India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: YSRCP మాజీ MP విజయసాయి రెడ్డి ఆ పార్టీని వీడటంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘తన సొంత తల్లి, చెల్లినే నమ్మని వైఎస్ జగన్ వేరెవరినీ నమ్మరు. అందుకే విజయసాయి వంటివారు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. మా పార్టీని, కార్యకర్తల్ని విజయసాయి చాలా ఇబ్బంది పెట్టారు. అలాంటి వ్యక్తిని మా పార్టీలోకి ఎందుకు తీసుకుంటాం? విశాఖలో ఆయన అక్రమాలపై ఒక్కొక్కటిగా విచారణ చేస్తున్నాం’ అని స్పష్టం చేశారు.

అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ నదిపై రూ.1.5 లక్షల కోట్ల ఖర్చుతో హైడ్రోపవర్ డ్యామ్ నిర్మించాలని భారత్ ప్రణాళిక రచిస్తోంది. సరిహద్దుల్లో చైనాకు కౌంటర్ ఇచ్చేందుకు సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీని నిల్వ సామర్థ్యం సుమారు 9.2 బిలియన్ క్యూబిక్ మీటర్లు ఉండొచ్చని అంచనా. పూర్తైతే వ్యూహాత్మకంగానూ భారత్‌కు ఇది లాభించనుంది. అయితే, డ్యామ్ నిర్మాణాన్ని స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. అలాగే భూముల హేతుబద్ధీకరణ చేయనున్నట్లు చెప్పారు. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో భూముల విలువ పెంచడం లేదని స్పష్టం చేశారు. విజయవాడ, భోగాపురం పరిసర ప్రాంతాల్లో పెరిగే అవకాశం ఉందన్నారు.

AP: యువగళం పాదయాత్రను 2ఏళ్ల క్రితం ఇదేరోజున తాను ప్రారంభించడంపై మంత్రి లోకేశ్ ఎమోషనల్ అయ్యారు. ఇది జీవితకాలం గుర్తుండిపోయే జ్ఞాపకమన్నారు. నియంతృత్వం, నిర్బంధాలను దాటుకుని 11 ఉమ్మడి జిల్లాలు, 97 నియోజకవర్గాలు, 2097 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు 3132KM సాగిందని గుర్తుచేసుకున్నారు. గత పాలకులు అడ్డంకులు పెట్టినా ప్రజలు చూపిన ప్రేమ దృఢంగా మార్చిందని, ప్రతి అడుగులో ప్రజల కష్టాలు చూశానని ఆయన తెలిపారు.

ఆహారం ఎంత తింటున్నాం అనేకంటే ఏం తింటున్నాం అనేది చాలా ముఖ్యం. సరైన సమయానికి సరైన తిండితోనే ఫిజికల్, మెంటల్ హెల్త్ మెయింటైన్ చేయగలం. ఇందుకు సింపుల్‌గా రెయిన్‌బో ఫుడ్ ఫార్ములా పాటించండి. ఇంద్రధనుస్సులో రంగుల్లా మన ప్లేటులోని భోజనం విభిన్న రంగుల్లో (ఎరుపు- టమాట, నారింజ- క్యారెట్, పసుపు- దోస, ఆకుపచ్చ- ఆకుకూరలు..) ఉండాలి. దీంతో శరీరానికి భిన్న పోషకాలు అందుతాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. Share It

దేశ మొత్తం ఒకే సమయం అమలయ్యేలా కేంద్రం చర్యలు చేపట్టింది. భారత ప్రామాణిక సమయం(IST) వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ డ్రాఫ్ట్ రూల్స్ రూపొందించింది. FEB 14లోపు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించనుంది. ఇది అమల్లోకి వస్తే చట్టపరమైన, పాలన, వాణిజ్య, ఆర్థిక, అధికారిక వ్యవస్థల్లో ISTని తప్పక అమలు చేయాలి. ఇతర టైమ్ జోన్లను ప్రస్తావించకూడదు. అంతరిక్షం, సముద్రం, పరిశోధన రంగాలకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది.

TG: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మేడ్చల్ జిల్లా పోచారంలో ఇటీవల తనపై నమోదైన FIRను కొట్టివేయాలని కోరారు. ఏకశిలానగర్‌లో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఈటల కొట్టారు. దీనిపై వాచ్‌మెన్ ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదైంది.

యూపీకి చెందిన పర్వేశ్ యాదవ్ మద్యం అక్రమ రవాణా చేస్తూ 2023లో పోలీసులకు దొరికాడు. అయితే వారి నుంచి తప్పించుకుని పరారయ్యాడు. అప్పటి నుంచీ అతడి కోసం గాలిస్తున్నారు. తాజాగా మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగరాజ్ త్రివేణీ సంగమంలో స్నానం చేసేందుకు వచ్చాడు. పటిష్ఠ నిఘా ఉండటంతో పోలీసులకు దొరికేశాడు. దీంతో పాప పరిహారం కోసం వస్తే పాపం పండింది అంటూ అతడి అరెస్టుపై స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే న్యూస్. కన్నప్ప సినిమాలో ఆయన ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ లుక్‌ను ఫిబ్రవరి 3న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో త్రిశూలం మధ్య ప్రభాస్ కళ్లు కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో హిస్టారికల్ కం మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది.

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సినిమాకు అందించిన సేవలకు గానూ పద్మభూషణ్ అవార్డు అందుకోవడానికి ఆయన పూర్తి అర్హులంటూ ట్వీట్ చేశారు. ఆ అవార్డుకు ఎంపికైన మరో హీరో అజిత్ సాధించిన ఘనత తనకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. అలాగే, పద్మ అవార్డులకు ఎంపికైన శోభన, శేఖర్ కపూర్, అనంత్ నాగ్‌లకు అల్లు అర్జున్ విషెస్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.