News March 5, 2025

నీటి వృథా తగ్గించి.. కష్టాలు తీర్చేలా!

image

దేశంలోని ప్రధాన నగరాలు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా బెంగళూరులో ఫిబ్రవరి నుంచే నీటి ఎద్దడి మొదలైంది. ఈక్రమంలో అభిజిత్ సాథే అనే వ్యక్తి ‘గ్రే వాటర్ రీసైక్లింగ్ సిస్టమ్’ను రూపొందించారు. దీనిద్వారా సింక్స్, వాషింగ్ మిషన్స్, షవర్స్ నుంచి వచ్చే యూజ్డ్ వాటర్‌ను రీసైక్లింగ్ చేస్తారు. వీటిని గార్డెనింగ్, టాయిలెట్లలో వాడుకోవచ్చు. దీని ద్వారా 40శాతం నీటి వృథాను తగ్గించవచ్చు.

News March 5, 2025

‘అన్నదాత సుఖీభవ’ ఎంత మందికి ఇస్తారు?: బొత్స

image

AP: రైతుల సమస్యలపై శాసన మండలిలో వైసీపీ సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు ఇస్తామని ఎన్నికల్లో చెప్పారు. ఎంత మందికి, ఎప్పుడు ఇస్తారో చెప్పాలి’ అని ప్రతిపక్ష నేత బొత్స నిలదీశారు. రైతులకు మంచి జరగాలనేదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. గతంలోనూ రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. అధికార పక్షం తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు.

News March 5, 2025

IPL-2025: పూర్తిగా మారనున్న ఉప్పల్ స్టేడియం!

image

ఐపీఎల్ కోసం ఉప్పల్ స్టేడియం సిద్ధమవుతోంది. ఇక్కడ మొత్తం 9 మ్యాచులు జరగనున్నట్లు HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్ పేర్కొన్నారు. ‘సీటింగ్ ప్రాంతాలను క్లీన్ చేసి ప్రేక్షకులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. వాష్‌రూమ్స్‌ & కార్పొరేట్ బాక్సులు లగ్జరీగా మారుస్తున్నాం. 20వ తేదీలోపు స్టేడియం లుక్‌ను అందంగా తీర్చిదిద్దుతాం. విశిష్ట అతిథులకు గొప్ప అనుభవాన్ని అందిస్తాం’ అని తెలిపారు.

News March 5, 2025

TN కేంద్ర ఆఫీసుల్లో హిందీని తొలగించండి: స్టాలిన్

image

TNలోని కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల్లో హిందీని తొలగించాలని ఆ రాష్ట్ర CM స్టాలిన్ డిమాండ్ చేశారు. పార్లమెంటులో సెంగోల్ ప్రతిష్ఠించడం వంటి సింబాలిక్ స్టెప్స్ పక్కన పెట్టి తమిళానికి మద్దతుగా అర్థవంతమైన చర్యలు తీసుకోవాలని BJPకి సూచించారు. మృతభాష సంస్కృతానికి కాకుండా తమిళానికి ఎక్కువ నిధులు కేటాయించాలని, హిందీతో సమానంగా అధికార భాషా హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. మాటలు కాకుండా చేతల్లో చూపాలని సవాల్ చేశారు.

News March 5, 2025

దాడులు, హత్యలు.. రెచ్చిపోతున్న వడ్డీ వ్యాపారులు

image

AP: పల్నాడు జిల్లాలో వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు ఇవ్వడం, తిరిగివ్వకపోతే దాడులు చేయడం పెరిగిపోతోంది. ఇటీవల సత్తెనపల్లిలో సుభాని అనే వడ్డీ వ్యాపారి అంజిబాబు అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి చంపేశాడు. అలాగే చిన్నమాబు అనే వ్యాపారి తరుణ్‌ అనే యువకుడిని చిత్రహింసలు పెట్టారు. బయటకు రాని ఘటనలు ఎన్నో ఉన్నాయని, వడ్డీ రాక్షసుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని సామాన్యులు కోరుతున్నారు.

News March 5, 2025

కళ్యాణ్‌రామ్ సినిమాకు టైటిల్ ఇదేనా?

image

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న NKR21 సినిమా టైటిల్‌పై ఓ ఆసక్తికర అప్‌డేట్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆ పాత్ర పేరు వైజయంతి అని, ఆమె తనయుడు అర్జున్ రోల్‌లో కళ్యాణ్ రామ్ కనిపిస్తారని తెలుస్తోంది. ఆ పాత్రల మీదుగా మూవీకి అర్జున్ సన్నాఫ్ వైజయంతి అనే టైటిల్ పెట్టాలని మూవీ టీమ్ భావిస్తున్నట్లు సమాచారం.

News March 5, 2025

హలో..! ఇంకా ఎంతసేపు భయ్యా..??

image

ఇది హైదరాబాద్‌లో నీళ్ల ట్యాంకర్ డ్రైవర్లకు ఫోన్లలో వస్తున్న ప్రశ్న. ఫిబ్రవరిలోనే నగరంలో భూగర్భ జలాలు తగ్గడంతో అనేక చోట్ల ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. వెస్ట్ జోన్‌లో ఇది మరీ ఎక్కువగా ఉంది. 2024లో మార్చిలో అక్కడ రోజుకు 15 వేల ట్యాంకర్లు వెళ్తే ఈసారి ఇది Febలోనే జరిగింది. డిమాండ్‌కు తగ్గట్లు జలమండలి ట్యాంకర్ల సరఫరా లేదు. దీంతో ప్రైవేటులో కొందరు రూ.2 వేల చొప్పున వసూలు చేస్తున్నారు.

News March 5, 2025

BSE, NSE మధ్య కోల్డ్‌వార్?

image

దేశంలోని 2 అతిపెద్ద స్టాక్‌మార్కెట్ల మధ్య కోల్డ్‌వార్ మొదలైందని ట్రేడర్లు ఆరోపిస్తున్నారు. తాజాగా నిఫ్టీ వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ డెరివేటివ్స్ ఎక్స్‌పైరీని NSE THU నుంచి MONకి మార్చింది. వీకెండ్లో అంతర్జాతీయ పరిణామాలు వేగంగా మారుతుండటంతో ఇలా చేశామంది. డెరివేటివ్స్ వాల్యూమ్ పెంచుకొనేందుకే ఇలా చేసిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. NSE నిర్ణయంతో BSE షేర్లు 8.3% నష్టంతో రూ.4078 వద్ద చలిస్తున్నాయి.

News March 5, 2025

APPLY NOW.. నెలకు రూ.5000

image

PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ కోసం దరఖాస్తు గడువు MAR 12తో ముగియనుంది. టెన్త్, ఇంటర్, డిప్లొమా, ITI, డిగ్రీ చదివిన 21-24 ఏళ్ల వయసు కలిగిన నిరుద్యోగులు దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8లక్షలలోపు ఉండాలి. దీని ద్వారా దేశంలోని టాప్-500 కంపెనీల్లో ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తారు. నెలకు రూ.5000 స్టైఫండ్, వన్‌టైం గ్రాంట్ కింద రూ.6000 ఇస్తారు. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News March 5, 2025

మళ్లీ పెరిగిన బంగారం ధర!

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.550 పెరిగి రూ.80,650లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.600 పెరగడంతో రూ.87,980లకు చేరింది. కాగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ రూ.1,07,000 వద్ద కొనసాగుతోంది. వివాహాది శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీ డిమాండ్ నెలకొంది.