News January 27, 2025

APలో ‘అందరికీ ఇళ్లు’.. అర్హులు వీరే

image

☞ రేషన్ కార్డు కలిగి ఉండాలి
☞ APలో సొంత స్థలం/ఇల్లు ఉండకూడదు
☞ గతంలో ఎప్పుడూ ఇంటి పట్టా పొంది ఉండకూడదు
☞ 5 ఎకరాల్లోపే మెట్ట, 2.5 ఎకరాల్లో మాగాణి పొలాలు ఉండాలి
☞ గతంలో స్థలం పొందిన వారు రద్దు చేసుకుంటే కొత్తది ఇస్తారు
☞ త్వరలోనే దరఖాస్తులు స్వీకరణ, VRO/RIతో ఎంక్వైరీ
☞ గ్రామ/వార్డు సభల్లో అభ్యంతరాల స్వీకరణ
☞ కలెక్టర్లు, తహశీల్దార్లు, కమిషనర్లు తుది జాబితా ప్రకటిస్తారు

News January 27, 2025

15 గ్యారంటీలతో AAP మ్యానిఫెస్టో

image

AAP 15 గ్యారంటీలతో మ్యానిఫెస్టో ప్రకటించింది. తాము దీన్ని మ్యానిఫెస్టోగా కాదని ‘కేజ్రీవాల్ గ్యారంటీ’గా అభివర్ణిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రతినెలా మహిళలకు రూ.2,100, వృద్ధులకు ఉచిత వైద్యం, 24గంటల తాగునీరు, యమునా నది శుద్ధీకరణ, విద్యార్థులకు ఉచిత రవాణా(మెట్రోలో 50% డిస్కౌంట్) తదితరాలు మ్యానిఫెస్టోలో చేర్చారు. ఢిల్లీ ఎన్నికలు వచ్చే నెల 5న జరగనుండగా, 8న ఫలితాలు వెలువడనున్నాయి.

News January 27, 2025

వసంత లక్ష్మికి సీఎం అభినందనలు

image

AP: యోగాలో గిన్నిస్ రికార్డ్ సాధించిన తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన వసంత లక్ష్మిని CM చంద్రబాబు అభినందించారు. రాష్ట్రానికి చెందిన బిడ్డ అచీవర్ అయినందుకు గర్వంగా ఉందన్నారు. త్వరలోనే ఆమెను కలుస్తానని పేర్కొన్నారు. అంతకుముందు గిన్నిస్ రికార్డ్ సాధించడం ఆనందంగా ఉందని వసంతలక్ష్మి తెలియజేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ చేతులమీదుగా అవార్డు అందుకోవాలని ఉందని ఆమె ట్వీట్ చేయగా CM రీట్వీట్ చేశారు.

News January 27, 2025

ఢిల్లీ పరేడ్‌లో ‘ఏటికొప్పాక’ ప్రదర్శన అద్భుతం: VSR

image

AP: ఢిల్లీ కర్తవ్యపథ్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీ నుంచి ఏటికొప్పాక బొమ్మల శకటం పాల్గొనడంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ‘పురాతన ఏటికొప్పాక బొమ్మల కళను అందంగా ప్రదర్శించారు. ఇది సంప్రదాయం, స్థిరత్వం, హస్తకళల సంపూర్ణ సమ్మేళనం’ అని ట్వీట్ చేశారు. ఇటీవల వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

News January 27, 2025

34ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై గెలిచిన వెస్టిండీస్

image

పాకిస్థాన్‌తో ముల్తాన్‌లో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. 34 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై తొలిసారి టెస్టు గెలిచింది. బౌలర్ జోమెల్ వారికన్ 9 వికెట్లతో చెలరేగడంతో విండీస్ 120 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఆ జట్టు పాక్‌లో టెస్టుల్లో చివరిగా 1990లో గెలవడం గమనార్హం. రెండు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సిరీస్‌ను సమం చేశాయి.

News January 27, 2025

డివిలియర్స్ ఐపీఎల్‌లో సరైన ఫ్రాంచైజీకి ఆడలేదు: మంజ్రేకర్

image

AB డివిలియర్స్ IPLలో సరైన ఫ్రాంచైజీకి ఆడలేదని క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. డివిలియర్స్ తన కెరీర్లో ప్రధానంగా ఆర్సీబీకి మిడిల్ ఆర్డర్‌లో ఆడిన సంగతి తెలిసిందే. ‘అతడిని ఆర్సీబీ సరిగ్గా ఉపయోగించలేదు. బ్యాటింగ్‌లో మరింత ముందుగా పంపించి ఉంటే ఫలితాలు వేరేగా ఉండేవి. ఇలా అంటున్నా అని తప్పుగా అనుకోవద్దు. వేరే ఏ ఫ్రాంచైజీకి ఆడినా AB గొప్పదనాన్ని మనం చూసి ఉండేవాళ్లం’ అని పేర్కొన్నారు.

News January 27, 2025

రికార్డు సృష్టించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ

image

విక్టరీ వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలో నవ్వులతో పాటు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కూడా కురిపిస్తోంది. విడుదలైన 13వ రోజు AP, TGలో ఈ సినిమా రూ.6.77 కోట్ల షేర్ వసూలు చేసింది. ప్రభాస్-రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి-2 13వ రోజు షేర్‌ను సంక్రాంతికి వస్తున్నాం క్రాస్ చేసినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు ఈ సినిమా రూ.276 కోట్ల వసూళ్లను రాబట్టింది.

News January 27, 2025

విజయసాయిని మేమెందుకు తీసుకుంటాం?: నారా లోకేశ్

image

AP: YSRCP మాజీ MP విజయసాయి రెడ్డి ఆ పార్టీని వీడటంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘తన సొంత తల్లి, చెల్లినే నమ్మని వైఎస్ జగన్ వేరెవరినీ నమ్మరు. అందుకే విజయసాయి వంటివారు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. మా పార్టీని, కార్యకర్తల్ని విజయసాయి చాలా ఇబ్బంది పెట్టారు. అలాంటి వ్యక్తిని మా పార్టీలోకి ఎందుకు తీసుకుంటాం? విశాఖలో ఆయన అక్రమాలపై ఒక్కొక్కటిగా విచారణ చేస్తున్నాం’ అని స్పష్టం చేశారు.

News January 27, 2025

రూ.1.5 లక్షల కోట్ల వ్యయంతో భారత్ డ్యామ్ నిర్మాణం.. ఎక్కడంటే?

image

అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ నదిపై రూ.1.5 లక్షల కోట్ల ఖర్చుతో హైడ్రోపవర్ డ్యామ్ నిర్మించాలని భారత్ ప్రణాళిక రచిస్తోంది. సరిహద్దుల్లో చైనాకు కౌంటర్ ఇచ్చేందుకు సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీని నిల్వ సామర్థ్యం సుమారు 9.2 బిలియన్ క్యూబిక్ మీటర్లు ఉండొచ్చని అంచనా. పూర్తైతే వ్యూహాత్మకంగానూ భారత్‌కు ఇది లాభించనుంది. అయితే, డ్యామ్ నిర్మాణాన్ని స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.

News January 27, 2025

ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువ పెంపు: అనగాని

image

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. అలాగే భూముల హేతుబద్ధీకరణ చేయనున్నట్లు చెప్పారు. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో భూముల విలువ పెంచడం లేదని స్పష్టం చేశారు. విజయవాడ, భోగాపురం పరిసర ప్రాంతాల్లో పెరిగే అవకాశం ఉందన్నారు.