News January 27, 2025

చరిత్ర సృష్టించిన బుమ్రా

image

భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించారు. ICC మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2024 అవార్డును సొంతం చేసుకున్నారు. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ అవార్డు పొందిన తొలి పేసర్‌గా నిలిచారు. 2024లో బుమ్రా 14.92 సగటుతో 71 వికెట్లు పడగొట్టి, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నారు. కాగా ఇంగ్లండ్‌‌తో T20 సిరీస్‌కు బుమ్రాకు విశ్రాంతి ఇచ్చిన బీసీసీఐ ఛాంపియన్స్ ట్రోఫికి ఎంపిక చేసింది.

News January 27, 2025

పర్యాటకులకు ఎంజాయ్‌మెంట్ కావాలి: అయ్యన్న

image

AP: వైజాగ్ బీచ్‌లో టీ, కాఫీలు తాగేందుకు పర్యాటకులు రారని, వారికి ఎంజాయ్‌మెంట్ కావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. నిబంధనల పేరుతో నియంత్రిస్తే ఎవరూ రారని, కొంత వెసులుబాటు ఉండాలని చెప్పారు. బీచ్‌లలో వాలీబాల్, కబడ్డీ లాంటి పోటీలను పెట్టాలన్నారు. వైజాగ్‌లో ఆయన ‘అరకు చలి ఉత్సవం’ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. పర్యాటక రంగంలో ఇన్వెస్టర్లకు వారం రోజుల్లోనే అనుమతులు వచ్చేలా చర్యలు ఉండాలన్నారు.

News January 27, 2025

20 రోజుల్లో 12 ఘటనలు.. మహిళలకు రక్షణేది?: YCP

image

AP: కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ కరవైందని YCP ఆరోపించింది. ‘రాష్ట్రంలో నిత్యం మ‌హిళ‌లు, బాలిక‌ల‌పై అత్యాచారాలు, దాడులు జ‌రుగుతున్నా అరిక‌ట్ట‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంది. ఇదే విష‌య‌మై Dy.CM పవన్ హోంమంత్రిపై వ్యాఖ్య‌లు చేసిన విష‌యం విధిత‌మే. అయినా అత్యాచారాలు, హ‌త్య‌లు త‌గ్గ‌డం లేదు. వీటివెనక కొంత‌మంది TDPనేత‌లు, వారి కుమారులున్నారు’ అని ట్వీట్ చేసింది. 20రోజుల్లో 12ఘటనలు జరిగాయని పేర్కొంది.

News January 27, 2025

Stock Market: నేలచూపులు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు Mon భారీగా న‌ష్ట‌పోయాయి. Sensex 824 PTS న‌ష్ట‌పోయి 75,366 వ‌ద్ద‌, Nifty 263 PTS ప‌త‌న‌మై 22,829 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. అధిక వెయిటేజీ రంగాలైన ఐటీ, బ్యాంకు, ఫైనాన్స్‌, ఆటో, ఫార్మా, రియ‌ల్టీ రంగాలు నేల‌చూపులు చూశాయి. India Vix 18.14గా న‌మోద‌వ్వ‌డం కీల‌క రంగాల్లో అమ్మ‌కాల ఒత్తిడిని ప్ర‌తిబింబిస్తుంది. Britannia, ICICI, M&M టాప్ గెయినర్స్. HCL, TechM, Wipro టాప్ లూజర్స్.

News January 27, 2025

బీజేపీ భావజాలం ఉన్నవారికే అవార్డులు ఇస్తారా?: ఎంపీ కిరణ్

image

TG: బీజేపీ భావజాలం ఉన్నవారికే అవార్డులు ఇస్తారా అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ ప్రశ్నించారు. <<15279303>>బండి వ్యాఖ్యలు<<>> హాస్యాస్పదమన్నారు. గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వబోమన్న బండి సంజయ్ వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఖండించారు. తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి పేరును అవార్డులకు ప్రతిపాదిస్తే తప్పా అని కౌంటర్ ఇచ్చారు.

News January 27, 2025

ప్రజల అంచనాల మేరకు పనిచేయాలి: సీఎం చంద్రబాబు

image

AP: ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలుపై ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పింఛన్లు, దీపం పథకం, అన్న క్యాంటీన్, ఇసుక సరఫరాతోపాటు ఉద్యోగుల తీరుపై ఆయన ఆరా తీశారు. ప్రజలే ఫస్ట్ అనే విధానంలో వారి అంచనాల మేరకు పనిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్లాలని సూచించారు.

News January 27, 2025

అతనికి మ‌ర‌ణశిక్ష విధించాలన్న పిటిషన్ల స్వీకరణపై తీర్పు రిజర్వ్

image

ట్రైనీ డాక్ట‌ర్‌పై హ‌త్యాచారం కేసులో దోషి సంజ‌య్ రాయ్‌కు మ‌ర‌ణశిక్ష విధించాల‌ని దాఖ‌లైన పిటిషన్ల స్వీకరణపై కలకత్తా హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. దోషికి ట్ర‌య‌ల్ కోర్టు విధించిన జీవిత‌ ఖైదు స‌రిపోద‌ని బెంగాల్ ప్ర‌భుత్వం, CBI కోర్టుకెక్కాయి. తీర్పును స‌వాల్ చేసే అర్హ‌త త‌మ‌కు త‌ప్ప‌ రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేద‌ని CBI వాదించింది. వాద‌న‌లు విన్న న్యాయస్థానం తీర్పు వాయిదా వేసింది.

News January 27, 2025

రంజీలకు సిద్ధమైన రాహుల్, సిరాజ్, పరాగ్

image

టీమ్ఇండియా స్టార్ ప్లేయర్లు రంజీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 30న హరియాణా మ్యాచ్‌కు అందుబాటులో ఉంటానని రాహుల్ కర్ణాటక జట్టుకు సమాచారమిచ్చారు. అటు హైదరాబాద్ తరఫున సిరాజ్, అస్సాం తరఫున రియాన్ పరాగ్ ఆడనున్నారు. మరోవైపు రైల్వేస్‌తో ఆడేందుకు ఢిల్లీ జట్టును ఇవాళ సెలక్టర్లు ప్రకటించనున్నారు. ఇప్పటికే రోహిత్, పంత్ తదితరులు రంజీ మ్యాచులు ఆడుతున్న విషయం తెలిసిందే.

News January 27, 2025

త్రివిక్రమ్ టార్చర్ వల్లే అన్నీ ఆపేశా: పూనమ్ కౌర్

image

డైరెక్టర్ త్రివిక్రమ్‌పై హీరోయిన్ పూనమ్ కౌర్ మరోసారి ఆరోపణలు చేశారు. బాలకృష్ణకు పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా ఆమె ‘జై బాలయ్య’ అని ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు. దీనికి కామెంట్ బాక్స్‌లో ఓ నెటిజన్ ‘మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు?’ అని ప్రశ్నించారు. పూనమ్ అతడికి రిప్లై ఇస్తూ ‘అప్పట్లో సినిమాలు చేసేదాన్ని. కానీ త్రివిక్రమ్, గ్రూప్స్(టాలీవుడ్‌లో గ్రూపిజాన్ని ఉద్దేశించి) టార్చర్ వల్ల అన్నీ ఆపేశా’ అని చెప్పారు.

News January 27, 2025

ముడా స్కామ్‌లో ముఖ్యమంత్రి భార్యకు ఈడీ నోటీసులు

image

మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(MUDA) భూముల స్కామ్ దర్యాప్తులో ఈడీ వేగం పెంచింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ CM సిద్దరామయ్య భార్య పార్వతికి, మంత్రి సురేశ్‌కు నోటీసులు జారీ చేసింది. ముడా భూముల కేటాయింపులో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై గత అక్టోబరులో ఈడీ దర్యాప్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. సిద్దరామయ్య దంపతులతో పాటు సీఎం బావమరిది బీఎం మల్లికార్జున స్వామి ఇందులో నిందితులుగా ఉన్నారు.