News October 28, 2025

పునరావాస కేంద్రాల్లో ఆహారం, దుప్పట్లు పంపిణీ

image

AP: ‘మొంథా’ తుఫాను ప్రభావిత జిల్లాల్లో నిరాశ్రయులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. స్థానికంగా వారికి ఆశ్రయం కల్పించి ఆహారం, దుప్పట్లు పంపిణీ చేశారు. మరోవైపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సన్నద్ధమయ్యాయి. అటు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు తగిన సూచనలు చేస్తున్నారు.

News October 28, 2025

TETపై సుప్రీంలో రివ్యూ పిటిషన్: లోకేశ్

image

AP: టీచర్ల వినతి మేరకు TET తీర్పుపై సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. 2010కి ముందు ఎంపికైన టీచర్లూ టెట్ పాసవ్వాలని సుప్రీం తీర్పు ఇవ్వడంతో వారు ఆవేదనలో ఉన్నారని MLCలు ఆయన దృష్టికి తీసుకురాగా ఈ విధంగా స్పందించారు. టెట్ పాస్ కాకుంటే పోస్టుకు అనర్హులనడంతో ఆందోళనకు గురవుతున్నారని నేతలు చెప్పారు. కాగా తాజా TET మాత్రం కోర్టు తీర్పు ప్రకారమే ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.

News October 28, 2025

మూవీ అప్డేట్స్

image

* అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘డెకాయిట్’ మూవీ వచ్చే ఏడాది మార్చి 19న విడుదల
* నవీన్ పొలిశెట్టి, రవితేజ కాంబినేషన్లో సినిమా.. ప్రసన్న కుమార్ కథకు Ok చెప్పిన హీరోలు!
* తిరువీర్ హీరోగా తెరకెక్కిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ రిలీజ్.. NOV 7న మూవీ రిలీజ్
* ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు అభిషన్ జీవంత్‌కు పెళ్లి కానుకగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత మాగేశ్ రాజ్

News October 28, 2025

వాస్తురీత్యా ఇంటి గదులు ఎలా ఉండాలి?

image

ఇల్లు, గదుల నిర్మాణం దిక్కులకు అనుగుణంగా, ప్రాణశక్తి, ఉల్లాసాన్ని కలిగించేలా ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ‘గదుల నిర్మాణం 4 మూలలతో ఉంటేనే గాలి, వెలుతురు సమతుల్యంగా ఉంటాయి. ఇంట్లోని గదులు ఏ మూల పెరిగినా, తగ్గినా వ్యతిరేక ఫలితాలు వచ్చే ప్రమాదం ఉంది. వృత్తాకార నిర్మాణాలు అతిథి గృహాలు, ఫంక్షన్ హాళ్లకే అనుకూలం. వాస్తు నియమాలు పాటిస్తే జీవితం హాయిగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. <<-se>>#Vasthu<<>>

News October 28, 2025

రేపు భారీ వర్షాలు

image

AP: మొంథా తుఫాన్ ప్రభావంతో రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడులో కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురంలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది.

News October 28, 2025

తీరాన్ని తాకిన తుఫాను.. 8-10 గం.లు జాగ్రత్త

image

AP: మొంథా తుఫాను కాసేపటి క్రితం <<18132869>>తీరాన్ని తాకింది<<>>. రాబోయే 8-10 గం. భారీ వర్షాలు, గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 10CM-20CM వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, గరిష్ఠంగా గంటకు 110 KM వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. 6-7 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగసి పడతాయన్నారు. రేపు మధ్యాహ్నం నుంచి సాధారణ స్థితి నెలకొంటుందన్నారు.

News October 28, 2025

కాల్స్ అన్నీ రికార్డ్ చేస్తారంటూ ప్రచారం.. నిజమిదే

image

వాట్సాప్ కాల్స్‌కు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని హైదరాబాద్ పోలీసులు ఖండించారు. అన్ని ఫోన్ కాల్స్ రికార్డు చేసి సేవ్ చేస్తారని, సోషల్ మీడియా ఖాతాలను పర్యవేక్షిస్తారంటూ సర్క్యులేట్ అవుతున్న నకిలీ పోస్టర్‌ను నమ్మొద్దని సూచించారు. ‘ఈ పోస్టర్‌లోని సమాచారం పూర్తిగా అవాస్తవం. పోలీసులు దీనిని విడుదల చేయలేదు. దీనిని ఎవరూ షేర్ చేయొద్దు’ అని Xలో రాసుకొచ్చారు.

News October 28, 2025

కల్లుపై నిషేధం ఎత్తేస్తాం: తేజస్వీ యాదవ్

image

బిహార్‌ను దేశంలోనే నం.1గా తీర్చిదిద్దుతామని RJD నేత తేజస్వీ యాదవ్ అన్నారు. తమ మ్యానిఫెస్టో దీనికి రోడ్ మ్యాప్‌ అని చెప్పారు. ‘మేం గెలిస్తే కల్లుపై నిషేధం ఎత్తేస్తాం. అవినీతి అధికారులు, బీజేపీ నేతలు CM నితీశ్‌ను పప్పెట్‌గా చేశారు. NDA ఆయనను మళ్లీ సీఎం చేయదు’ అని పేర్కొన్నారు. కాగా తాము ఎక్కువ సీట్లు గెలుస్తామని అభిషేక్ బెనర్జీ (TMC) అన్నారు. OPS అమలు చేస్తామని దీపాంకర్ భట్టాచార్య(CPI) తెలిపారు.

News October 28, 2025

BIG ALERT: కాకినాడ-యానాం మధ్య తీరాన్ని తాకిన తుఫాను

image

AP: మొంథా తుఫాను కాకినాడ-యానాం మధ్య తీరాన్ని తాకిందని APSDMA ప్రకటించింది. యానాం- అంతర్వేదిపాలెం దగ్గర తీవ్రమైన తుఫానుగా తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. తుఫాను పూర్తిగా తీరాన్ని దాటేందుకు 3-4 గంటలు పడుతుందని వెల్లడించింది. తీరప్రాంత జిల్లాల్లో గంటకు 90-100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

News October 28, 2025

‘మొంథా’ తుఫాన్.. సహాయక చర్యలకు ప్రభుత్వం సిద్ధం

image

* అత్యవసర పరిస్థితుల్లో ప్రజల సౌకర్యార్థం 488 కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
* ఇప్పటికే 75,802 మందిని పునరావాస కేంద్రాలకు తరలింపు
* పలు జిల్లాల్లో 219కి పైగా వైద్యశిబిరాలు ఏర్పాటు
* అత్యవసర కమ్యూనికేషన్ కోసం 81 వైర్‌లెస్ టవర్లు ఏర్పాటు
* సహాయక చర్యలకు 321 డ్రోన్లు సిద్ధం, అందుబాటులో JCBలు, క్రేన్లు
* ఇప్పటికే 38 వేల హెక్టార్లలో పంట నష్టం, 1.38 లక్షల హెక్టార్ల ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అధికారుల అంచనా