News March 4, 2025

సీఎం రేవంత్‌కు పాలన చేతకావట్లేదు: ఎంపీ లక్ష్మణ్

image

TG: KCR చేసిన తప్పిదాలే సీఎం రేవంత్ చేస్తున్నారని BJP MP లక్ష్మణ్ విమర్శించారు. BRS చీఫ్‌కు పట్టిన గతే ఈయనకూ పడుతుందని జోస్యం చెప్పారు. MLC ఎన్నికలు ఇందుకు నాంది అని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు ముసుగులో BRS నేతలు లబ్ధి పొందారని, రైతులకు న్యాయం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు. సీఎంకు పాలన చేతకాక గందరగోళంతో రాష్ట్రాన్ని ఇబ్బందుల్లో పడేస్తున్నారని ఫైరయ్యారు.

News March 4, 2025

INDvAUS: భారత్ బౌలింగ్.. జట్లు ఇవే

image

ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో భారత్ తొలుత బౌలింగ్ చేయనుంది. జట్లు ఇవే.

భారత జట్టు: రోహిత్, గిల్, కోహ్లీ, అయ్యర్, అక్షర్, రాహుల్, హార్దిక్, జడేజా, షమీ, కుల్‌దీప్, వరుణ్
ఆస్ట్రేలియా జట్టు: కనోలీ, హెడ్, స్మిత్, లబుషేన్, ఇంగ్లిస్, కేరీ, మ్యాక్స్‌వెల్, డ్వార్షుయిస్, ఎల్లిస్, జంపా, సంఘా

News March 4, 2025

INDvAUS: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్‌లో జరగనున్న తొలి సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

News March 4, 2025

అయోధ్యే కాదు కుంభమేళా పైనా ఉగ్రదాడికి కుట్ర!

image

అయోధ్య రామమందిరంపై దాడికి ప్లాన్ చేసిన టెర్రరిస్టు <<15639611>>అబ్దుల్<<>> రెహ్మాన్‌ అరెస్టు చేయడం ద్వారా ATS, STF భారీ కుట్రల్నే భగ్నం చేశాయి. అతడు ISISలోని ISKP మాడ్యూల్‌కు చెందినవాడిగా తెలిసింది. 18 నెలల క్రితం నెట్‌వర్క్‌లో చేరి ఆన్‌లైన్, వీడియోకాల్స్ ద్వారా ట్రైనింగ్ తీసుకున్నాడు. రామ మందిరంపై దాడికి ఆదేశాలు పొందాడు. ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో లోన్ ఊల్ఫ్ అటాక్ చేసేందుకూ సిద్ధపడ్డాడని సమాచారం.

News March 4, 2025

మద్య నిషేధం ఉన్నప్పటికీ 4 సెకండ్లకో బాటిల్ సీజ్!

image

గుజరాత్‌లో మద్య నిషేధ చట్టం అమలవుతున్న విషయం తెలిసిందే. అక్కడ ఆల్కహాల్ అమ్మినా, కొనుగోలు చేసినా నేరమే. కానీ, అక్కడ ప్రతి 4 సెకండ్లకు ఓ లిక్కర్ బాటిల్ సీజ్ అవుతోంది. 2024లో రూ.144 కోట్లు విలువ చేసే దాదాపు 82 లక్షల బాటిళ్లను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అహ్మదాబాద్‌ సిటీ & రూరల్‌లోనే 4.38 లక్షల బాటిళ్లు సీజ్ అయ్యాయి. వినూత్నంగా స్మగ్లింగ్ చేస్తున్నప్పటికీ పోలీసులు వారిని గుర్తిస్తున్నారు.

News March 4, 2025

58.35 గంటల ముద్దుతో రికార్డ్.. విడిపోయిన జంట

image

ఒకటీ రెండు కాదు 58Hr పాటు ముద్దు పెట్టుకుని గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన ఇక్కాచాయ్-లక్సానా జంట షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల విడాకులు తీసుకున్నట్లు ప్రకటించింది. అయితే ఇందుకు గల కారణాలను వెల్లడించలేదు. ఈ థాయ్‌లాండ్ కపుల్ 2013లో 58 గంటల 35 నిమిషాల 58 సెకన్లపాటు ముద్దు పెట్టుకుని ప్రపంచ రికార్డు సృష్టించింది.

News March 4, 2025

KCRపై అనర్హత వేయాలని పిల్.. విచారణ వాయిదా

image

TG: KCR అసెంబ్లీకి రావడం లేదని దాఖలైన పిల్‌ను హైకోర్టు విచారించింది. ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయనకు సభలో ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సిన బాధ్యత ఉందని, సభకు రాని ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని పిటిషనర్ కోరారు. దీనిపై తాము జోక్యం చేసుకోవచ్చా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. పిల్‌కు అర్హత లేదని అసెంబ్లీ తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు వినిపించేందుకు పిటిషనర్ గడువు కోరడంతో 2 వారాలకు వాయిదా పడింది.

News March 4, 2025

పాకిస్థానీ అని పిలవడం నేరం కాదు: సుప్రీం కోర్టు

image

మియాన్-తియాన్, పాకిస్థానీ అని పిలవడాన్ని నేరంగా పరిగణించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఝార్ఖండ్‌కు చెందిన ఓ ఉర్దూ తర్జుమా ఉద్యోగి వద్ద ఓ వ్యక్తి ఆర్టీఐ దరఖాస్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా వారి మధ్య గొడవ జరిగి ఉద్యోగిని పాకిస్థానీ అంటూ దరఖాస్తుదారుడు దూషించాడు. అతడిపై చర్యలకు ఝార్ఖండ్ కోర్టు ఆదేశించగా అతడు సుప్రీంను ఆశ్రయించాడు. ఆ కేసు విచారణలో ధర్మాసనం తాజా తీర్పు చెప్పింది.

News March 4, 2025

కాకినాడ: MLCగా గెలిచిన రాజశేఖరం నేపథ్యం ఇదే..!

image

ఉభయగోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన పేరాబత్తుల రాజశేఖరం స్వగ్రామం కోనసీమ జిల్లాలోని జి.వేమవరం. తొలుత ఆయన కాంగ్రెస్ ఎంపీటీసీగా, అనంతరం టీడీపీ నుంచి ఎంపీపీ, జడ్పీటీసీగా పనిచేశారు. ఆక్వా వ్యాపారం చేసే రాజశేఖరం ప్రస్తుతం కాకినాడలో నివాసం ఉంటున్నారు. BA పూర్తిచేసిన ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న రాజశేఖరానికి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వరించింది.

News March 4, 2025

BREAKING: మహిళలకు అద్దె బస్సులు.. ఉత్తర్వులు జారీ

image

TG: మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తొలి విడతలో 150 డ్వాక్రా సంఘాలకు 150 ఆర్టీసీ బస్సులను కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది. ప్రతి నెలా ఒక్కో బస్సుకు రూ.77,220 అద్దెను ఆర్టీసీ చెల్లించనుంది. మార్చి 8న మహిళా దినోత్సవం రోజున HYD పరేడ్ గ్రౌండ్‌లో 50 బస్సులను సీఎం రేవంత్, మంత్రులు ప్రారంభించనున్నారు. త్వరలోనే మరో 450 సంఘాలకు బస్సులను అందించనున్నారు.