India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మార్చి 5, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 5.20 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.32 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.24 గంటలకు
ఇష: రాత్రి 7.36 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

☛ తిథి: శుక్ల షష్టి, రా.5.48 వరకు
☛ నక్షత్రం: భరణి, ఉ.6.58 వరకు
☛ శుభ సమయం: ఏమీ లేవు
☛ రాహుకాలం: మ.12.00 నుంచి 1.30 వరకు
☛ యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
☛ దుర్ముహూర్తం: ఉ.11.36-నుంచి 12.24 వరకు
☛ వర్జ్యం: ఉ.6.31 నుంచి 8.02 వరకు
☛ అమృత ఘడియలు: తె.3.04 గంటల నుంచి 4.35 వరకు

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ICC వన్డే టోర్నీల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పారు. ఇవాళ ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో అతడు ఒక సిక్సర్ బాది ఈ ఘనత సాధించారు. ఇప్పటివరకు ఈ రికార్డ్ క్రిస్ గేల్(64) పేరిట ఉండగా తాజాగా రోహిత్ 65 సిక్సర్లతో దాన్ని బద్దలుకొట్టారు. తర్వాతి స్థానాల్లో మ్యాక్స్‌వెల్(46), మిల్లర్(42), గంగూలీ(42) ఉన్నారు.

* CT ఫైనల్ చేరిన భారత్
* రెడ్ బుక్ తన పని చేసుకుంటూ వెళ్తోంది: లోకేశ్
* MLCలుగా ఆలపాటి రాజా, పేరాబత్తుల విజయం
* 67ఏళ్ల పోసానిని వేధిస్తున్నారు: అంబటి
* CM రేవంత్‌కు పాలన చేతకావట్లేదు: MP లక్ష్మణ్
* SLBC టన్నెల్ సహాయక చర్యల్లో పురోగతి
* TG: ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు
* భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు
* మార్కెట్లు ఫ్లాట్.. LIC పోర్ట్‌ఫోలియోకి గండి

‘సాక్రెడ్ గేమ్స్’తో గుర్తింపు పొందిన హీరోయిన్ కుబ్రా సైత్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయం వెల్లడించారు. గతంలో తాను అండమాన్ ట్రిప్‌కు వెళ్లినప్పుడు ఫ్రెండ్‌తో కలవడం వల్ల గర్భం దాల్చినట్లు చెప్పారు. భయపడి ఒంటరిగా వెళ్లి అబార్షన్ చేయించుకున్నట్లు తెలిపారు. కొన్నేళ్ల వరకు అది ఎవరికీ చెప్పలేదన్నారు. ఈ విషయాలన్ని తన బయోగ్రఫీ ‘ఓపెన్ బుక్’లో పొందుపర్చినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

తనను ‘లేడీ సూపర్ స్టార్’ అని పిలవొద్దని, పేరుతోనే పిలవాలని స్టార్ హీరోయిన్ నయనతార తన ఫ్యాన్స్, మీడియా, సినీ వర్గాలను రిక్వెస్ట్ చేశారు. అభిమానులు అలా పిలవడం తనకు సంతోషంగా ఉన్నా ‘నయనతార’ అనే పేరే తన హృదయానికి దగ్గరైందని చెప్పారు. అది తనకు నటిగానే కాకుండా వ్యక్తిగానూ తనేంటో తెలియజేస్తుందని ఓ ప్రకటన విడుదల చేశారు. బిరుదులు వెలకట్టలేనివని, ఒక్కోసారి అవే మన పని నుంచి దూరం చేసే ఇమేజ్ తెస్తాయన్నారు.

సినిమా ఇండస్ట్రీలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సమంత కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసినట్లు తెలిపారు. తొలి చిత్రం ‘మాస్కో కావేరి’ షూటింగ్ అంతరాయాల వల్ల పెద్దగా గుర్తులేదన్నారు. ఆ తర్వాత మొదలైన ‘ఏమాయ చేశావే’లో అన్ని సీన్లు గుర్తున్నట్లు చెప్పారు. ఆ సినిమాలోని ప్రతి డీటెయిల్ ఇప్పటికీ మర్చిపోలేదన్నారు. ఆ స్థాయిలో సంతృప్తి ఇచ్చిన పాత్రలు తక్కువని, గౌతమ్ మేనన్‌తో పనిచేయడం గొప్ప అనుభూతి అని తెలిపారు.

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించిన టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు అని కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ ట్వీట్ చేశారు. ‘కీలక మ్యాచ్‌లో 84 రన్స్ చేయడంతో పాటు ICC నాకౌట్ మ్యాచుల్లో వెయ్యి రన్స్ చేసిన తొలి ప్లేయర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీకి ప్రత్యేక అభినందనలు’ అని ఆమె రాసుకొచ్చారు. కాగా ఇటీవల రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడంతో షామా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

TG: ఆదిలాబాద్-కరీంనగర్-నిజామాబాద్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి దూసుకెళ్తున్నారు. ఐదు రౌండ్లు ముగిసేసరికి 7,142 ఓట్ల ముందంజలో ఉన్నారు. అంజిరెడ్డికి 38,553, నరేందర్ రెడ్డి (కాంగ్రెస్) 31,411, ప్రసన్న హరికృష్ణ (బీఎస్పీ) 26,300 ఓట్లు సాధించారు.
Sorry, no posts matched your criteria.