India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల ముందు ట్విటర్ వేదికగా పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు వేసిన డైరెక్టర్ ఆర్జీవీ దారికొచ్చారు. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో విజయఢంకా మోగించడంతో ఆయన కళ్లు బైర్లు కమ్మినట్టున్నాయి. దీంతో ట్విటర్లో ‘హేయ్ పవన్ కళ్యాణ్’ అంటూ దండాలు పెట్టే ఎమోజీలను పోస్ట్ చేశారు. దీంతో ‘ఇప్పుడు తెలిసిందా పవన్ అంటే ఏంటో?’ అని ఆయన ఫ్యాన్స్ ఆర్జీవీని ప్రశ్నిస్తున్నారు.
మహారాష్ట్రలో అమరావతి సిట్టింగ్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి నవనీత్ కౌర్ రానా ఓడిపోయారు. ఆమెపై కాంగ్రెస్ అభ్యర్థి బల్వంత్ వాంఖడే 19,731 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వాంఖడేకు 5,26,271 ఓట్లు, నవనీత్ రానాకు 5,06,540 ఓట్లు పోలయ్యాయి. నవనీత్ తెలుగులో పలు సినిమాలు చేశారు. మరోవైపు ముంబై నార్త్ స్థానం నుంచి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కాంగ్రెస్ అభ్యర్థి భూషణ్ పాటిల్‌పై 3.52 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు.
సామాజిక వర్గాల ప్రకారం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ ఏకపక్షంగా సాగలేదు. ముస్లిం ప్రజల ఆధిపత్య సెగ్మెంట్లలో ఇండియా 56, ఎన్డీయే 43 చోట్ల ఆధిక్యం ప్రదర్శించాయి. ఆదివాసీ డామినేట్ ప్రాంతాల్లో ఈ సంఖ్య 15, 35గా ఉంది. దళిత ఆధిపత్యం ఉండే చోట్ల 7, 15 సాధించాయి. జనరల్ ప్రజలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో NDA 228, IND 175తో ఉన్నాయి. ఎస్సీ రిజర్వుడులో 41, 39, ఎస్టీ రిజర్వుడులో 23, 20గా ఈ గణాంకాలు ఉన్నాయి.
* పులివెందుల-వైఎస్ జగన్
* పుంగనూరు-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
* బద్వేల్-దాసరి సుధ, * మంత్రాలయం-వై.బాలనాగిరెడ్డి
* ఆలూరు-బూసినే విరూపాక్షి, దర్శి-శివప్రసాద్
* యర్రగొండపాలెం-తాటిపర్తి చంద్రశేఖర్
* అరకు-రేగం మత్స్యలింగం
* పాడేరు-మత్స్యరాస విశ్వేశ్వరరాజు
* రాజంపేట-ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి
* తంబళ్లపల్లి-పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి
బొత్స, ధర్మాన కుటుంబాలకు ఓటర్లు భారీ షాకిచ్చారు. విజయనగరం జిల్లా చీపురపల్లిలో బొత్స సత్యనారాయణ, గజపతినగరంలో బొత్స అప్పలనర్సయ్య.. టీడీపీ చేతిలో ఓడిపోయారు. అటు విశాఖ ఎంపీ స్థానం నుంచి బరిలో దిగిన బొత్స ఝాన్సీ ఓటమి పాలయ్యారు. శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగిన మంత్రి ధర్మాన ప్రసాదరావు, నరసన్నపేట నుంచి పోటీలో నిలిచిన ధర్మాన కృష్ణదాస్ కూడా టీడీపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు.
AP: ప్రకాశం జిల్లాలో TDP 10 స్థానాల్లో గెలిచింది. అద్దంకి-గొట్టిపాటి రవి, చీరాల-కొండయ్య, పర్చూరు-సాంబశివరావు, ఒంగోలు-దామచర్ల, సంతనూతలపాడు-విజయ్, కొండపి-డీబీవీ స్వామి, కందుకూరు-నాగేశ్వరరావు, కనిగిరి-ఉగ్రనరసింహారెడ్డి, మార్కాపురం-నారాయణరెడ్డి, గిద్దలూరు-అశోక్ గెలుపొందారు. దర్శి, యర్రగొండపాలెంలోనే YCP పాగా వేసింది. బూచేపల్లి శివప్రసాద్, తాటిపర్తి చంద్రశేఖర్ ఇక్కడ విజయం సాధించారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ వరుసగా మూడుసార్లు హిందూపూరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఆయన అల్లుళ్లు కూడా అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. పెద్దల్లుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి నుంచి ఏకంగా 90వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. చిన్న అల్లుడు శ్రీభరత్ 5లక్షలకు పైగా మెజారిటీతో విశాఖ ఎంపీగా గెలుపొందడం విశేషం.
రాజస్థాన్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకే ఓటర్లు పట్టం కట్టారు. మొత్తం 25 స్థానాల్లో బీజేపీ 14, కాంగ్రెస్ 8, సీపీఐ(ఎం), RTLP, భారత్ ఆదివాసీ పార్టీ తలో స్థానంలో విజయం సాధించాయి. బీజేపీకి అత్యధికంగా 49.24శాతం, కాంగ్రెస్‌కు 37.91శాతం ఓట్లు వచ్చాయి. BJP నుంచి గెలిచిన ప్రముఖుల్లో కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, గజేంద్ర సింగ్, స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా ఉన్నారు.
AP: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ 8 ఉమ్మడి జిల్లాల్లో ఖాతానే తెరవలేదు. శ్రీకాకుళం, విజయనగరం, తూ.గో, ప.గో, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లోని నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులెవరూ గెలవలేదు. ఆయా జిల్లాలను కూటమి పార్టీలు ఊడ్చిపారేశాయి. కాగా వైసీపీ కేవలం 11 సీట్లే దక్కించుకుంది.
ఈ ఎన్నికల్లో 10 స్థానాలకు పరిమితమైన YCP కాసేపటి క్రితం మరో నియోజకవర్గాన్ని తన ఖాతాలో వేసుకుంది. దర్శిలో ఫ్యాను గుర్తు అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ 2,597 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. TDP అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి తొలి రౌండ్ నుంచి ఆధిక్యత కనబర్చారు. మధ్యాహ్నం సమయంలో ఓట్ల లెక్కింపుపై ఏజంట్ల మధ్య వాగ్వాదంతో కాసేపు కౌంటింగ్ ఆగింది. ఉన్నతాధికారుల సమక్షంలో తిరిగి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు.
Sorry, no posts matched your criteria.