News June 4, 2024

మెజార్టీలో తండ్రిని మించిన తనయుడు

image

AP: గత ఎన్నికల్లో ఓటమి పాలైన నారా లోకేశ్ ఈసారి భారీ విజయం సాధించారు. తన తండ్రి చంద్రబాబు మెజార్టీని తలదన్నేలా.. ఏకంగా 90,160 మెజార్టీతో రికార్డు సృష్టించి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. CBNకి 47,340 ఓట్ల మెజార్టీ దక్కింది. కుప్పంలో 1989లో CBN తొలిసారి గెలిచినప్పుడు అత్యధికంగా 71,607 మెజార్టీ సాధించారు. ఆ తర్వాత నుంచి మెజార్టీ తగ్గుతూ వస్తోంది. 2009 నుంచి ఆయన మెజార్టీ 45వేల మార్కు దగ్గరే ఉంటోంది.

News June 4, 2024

‘వై నాట్ 175’.. ఇప్పుడు 11

image

‘వై నాట్ 175’.. ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే వైసీపీ అధినేత జగన్ ఈ స్లోగన్ అందుకున్నారు. 2019లో 151 సీట్లు గెలిచామని.. ఈసారి కుప్పంతో సహా రాష్ట్రంలోని 175కి 175 స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కానీ రియాలిటీ జగన్ అంచనాలకు చాలా భిన్నంగా ఉంది. మొత్తం 175 సీట్లలో వైసీపీ కేవలం 11 స్థానాల్లోనే గెలిచింది. జగన్ ఆశించిన దాని కంటే ఫ్యాన్ పార్టీకి 164 సీట్లు తక్కువగా వచ్చాయి.

News June 4, 2024

నెల్లూరులో విజయసాయి రెడ్డి ఓటమి

image

AP: నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిపై 2,45,902 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. వేమిరెడ్డికి 7,66,202 ఓట్లు పోల్ కాగా.. విజయసాయికి 5,20,300 ఓట్లు పోల్ అయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి కొప్పుల రాజుకు 54,844 ఓట్లు పడ్డాయి.

News June 4, 2024

రేపు ఢిల్లీకి బాబు, పవన్!

image

AP: టీడీపీ చీఫ్ చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయనతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా హస్తిన వెళ్లే అవకాశం ఉంది. వీరు బీజేపీ నిర్వహించే ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరవుతారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీల మద్దతును బీజేపీ కూడగట్టనుంది. అటు సీఎంగా తన ప్రమాణ స్వీకారానికి మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలను చంద్రబాబు ఆహ్వానించనున్నారు.

News June 4, 2024

భేష్ పోలీస్!

image

పోలింగ్ రోజు, అనంతర గొడవలతో APలో కౌంటింగ్ రోజు ఎక్కడ ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. కానీ పోలీసులు కౌంటింగ్‌కు పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగారు. కేంద్ర బలగాలు, రిజర్వు పోలీసులూ వారం ముందే బందోబస్తుకు వెళ్లి అనేక చోట్ల మాక్ డ్రిల్స్, మార్చ్‌లతో తమ సామర్థ్యాలపై అవగాహన కల్పించారు. దీంతో ఘర్షణల ఆలోచన ఉన్నవారికి గట్టి మెసేజ్ వెళ్లింది. ఇది నేడు రచ్చ లేని క్లియర్ పిక్చర్ ఇచ్చింది. శభాష్ AP పోలీస్!

News June 4, 2024

విజయేంద్ర చెప్పినట్లే విజయం!

image

APలో ఈసారి కూటమి అధికారంలోకి వస్తుందని పలువురు జ్యోతిష్యం చెప్పగా కొందరు మాత్రమే అంకెలతో సహా కొందరే అంచనా వేయగలిగారు. అందులో మన్యం విజయేంద్ర ఒకరు. TDP+JSP+BJP కూటమికి 140కి పైగా స్థానాలు వస్తాయని ఈయన జ్యోతిష్య ఫలితం వెల్లడించారు. విజయేంద్ర అంచనాలను Way2News కూడా పబ్లిష్ చేసింది. ఇప్పుడు ఎన్నికల్లో ఇదే రిజల్ట్ రావడం మనం చూస్తున్నాం.

News June 4, 2024

పంజాబ్‌లో బీజేపీ ‘సున్నా’

image

పంజాబ్‌లో బీజేపీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. మొత్తం 13 స్థానాల్లో ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయింది. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న AAP 3 స్థానాల్లో గెలుపొందింది. అత్యధికంగా కాంగ్రెస్ 7 చోట్ల జయకేతనాన్ని ఎగురువేసింది. స్వతంత్రులు 2, శిరోమణి అకాళీదల్ ఒక స్థానంలో గెలుపొందాయి. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ జైలులో ఉండి పోటీ చేసిన అమృత్ పాల్(1,97,120)కి రావడం గమనార్హం.

News June 4, 2024

లోక్‌సభ స్థానాలు.. ఎవరికి ఎన్ని సీట్లంటే?

image

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 286 సీట్లు సాధించింది. మరో 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 196 సీట్లలో గెలించింది. మరో 3 చోట్ల లీడింగ్‌లో ఉంది. ఇతరులు 50 స్థానాల్లో విజయకేతనం ఎగురవేయగా.. ఒకచోట ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరికొన్ని గంటల్లో క్లియర్ పిక్చర్ రానుంది.

News June 4, 2024

ఈ రిజల్ట్‌తో EC హ్యాపీ: హర్ష గోయెంకా

image

ఎన్నికల ఫలితాలపై ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ సంతోషంగా ఉంది. 100 సీట్లతో కాంగ్రెస్ కూడా హ్యాపీనే. UPలో ప్రదర్శనపై SP, మహారాష్ట్రలో గెలుపొందిన సీట్ల పట్ల NCP-SP, SS- UBT, బెంగాల్‌లో ప్రభంజనం సృష్టించడంపై TMC సంతోషంగా ఉన్నాయి. ఈ ఫలితాలతో ఎలక్షన్ కమిషన్ ఊపిరి పీల్చుకుంది. EVMలపై నిందలు లేవు. ఇది సబ్కా సాథ్ సబ్కా వికాస్’ అని పోస్ట్ పెట్టారు.

News June 4, 2024

మద్య నిషేధ హామీనే YCP కొంపముంచిందా?

image

AP: మద్య నిషేధ హమీని పక్కనపెట్టి కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టడమూ YCP ఓటమికి ఓ కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డబ్బు పెట్టినా తాము కోరుకున్న బ్రాండ్‌లు దొరకకపోవడంతో మందుబాబులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసినట్లు తెలుస్తోంది. నాణ్యమైన మద్యం ఇవ్వాలని వారు కోరినా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. తమ ఓటు బ్యాంకులో అసలు మందుబాబులే లేరని సజ్జల కూడా వాదించారు. దీనినే TDP క్యాష్ చేసుకుంది.