India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: గంజాయి, డ్రగ్స్ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మాదకద్రవ్యాల కేసుల్లో పట్టుబడిన వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలను నిలిపేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమైనట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. త్వరలోనే క్యాబినెట్‌లో చర్చించి ఆమోదించనున్నట్లు తెలిపాయి.

TG: ఆస్తి కోసం తల్లినే చంపేసిన దారుణ ఘటన సంగారెడ్డి(D) తెల్లాపూర్‌లో జరిగింది. మల్లారెడ్డి, రాధికారెడ్డి దంపతుల చిన్న కుమారుడు కార్తీక్ మద్యానికి బానిసయ్యాడు. కోయంబత్తూరులోని డీఅడిక్షన్‌లో చేర్చినా అతనిలో మార్పు రాలేదు. తిరిగొచ్చాక రూ.100 కోట్ల విలువైన భూమిని తనకు ఇవ్వాలంటూ పేరెంట్స్‌ను వేధించేవాడు. నిన్న నిద్రిస్తున్న తల్లిని కత్తితో 9చోట్ల పొడిచి చంపేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ సహా చాలా నగరాలు, పట్టణాల్లో ఇంటి అద్దెలు విపరీతంగా ఉంటున్నాయి. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ల అద్దెలూ నోరెళ్లబెట్టేలానే ఉన్నాయి. నెలజీతంలో సగం ఇంటి అద్దెకే పోతోందని చిరు ఉద్యోగులు వాపోతున్నారు. నీళ్లు, ఇతర సౌకర్యాలు లేకపోయినా అద్దెలు ఆకాశాన్నే తాకుతున్నాయి. ఒక ప్రాతిపదిక అనేది లేకుండా ఓనర్లు ఇష్టారీతిన పెంచే ఈ అద్దెలను ప్రభుత్వాలు నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.

భూమిపై సూర్యోదయం ఎంత రమణీయంగా ఉంటుందో మనకు తెలుసు. మరి చంద్రుడి పైనుంచి చూస్తే ఎలా ఉంటుంది? పై ఫొటోలో ఉన్నట్లు ఉంటుంది. ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ సంస్థకు చెందిన బ్లూ ఘోస్ట్ ల్యాండర్ ఈ అద్భుతమైన ఫొటోను తీసింది. నాసాకు చెందిన పే లోడ్‌తో ఈ నెల 2న చంద్రుడిపై దిగిన ల్యాండర్ ఆ వెంటనే ఈ ఫొటోను పట్టేసింది.

ప్రపంచ వ్యాప్తంగా ట్రేడ్‌వార్ ముదురుతోంది. కెనడా, మెక్సికోకు తోడుగా అమెరికా ఉత్పత్తులపై చైనా ప్రతీకార సుంకాలను ప్రకటించింది. సోయాబీన్, పప్పులు, పోర్క్, బీఫ్, అక్వాటిక్ ప్రొడక్ట్స్, పండ్లు, కూరగాయలు, డెయిరీ ప్రొడక్ట్స్‌పై మార్చి 10 నుంచి 10% సుంకాలు అమల్లోకి వస్తాయని చైనా ఫారిన్ మినిస్ట్రీ తెలిపింది. చికెన్, గోధుమలు, పత్తి సహా మరికొన్ని వస్తువులపై అదనంగా 10-15% సుంకాలు విధిస్తామని వెల్లడించింది.

ఆమె ఓ బాడీ బిల్డర్. తన శరీరాకృతితో వందల కొద్ది అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. ఆమే కర్ణాటకకు చెందిన చిత్ర పురుషోత్తం. తాజాగా ప్రీ-వెడ్డింగ్ షూట్‌లో భాగంగా వధువు గెటప్‌లో దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. అందరిలా సిగ్గుతో కాకుండా గాంభీర్యం ప్రదర్శిస్తూ ఫొటోకు పోజులిచ్చారు. ఎప్పుడూ బాడీ బిల్డర్ డ్రెస్సుల్లో కనిపించే ఆమె కాంచీపురం చీర, నగలతో దర్శనమివ్వడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

రోహిత్ శర్మ fat అని అవమానించిన కాంగ్రెస్ నేత <<15636348>>షమా<<>> మహ్మద్ ఈ వివాదాన్ని మరింత పెద్దది చేస్తున్నారు. Fans, BJP నేతల విమర్శలను తిప్పికొట్టేందుకు నటి, MP కంగనా రనౌత్‌ను మధ్యలోకి లాగారు. గతంలో రైతు ఉద్యమానికి మద్దతుగా హిట్‌మ్యాన్ ట్వీట్ చేశారు. దానికి ‘దోబీ కా కుత్తా న ఘర్ కా న ఘాట్ కా’ అంటూ విమర్శించిన కంగన రిప్లైను ఆమె పోస్టు చేశారు. వీటిపై మీరేమంటారు మన్‌సుఖ్ మాండవీయ, కంగన అని ప్రశ్నించారు.

US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై భారీగా సుంకాల్ని విధించడంపై దిగ్గజ వ్యాపారవేత్త వారెన్ బఫెట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘టారిఫ్‌లు విధించడమంటే యుద్ధాన్ని ఆహ్వానించినట్లే. వీటి గురించి అమెరికన్లకు గత అనుభవాలున్నాయి. సర్వత్రా ధరలు పెరిగిపోతాయి. అమెరికా ఆర్థిక పరిస్థితి గురించి నేను ఇక మాట్లాడదలచుకోలేదు. గత 60 ఏళ్లలో మా సంస్థ నుంచి 101 బిలియన్ డాలర్ల మేర పన్ను చెల్లించాం’ అని తెలిపారు.

భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు పటిష్ఠంగా ఉన్నాయని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనస్ స్పష్టం చేశారు. మధ్యలో చిన్న అపార్థాలు వచ్చాయని, వాటిని పరిష్కరించుకుంటామని తెలిపారు. రెండు దేశాల మధ్య పరస్పర సహకారం ఉందన్నారు. ఈ వారంలోనే తానే వ్యక్తిగతంగా ప్రధాని మోదీతో మాట్లాడానని చెప్పారు. పాక్‌తో దోస్తీ, ఇతర రాజకీయ కారణాలతో బంగ్లాదేశ్ భారత్‌కు దూరం జరుగుతోందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

మహారాష్ట్రలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. సర్పంచ్ హత్య కేసులో ఆరోపణలు రావడంతో మంత్రి ధనంజయ ముండే రాజీనామా చేయగా సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆమోదం తెలిపారు. నిన్న రాత్రి ఎన్సీపీ చీఫ్, మంత్రి అజిత్ పవార్, ముండేతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. కేసు తేలే వరకు పదవి నుంచి తప్పుకోవాలని సీఎం సూచించగా ఆయన రిజైన్ చేశారు.
Sorry, no posts matched your criteria.