాబాద్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో ఆయన గెలుపొందారు. కాసేపట్లో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి, బీఎస్పీ తరఫున ప్రసన్న హరికృష్ణ పోటీ చేశారు.
Sorry, no posts matched your criteria.