India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: జర్మనీ పర్యటనలో ఉన్న పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ రెండో రోజు బెర్లిన్ సదస్సులో పాల్గొన్నారు. రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలపై ప్రపంచ మీడియా ప్రతినిధులకు వివరించారు. ‘అంతర్జాతీయ పర్యాటక పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా మారేందుకు ఈ సదస్సు ఉపకరిస్తుందని ఆశిస్తున్నాం. దక్షిణ భారత పర్యాటకానికి ఏపీ ముఖద్వారం. సుదీర్ఘ సముద్రతీరం, అందమైన బీచ్‌లు, ప్రకృతి రమణీయ ప్రాంతాలు ఏపీ సొంతం’ అని పేర్కొన్నారు.

ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ పంపిన లేఖ అందిందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. రెండు దేశాలకు ప్రయోజనం చేకూర్చే మినరల్ డీల్‌పై నెగోషియేషన్‌కు ఆయన ఆసక్తి ప్రదర్శించారని అన్నారు. ‘రష్యా, ఉక్రెయిన్ వివాదం ఆపేందుకు అవిశ్రాంతంగా పనిచేస్తున్నా. ప్రతివారం రెండు దేశాలకు చెందిన వందలమంది మరణిస్తున్నారు. మరో ఐదేళ్లు యుద్ధాన్ని ఇలాగే కొనసాగనిద్దామా’ అని ప్రశ్నించారు.

TG: తనను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేసినంత మాత్రాన BC ఉద్యమం ఆగదని MLC తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. HYD ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పు అని, ఆ చిత్తు కాగితం తగలబెట్టడం తప్పా? అని ప్రశ్నించారు. కులగణన దేశానికి ఆదర్శంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. KCR సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా చేశారని, నూటికి నూరు శాతం చేస్తేనే సర్వే ఆదర్శం అవుతుందని తెలిపారు.

సమ్మర్ వచ్చేసింది. వెకేషన్‌కు ఎక్కడికి వెళ్లాలో ప్లాన్ చేస్తున్నారా? అలాంటి వారికి జమ్మూకశ్మీర్ టూరిజం వెల్కమ్ చెప్తోంది. దేశంలో ఓవైపు ఎండలు మండుతుండగా కశ్మీర్ మాత్రం భూతల స్వర్గంలా కనిపిస్తోంది. ఎటు చూసినా పచ్చదనం, పొగ మంచుతో కూడిన వాతావరణం ఆహ్లాదాన్ని పంచుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. సమ్మర్ వెకేషన్‌కు ఎక్కడికి వెళ్తున్నారో కామెంట్ చేయండి.

నిద్రమాత్రలు మింగి <<15655341>>ఆత్మహత్యాయత్నం<<>> చేసిన ప్రముఖ సింగర్ కల్పన కోలుకుంటున్నారు. ఇవాళ ఆమె స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. ‘కేరళలో ఉన్న పెద్ద కూతురిని చదువుకోవడానికి హైదరాబాద్ రావాలని కోరా. అయితే ఆమె అక్కడే ఉంటానని చెప్పింది. ఆవేదనతో నిద్ర మాత్రలు మింగి చనిపోవాలనుకున్నా’ అని తెలిపారు. కాగా కల్పన ఊపిరితిత్తుల్లో నీళ్లు చేరడంతో ఇన్ఫెక్షన్ అయిందని వైద్యులు తెలిపారు.

జర్మన్ కార్ల దిగ్గజం ‘ఫోక్స్ వాగన్’ నుంచి సరికొత్త చౌకైన SUV లాంచ్ అయింది. బ్రెజిలియన్ మార్కెట్లో ‘TERA’ మోడల్ SUVని కంపెనీ ఆవిష్కరించింది. అయితే, ఇండియాలో లాంచ్ చేయడంపై కంపెనీ ఇంకా ప్రకటన చేయలేదు. 1.0లీటర్ ఇంజిన్‌తో తయారైన ఈ SUV.. 118bhp & 178Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఇదే ఇంజిన్‌తో మార్కెట్‌లోకి వచ్చిన Kylaq విజయంపైనే TERA భవిష్యత్తు ఆధారపడి ఉంది. 2027లో మార్కెట్‌లోకి రావొచ్చు.

TG: సీఎం రేవంత్ రెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో MLA కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. అలాగే నామినేటెడ్ పదవులు, బీసీలకు 42శాతం రిజర్వేషన్ అంశం కూడా చర్చకు వచ్చింది. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్, మంత్రులు భట్టి, ఉత్తమ్ కూడా పాల్గొన్నారు. అటు CM రేవంత్ ఎల్లుండి ఢిల్లీ వెళ్లనున్నారు.

ఉన్ని ముకుందన్ హీరోగా తెరకెక్కిన మార్కో మూవీకి షాక్ తగిలింది. ఇప్పటికే ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా శాటిలైట్ ప్రసారానికి మాత్రం బ్రేక్ పడింది. దాన్ని టీవీల్లో టెలికాస్ట్ చేయొద్దని సెన్సార్ బోర్డు ఆదేశించడంతో ఈ చిత్రానికి టీవీ ప్రీమియర్ ఇక అనుమానమే. హనీఫ్ అదేనీ డైరెక్ట్ చేసిన మార్కో, మలయాళ చిత్ర చరిత్రలోనే అత్యంత హింసాత్మక సన్నివేశాలు కలిగిన చిత్రంగా నిలిచింది.

AP: అనంతపురం జిల్లా గుంతకల్లులో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమ వ్యవహారంలో తన మాట వినలేదనే కారణంతో కూతురు భారతి(19)ని తండ్రి రామాంజనేయులు చంపేశాడు. అనంతరం కసాపురం శివారు అటవీ ప్రాంతంలో శవంపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ నెల 1న దారుణానికి పాల్పడగా నిన్న పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో పోలీసులు అక్కడే పోస్టుమార్టం నిర్వహించి దర్యాప్తు చేస్తున్నారు.

దేశీయ స్టాక్‌మార్కెట్లలో బలమైన కౌంటర్ ర్యాలీ జరుగుతోంది. ఆరంభం నుంచీ దూకుడు మీదున్న సూచీలు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో ఇంట్రాడే గరిష్ఠాలకు చేరాయి. నిఫ్టీ 22,369 (+286), సెన్సెక్స్ 73,836 (+850) వద్ద ట్రేడవుతున్నాయి. వరుసగా 10 సెషన్లు ఎరుపెక్కిన సూచీలు ఇవాళ గ్రీన్‌లో కళకళలాడుతుండటంతో మార్కెట్ వర్గాలు ఖుషీ అవుతున్నాయి. NIFTY NEXT50 ఏకంగా 1269pts ఎగిసింది. మదుపరుల సంపద రూ.5లక్షల కోట్లమేర పెరిగింది.
Sorry, no posts matched your criteria.