News October 28, 2025

ఇంట్లో కాలుష్యానికి వీటితో చెక్

image

ప్రస్తుతకాలంలో కాలుష్యం లేని స్వ‌చ్ఛ‌మైన గాలిని పీల్చుకోవ‌డం క‌ష్టంగా మారింది. ఆరుబయటే కాదు ఇంట్లో కూడా కాలుష్యం విస్తరిస్తోంది. దీన్ని తగ్గించాలంటే ఇంట్లో కొన్నిమొక్కలు పెంచాలంటున్నారు నిపుణులు. బోస్ట‌న్ ఫెర్న్‌, స్పైడ‌ర్ ప్లాంట్‌, వీపింగ్ ఫిగ్‌, పీస్ లిల్లీ, ఇంగ్లిష్ ఐవీ మొక్క‌లు గాలిని శుభ్రం చేయడంలో స‌హాయం చేస్తాయి. గాలి కాలుష్యాన్ని తొల‌గించి మ‌నకు స్వ‌చ్ఛ‌మైన గాలిని అందిస్తాయంటున్నారు.

News October 28, 2025

శివుడి కోసం సతీదేవి ఏం చేసిందంటే..?

image

సతీదేవికి శివునిపై ఉన్న ప్రేమను, భర్త గౌరవం పట్ల ఆమెకున్న నిబద్ధతను దక్షయజ్ఞ ఘట్టం మనకు నిరూపిస్తుంది. శివుడిని దక్షుడు అవమానించడం ఆమె సహించలేకపోయింది. శివుని ఔదార్యాన్ని వివరించి, దక్షుడి అహంకారాన్ని ఖండించింది. శివునిపై ద్వేషం పెంచుకున్న తండ్రి నుంచి వచ్చిన ఈ శరీరం శివుని అవమానంతో కలుషితమైందని భావించింది. అందుకే, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి యోగాగ్ని ద్వారా దేహత్యాగం చేసింది. <<-se>>#Shakthipeetham<<>>

News October 28, 2025

మచిలీపట్నానికి 70kmల దూరంలో తుఫాన్

image

AP: బంగాళాఖాతంలో మొంథా తుఫాన్ గంటకు 15km వేగంతో కదులుతోందని APSDMA తెలిపింది. ప్రస్తుతం మచిలీపట్నానికి 70 km, కాకినాడకు 150 km, విశాఖపట్నానికి 250 km దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. ఈ అర్ధరాత్రికి కాకినాడకు దక్షిణంగా తీరాన్ని దాటే అవకాశముందని అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో 90-110కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు.

News October 28, 2025

కుప్పకూలిన విమానం.. 12 మంది సజీవదహనం

image

కెన్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. లైట్ ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోయి మంటలు వ్యాపించడంతో 12 మంది సజీవ దహనమయ్యారు. ఇవాళ ఉదయం టూరిస్టులతో డయాని నుంచి కిచ్వా టెంబోకు వెళ్తుండగా సింబా గోలిని ఏరియాలో కుప్పకూలినట్లు ఏవియేషన్ అధికారులు తెలిపారు. పోలీసు, ఎమర్జెన్సీ సర్వీసెస్ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

News October 28, 2025

ఉసిరితో మహిళలకు ఎన్నో లాభాలు

image

ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిసిందే. ముఖ్యంగా మహిళలకు ఇది చాలా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. హార్మోన్లను సమతుల్యం చేయడంలో, PCOD, డయాబెటీస్‌ను తగ్గించడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. అలాగే జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపుతుంది. దీన్ని పచ్చిగా, ఎండబెట్టి పొడిలా, పచ్చడి, జ్యూస్ ఇలా నచ్చిన విధంగా తీసుకోవచ్చంటున్నారు.

News October 28, 2025

భారీగా తగ్గిన బంగారం ధరలు

image

బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇవాళ గంటల వ్యవధిలోనే <<18126051>>రెండోసారి<<>> గోల్డ్ రేట్స్ తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24క్యారెట్ల 10గ్రా.ల బంగారంపై రూ.2460 తగ్గి రూ.1,20,820కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.2,250 పతనమై రూ.1,10,750గా ఉంది. అటు కేజీ వెండిపై ఇవాళ రూ.5వేలు తగ్గడంతో రూ.1,65,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News October 28, 2025

మొదలైన వర్షం

image

తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షం మొదలైంది. హైదరాబాద్‌‌‌లోని జూబ్లీహిల్స్, మాదాపూర్, యూసఫ్‌గూడ, శేరిలింగంపల్లి, పంజాగుట్ట, బంజారాహిల్స్ కూకట్‌పల్లిలోనూ వాన కురుస్తోంది. మరికాసేపట్లో సిద్దిపేట, యాదాద్రితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.

News October 28, 2025

పోర్టులకు ప్రమాద హెచ్చరికలెన్ని? వాటి అర్థాలేంటి? (1/2)

image

మొంథాతో కాకినాడ పోర్టుకు పదో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుఫాను తీవ్రత బట్టి 4 కేటగిరీలుగా విభజించిన 1-11 స్థాయుల హెచ్చరికలను పోర్టులకు IMD జారీ చేస్తుంది.
A: దూరంగా ముప్పు (Distant bad weather).. 1: పీడనం పోర్టుకు దూరంగా ఉంది. 2: సముద్రంలో తుఫాను ఉంది. పోర్టును వీడే నౌకలు జాగ్రత్త.
B: స్థానికంగా ముప్పు (Local Bad Weather).. 3: పోర్టు వద్ద తీవ్ర గాలులు. 4: పోర్టుపై తుఫాను ప్రభావం చూపొచ్చు.

News October 28, 2025

ప్రమాద హెచ్చరికలెన్ని? వాటి అర్థాలేంటి? (2/2)

image

A, B కేటగిరీ వార్నింగ్స్ ఆర్టికల్‌కు ఇది కొనసాగింపు ఆర్టికల్.
C: ప్రమాదం.. (Danger) 5: పోర్టుకు ఎడమ వైపు తుఫాను తీరం దాటొచ్చు. 6: కుడివైపు దాటొచ్చు. 7: పోర్టు దగ్గరగా/మీదుగా తీరం దాటొచ్చు.
D: పెను ప్రమాదం.. (Great danger) 8: తీవ్ర తుఫాను పోర్టు ఎడమ వైపుగా తీరం దాటనుంది. 9: కుడి వైపుగా దాటనుంది. 10: దగ్గర లేదా పై నుంచి దాటనుంది. 11: తుఫానుతో సమాచార వ్యవస్థ ధ్వంసం అవ్వొచ్చు.
Share It

News October 28, 2025

మీ టీవీపై ఇంకా ఈ స్టిక్కర్లు ఉంచారా?

image

చాలామంది కొత్త TV కొన్నప్పుడు దాని డిస్‌ప్లేపై ఉండే ఫీచర్ల స్టిక్కర్లను తొలగించరు. పిల్లలు తొలగించినా పేరెంట్స్ తిడుతుంటారు. అయితే ఈ స్టిక్కర్లుండటం TVకి మంచిది కాదని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. TV ఆన్‌లో ఉన్నప్పుడు వేడి పుట్టి ఈ స్టిక్కర్లు డిస్‌ప్లేని దెబ్బతీస్తుంటాయి. అలాగే రంగులూ మారిపోతాయని చెబుతున్నారు. స్టిక్కర్ చుట్టూ ఉన్న భాగం మాత్రమే నిగనిగలాడుతూ, మిగతా భాగం కాంతిహీనంగా మారుతుందట.