News October 28, 2025

తుఫాను ప్రభావం.. భీకర గాలులు

image

AP: మొంథా తుఫాను దృష్ట్యా పలు జిల్లాల్లో భీకర గాలులు వీస్తున్నాయి. కోనసీమ, విశాఖ, కాకినాడ జిల్లాల్లో చెట్లు విరిగిపడ్డాయి. తీరం దాటే సమయంలో గంటకు 90-110 KM వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం *మచిలీపట్నం- 93 km/h *కాకినాడ- 82 km/h *విశాఖ- 68 km/h *రాజమండ్రి ఎయిర్‌పోర్ట్- 65 km/h *గంగవరం పోర్ట్- 58 km/h *చింతపల్లి- 55 km/h *బద్వేల్ (కడప)- 52 km/h వేగంతో గాలులు వీస్తున్నాయి.

News October 28, 2025

పూజ గదిలో ఈ విగ్రహాలు ఉండకూడదు: పండితులు

image

పూజ గదిలో శనిదేవుడు, రాహువు, కేతువుల ఫొటోలు/విగ్రహాలు పెట్టకూడదని పండితులు సూచిస్తున్నారు. వీటిని ఉంచడం వల్ల ఇంట్లో అశాంతి, ప్రతికూల శక్తి పెరిగే అవకాశాలు ఉంటాయంటున్నారు. ‘ఉగ్ర రూపాలైన కాలభైరవ, మహంకాళి ఫొటోలను కూడా ఇంట్లో పెట్టడం శుభకరం కాదు. పూజ గదిలో తినకపోవడం, నిద్రించకపోవడం ఉత్తమం. తడి జుట్టుతో ఆ గదిలోకి వెళ్లడం మంచిది కాదు’ అంటున్నారు. ✍️ మరిన్ని ఆధ్యాత్మిక కథనాల కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీ.

News October 28, 2025

షమీ ఆన్ ఫైర్.. జాతీయ జట్టులో చోటు దక్కేనా?

image

రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున ఆడుతున్న షమీ జాతీయ జట్టులో చోటే లక్ష్యంగా చెలరేగుతున్నారు. 2 మ్యాచ్‌ల్లో 68 ఓవర్లు వేసి 15 వికెట్లు పడగొట్టారు. తన ఫిట్‌‌నెస్, ఫైర్ తగ్గలేదని నిరూపించారు. NOV 14 నుంచి స్వదేశంలో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ జరగనున్న నేపథ్యంలో అగార్కర్, గంభీర్‌కు బిగ్ మెసేజ్ పంపారు. ఫిట్‌నెస్ లేదని WIతో టెస్టులకు, AUSతో వన్డే సిరీస్‌కు షమీని ఎంపిక చేయలేదు. ఇప్పుడేం చేస్తారో చూడాలి.

News October 28, 2025

పంట నష్టాన్ని రైతులు నమోదు చేసేలా యాప్‌లో మార్పులు: CM CBN

image

AP: పంట నష్టాన్ని రైతులు పంపేలా వ్యవసాయశాఖ యాప్‌‌ను మార్చాలని CM CBN ఆదేశించారు. పంట నష్టం సహ వర్షాన్ని అంచనా వేస్తూ లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలన్నారు. ‘కాకినాడకు మరిన్ని రెస్క్యూ బృందాలు పంపాలి. సీమలో వర్షాలు లేనందున చెరువుల్లో నీటిని నింపాలి’ అని సూచించారు. 43వేల హెక్టార్ల పంట నీట మునిగిందని అధికారులు నివేదించారు. 81 టవర్లతో వైర్‌లెస్ సిస్టమ్, 2703 జనరేటర్లు రెడీ చేశామన్నారు.

News October 28, 2025

భారీ వర్షాలు.. కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు

image

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో కోళ్లకు వ్యాధులు సోకే అవకాశం ఎక్కువ. అందుకే కోళ్ల ఫారాన్ని శుభ్రంగా ఉంచాలి. ఫారం నుంచి నీరు బయటకు పోయేలా డ్రైనేజ్ సక్రమంగా ఉండేట్లు చూసుకోవాలి. కోళ్లకు నీరందించే నీటి బుట్టలు లీక్ కాకుండా సరి చూడాలి. లిట్టర్ బాగా తడిగా ఉంటే దాన్ని వెంటనే తొలగించాలి. ఫారంలోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. కోళ్లలో అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెటర్నరీ డాక్టరును సంప్రదించాలి.

News October 28, 2025

బాలీవుడ్ నటుడి మంచి మనసు

image

బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మంచి మనసు చాటుకున్నారు. ‘రామాయణ’ సినిమాకు తాను తీసుకుంటున్న పారితోషికాన్ని క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారుల వైద్యానికి వినియోగించనున్నట్లు వెల్లడించారు. హాలీవుడ్ మాస్టర్ పీస్ చిత్రాలకు భారత్ నుంచి సమాధానంగా ‘రామాయణ’ నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇంకొన్ని రోజులు తన పాత్ర షూట్ మిగిలి ఉందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

News October 28, 2025

ఇంట్లో కాలుష్యానికి వీటితో చెక్

image

ప్రస్తుతకాలంలో కాలుష్యం లేని స్వ‌చ్ఛ‌మైన గాలిని పీల్చుకోవ‌డం క‌ష్టంగా మారింది. ఆరుబయటే కాదు ఇంట్లో కూడా కాలుష్యం విస్తరిస్తోంది. దీన్ని తగ్గించాలంటే ఇంట్లో కొన్నిమొక్కలు పెంచాలంటున్నారు నిపుణులు. బోస్ట‌న్ ఫెర్న్‌, స్పైడ‌ర్ ప్లాంట్‌, వీపింగ్ ఫిగ్‌, పీస్ లిల్లీ, ఇంగ్లిష్ ఐవీ మొక్క‌లు గాలిని శుభ్రం చేయడంలో స‌హాయం చేస్తాయి. గాలి కాలుష్యాన్ని తొల‌గించి మ‌నకు స్వ‌చ్ఛ‌మైన గాలిని అందిస్తాయంటున్నారు.

News October 28, 2025

శివుడి కోసం సతీదేవి ఏం చేసిందంటే..?

image

సతీదేవికి శివునిపై ఉన్న ప్రేమను, భర్త గౌరవం పట్ల ఆమెకున్న నిబద్ధతను దక్షయజ్ఞ ఘట్టం మనకు నిరూపిస్తుంది. శివుడిని దక్షుడు అవమానించడం ఆమె సహించలేకపోయింది. శివుని ఔదార్యాన్ని వివరించి, దక్షుడి అహంకారాన్ని ఖండించింది. శివునిపై ద్వేషం పెంచుకున్న తండ్రి నుంచి వచ్చిన ఈ శరీరం శివుని అవమానంతో కలుషితమైందని భావించింది. అందుకే, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి యోగాగ్ని ద్వారా దేహత్యాగం చేసింది. <<-se>>#Shakthipeetham<<>>

News October 28, 2025

మచిలీపట్నానికి 70kmల దూరంలో తుఫాన్

image

AP: బంగాళాఖాతంలో మొంథా తుఫాన్ గంటకు 15km వేగంతో కదులుతోందని APSDMA తెలిపింది. ప్రస్తుతం మచిలీపట్నానికి 70 km, కాకినాడకు 150 km, విశాఖపట్నానికి 250 km దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. ఈ అర్ధరాత్రికి కాకినాడకు దక్షిణంగా తీరాన్ని దాటే అవకాశముందని అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో 90-110కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు.

News October 28, 2025

కుప్పకూలిన విమానం.. 12 మంది సజీవదహనం

image

కెన్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. లైట్ ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోయి మంటలు వ్యాపించడంతో 12 మంది సజీవ దహనమయ్యారు. ఇవాళ ఉదయం టూరిస్టులతో డయాని నుంచి కిచ్వా టెంబోకు వెళ్తుండగా సింబా గోలిని ఏరియాలో కుప్పకూలినట్లు ఏవియేషన్ అధికారులు తెలిపారు. పోలీసు, ఎమర్జెన్సీ సర్వీసెస్ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.