News March 4, 2025

మేలో ‘ఎల్లమ్మ’ షూటింగ్!

image

‘బలగం’తో భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వేణు తెరకెక్కించే కొత్త సినిమా ‘ఎల్లమ్మ’ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నితిన్ హీరోగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ మే నెలలో ప్రారంభం కానున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించిన వేణు.. తాజాగా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం ముంబైకి వెళ్లారు. మ్యూజిక్ డైరెక్టర్లు అజయ్-అతుల్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

News March 4, 2025

రోహిత్ ఈ సారైనా టాస్ గెలువు: ఆకాశ్ చోప్రా

image

రోహిత్‌శర్మ ఈసారైనా టాస్ గెలవాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కోరారు. ఆసీస్‌తో మ్యాచ్‌‌లో టాస్ పాత్ర కీలకం కానుందని తన యూట్యూబ్ ఛానల్‌లో తెలిపారు. ఈ పిచ్‌లపై ఛేజింగ్ చాలా కష్టమని, సెమీస్‌లో టాస్‌ గెలవటం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఇప్పటివరకూ టాస్ ఓడినప్పటికీ మ్యాచులలో గెలిచింది. అయితే రోహిత్ శర్మ వరుసగా 10సార్లు టాస్ ఓడి రికార్డు సృష్టించారు.

News March 4, 2025

దిశvsశక్తి.. మండలిలో వాడీవేడీ చర్చ

image

AP: గత ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్‌ను తొలగించడంపై మండలిలో YCP MLC వరుదు కళ్యాణి మండిపడ్డారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరవైందని దుయ్యబట్టారు. ఆమె వ్యాఖ్యలకు మంత్రులు సవిత, అనిత కౌంటరిచ్చారు. చట్టబద్ధత లేని దిశ గురించి ఆమె మాట్లాడుతున్నారని, ఆ యాప్‌తో ఎంతమంది మహిళలను రక్షించారని ప్రశ్నించారు. తాము నెట్‌వర్క్ లేని చోట కూడా పనిచేసేలా శక్తి యాప్‌ను మహిళా దినోత్సవం రోజున ప్రారంభిస్తామని తెలిపారు.

News March 4, 2025

నేడు ప్రపంచ ఊబకాయ దినోత్సవం

image

మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ప్రధాన మహమ్మారి ఊబకాయమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే దానిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఊబకాయ ఫెడరేషన్ 2015 నుంచి మార్చి 4ను ఊబకాయ అవగాహనా దినోత్సవంగా నిర్వహిస్తోంది. ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు జనం ఊబకాయంతో బాధపడుతున్నట్లు అంచనా. మధుమేహం, గుండె జబ్బులు, బీపీ, లివర్, ఊపిరితిత్తుల సమస్యలు, గ్యాస్ట్రిక్, ఎముకల అనారోగ్యాలకు ఊబకాయం కారణమవుతోంది.

News March 4, 2025

టీమ్ ఇండియా ఆందోళనంతా అతడి గురించే: DK

image

టీమ్ ఇండియాకు ఆస్ట్రేలియా జట్టుతో భయం లేదు కానీ మానసికంగా ట్రావిస్ హెడ్ అనే అడ్డంకి ఆటగాళ్ల మైండ్‌లో ఉంటుందని మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ అంచనా వేశారు. ‘గతంలో నాకౌట్ గేమ్స్‌లో న్యూజిలాండ్‌తో ఆడుతున్నప్పుడు ఇలాంటి భావన ఉండేది. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడుతోంది. హెడ్ వికెట్ తీస్తే భారత్ ఊపిరి పీల్చుకోవచ్చు’ అని DK పేర్కొన్నారు.

News March 4, 2025

సిరాజ్‌తో డేటింగ్ చేయట్లేదు: మహీరా శర్మ

image

IND క్రికెటర్ సిరాజ్‌తో <<15305689>>డేటింగ్ వార్తలను<<>> బాలీవుడ్ నటి మహీరా శర్మ ఖండించారు. తాను ఎవరితోనూ రిలేషన్‌లో లేనని స్పష్టం చేశారు. ఫ్యాన్స్ ఎవరితోనైనా సంబంధం కలిపేస్తారని, వాటిని ఆపలేమని పేర్కొన్నారు. ‘కో స్టార్లతో రిలేషన్‌ ఉందంటారు. ఎడిటెడ్ ఫొటోలను SMలో పోస్టు చేస్తారు. వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు. ఇటీవల ఆమె తల్లి సానియా శర్మ కూడా డేటింగ్ వార్తలను కొట్టిపారేశారు.

News March 4, 2025

“నాటు”ని బీట్ చేసేలా ఎన్టీఆర్-హృతిక్ డాన్స్?

image

వార్-2 మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఎన్టీఆర్-హృతిక్ రోషన్‌లతో ఒక భారీ సాంగ్ షూటింగ్ ఇవాళ్టి నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వీరిద్దరి స్టెప్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయన్నారు. క్లైమాక్స్ ఫైట్‌కు ముందు వచ్చే ఈ పాటని 500 మందితో డ్యాన్సర్లతో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రీతమ్ మ్యూజిక్‌ అందించగా బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇందులో యంగ్ టైగర్ ‘RAW’ ఏజెంట్‌గా నటిస్తున్నారు.

News March 4, 2025

5 గంటలు వెయిట్ చేస్తే నిమిషంలో రిజెక్ట్.. రెడిట్ పోస్ట్ వైరల్!

image

‘సూర్య’ వెబ్ సిరీస్ చూశారా? అందులో టాలెంట్ ఉన్న సూర్యకు కాకుండా మహిళకు జాబ్ ఇచ్చేందుకు కంపెనీ మొగ్గుచూపుతుంది. బెంగళూరుకు చెందిన ఓ యువకుడికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ‘ఓ ఇంటర్వ్యూకు వెళ్లి దాదాపు 5 గంటలు వేచి ఉన్నా. నిమిషం మాత్రమే ఇంటర్వ్యూ చేసి ఇంగ్లిష్ వంకతో రిజెక్ట్ చేశారు. కంపెనీ HR మహిళా అభ్యర్థికి అనుకూలంగా ఉన్నాడు’ అని అతను రెడిట్‌లో వాపోయాడు. ఈ పోస్ట్ వైరలవుతోంది. మీకూ ఇలా జరిగిందా?

News March 4, 2025

అకౌంట్లోకి రూ.15,000.. కీలక ప్రకటన

image

AP: ‘తల్లికి వందనం’ పథకంపై మంత్రి నారా లోకేశ్ శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఈ పథకం గైడ్‌లైన్స్ విడుదల చేస్తామని ప్రకటించారు. పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. మే నెలలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని, బడ్జెట్‌లో రూ.9407 కోట్ల కేటాయించినట్లు తెలిపారు. కాగా ఈ పథకం కింద 1-12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రభుత్వం రూ.15,000 జమ చేయనుంది.

News March 4, 2025

జగన్ ప్రభుత్వం పోలవరాన్ని నిలిపేసింది: మంత్రి నిమ్మల

image

AP: పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు కుదిస్తూ వైసీపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో ఆరోపించారు. జగన్ సర్కార్ ప్రాజెక్టును నిలిపేసిందని, డయాఫ్రంవాల్ కొట్టుకుపోయేలా చేసిందని విమర్శించారు. 2025 కల్లా పోలవరం ఎడమ కాలవ పనులు పూర్తిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి రాయలసీమ, ఉత్తరాంధ్రకు నీటిని తరలిస్తామని హామీ ఇచ్చారు.