India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: SLBC టన్నెల్ సహాయక చర్యల్లో పురోగతి కనిపించింది. సొరంగంలో పనుల కోసం ఉపయోగించే కన్వేయర్ బెల్ట్ మరమ్మతులకు గురికాగా, సాంకేతిక సిబ్బంది దాన్ని పునరుద్ధరించారు. ప్రస్తుతం అది పని చేస్తోంది. దీంతో సొరంగంలోని బురద, మట్టిని తొలగించే ప్రక్రియ వేగవంతం కానుంది. సొరంగంలో చిక్కుకుపోయిన 8మంది ఉద్యోగుల ఆచూకీ కోసం 10 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

స్టాక్‌మార్కెట్లు స్వల్పంగా నష్టపోయాయి. నిఫ్టీ 22,082 (-36), సెన్సెక్స్ 72,989 (-96) వద్ద ముగిశాయి. గ్యాప్‌డౌన్లో మొదలైన సూచీలు నష్టాలను కొంత పూడ్చుకున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్, మీడియా, మెటల్, PSU బ్యాంకు, వినియోగం, O&G షేర్లు ఎగిశాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా సూచీలు నష్టపోయాయి. ఎస్బీఐ, BPCL, BEL, శ్రీరామ్ ఫైనాన్స్, Adani Ent టాప్ గెయినర్స్. బజాజ్ ఆటో, హీరోమోటో, బజాజ్ ఫిన్‌సర్వ్ టాప్ లూజర్స్.

AP: రాష్ట్రంలో ఐదేళ్లుగా ఆదాయం పెరగడం ఆగిపోయిందని మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో అన్నారు. ‘రాష్ట్ర ఆదాయం, కేంద్రం నుంచి వచ్చేది కలిపి రూ.1,54,065cr. రాష్ట్రం అప్పులు, వడ్డీలు రూ.63,962cr కట్టాల్సి ఉంది. జీతభత్యాలు, వడ్డీలు, అప్పుల అసలు కలిపి రూ.65,962cr ఖర్చు చేస్తున్నాం. జీతభత్యాలు, అప్పులు, వడ్డీలకే మనకు వచ్చే ఆదాయం సరిపోతోంది. అభివృద్ధి పనులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి’ అని అన్నారు.

పన్ను ఎగ్గొడుతున్నారని డౌటొస్తే చాలు 2026, APR 1 నుంచి IT అధికారులు మీ కంప్యూటర్లు, ఈమెయిల్స్, SM, బ్యాంకు, ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్ సహా అన్ని రకాల డిజిటల్ అకౌంట్లను తనిఖీ చేయడం ఖాయం. వెల్లడించని ఆదాయం, బంగారం, నగలు, విలువైన వస్తువులు, ప్రాపర్టీ ఉన్నాయని భావిస్తే ఇలా చేస్తారు. గతంలో ఇళ్లు, బీరువా, లాకర్ తాళాలను పగలగొట్టేందుకే అధికారం ఉండేది. కొత్త IT చట్టంలో పైవాటినీ అనుమతించారు.

స్టార్ హీరో కార్తీ సర్దార్-2 షూటింగ్‌లో గాయపడ్డారు. మైసూరులో ఈ చిత్రానికి సంబంధించి కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఆయన కాలికి గాయమైంది. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించి చికిత్స చేసిన వైద్యులు వారం విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో ఆయన చెన్నై వెళ్లిపోవడంతో షూటింగ్ నిలిచిపోయింది. పీఎస్ మిత్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కార్తీ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారు.

భారత జట్టుకు హెడేక్ తెప్పించిన ఆసీస్ ప్లేయర్ ట్రావిస్ హెడ్‌ను స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఔట్ చేసి ఔరా అనిపించారు. హెడ్ సిక్సులు, ఫోర్లతో టెన్షన్ పెట్టించడంతో సోషల్ మీడియాలో అతని పేరు మారుమోగింది. అతణ్ని ఔట్ చేయడంతో నెటిజన్లు ‘చక్రవర్తి’ పేరునూ ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం Xలో ‘Travis Head’, ‘Varun’ హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండవుతుండగా, అద్భుతమైన క్యాచ్ పట్టిన గిల్‌పైనా ప్రశంసలొస్తున్నాయి.

AP: అసెంబ్లీ లాబీల్లో CM చంద్రబాబు, లోకేశ్ పేషీల్లో MLC <<15634671>>ఆశావహులు <<>>చక్కర్లు కొడుతున్నారు. బీద రవిచంద్ర యాదవ్, కొమ్మాలపాటి శ్రీధర్, బుద్దా వెంకన్న, BT నాయుడు, దువ్వారపు రామారావు, అశోక్ బాబు, ఏరాసు ప్రతాప్, లింగారెడ్డి, రెడ్డి సుబ్రహ్మణ్యం సహా పలువురు వారిని కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అటు ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన దేవినేని ఉమ, వర్మ, వంగవీటి రాధా సహా పలువురి పేర్లూ రేసులో ఉన్నాయి.

TG: కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది. మొదటి రౌండ్ పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 6712, నరేందర్ రెడ్డి (కాంగ్రెస్) 6676, ప్రసన్న హరికృష్ణ 5867, రవీందర్ సింగ్ 107, మహమ్మద్ ముస్తాక్ అలీకి 156 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రెండో రౌండ్ లెక్కింపు ప్రారంభమైందన్నారు.

స్టాక్‌మార్కెట్ల పతనంతో LIC స్టాక్ పోర్టుఫోలియో విలువ ఏకంగా ₹1.45లక్షల కోట్లు తగ్గిపోయింది. 2024 DECలో ₹14.9లక్షల కోట్లుగా ఉన్న విలువ ఇప్పుడు ₹13.4లక్షల కోట్లకు చేరుకుంది. ITCలో ₹17,007CR, TCSలో ₹10,509CR, SBIలో ₹8,568CR, INFYలో ₹7640CR, LTలో ₹7605CR మేర నష్టపోయింది. 310కి పైగా కంపెనీల్లో LIC ఒక శాతానికి పైగా పెట్టుబడి పెట్టింది. RILలో అత్యధికంగా ₹1.03L CR, ITCలో ₹75,780L CR హోల్డింగ్స్ ఉన్నాయి.

AIతో సగం ఉద్యోగులతోనే డబుల్ రెవెన్యూ సాధించాలని టీమ్స్‌ను సవాల్ చేస్తున్నామని HCL టెక్ CEO<<15647926>> విజయ్<<>> కుమార్ చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. Infy CEO సలిల్ పారేఖ్ ఆయనతో ఏకీభవించడం మరింత భయపెడుతోంది. కంపెనీలన్నీ AI దారి అనుసరిస్తే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో సగం మందికి జాబ్స్ పోతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే వెస్ట్ నుంచి ప్రాజెక్టులు తగ్గి రెవెన్యూ మందగించిన వేళ మరెన్ని దుర్వార్తలు వినాల్సి వస్తోందో!
Sorry, no posts matched your criteria.