India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: మొంథా తీవ్ర తుఫాన్ నేపథ్యంలో భారీ వాహనదారులకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. జాతీయ రహదారుల్లో ప్రయాణించే భారీ వాహనాలను రాత్రి 7 గంటల తర్వాత నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. వాహనదారులు ముందే సురక్షిత ‘లేబే’ల్లో వాటిని పార్క్ చేసుకోవాలని సూచించింది. అటు ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని మరోసారి హెచ్చరించింది.

ఇండియన్ యూజర్లను ఆకర్షించేందుకు ChatGPT కీలక నిర్ణయం తీసుకుంది. ‘ChatGPT Go’ సేవలను ఏడాది పాటు ఉచితంగా అందించేందుకు సిద్ధమైంది. నవంబర్ 4 నుంచి SignUp చేసిన కొత్త యూజర్లకు ఈ అవకాశం లభిస్తుందని సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ChatGPT Go ఉపయోగిస్తున్న వారికి కూడా అదనంగా 12 నెలల ఉచిత సేవలు వర్తిస్తాయని తెలిపింది. ఇప్పటికే ఎయిర్‌టెల్ కూడా తన యూజర్లకు ఏడాది పాటు ‘Perplexity Pro’ని ఫ్రీగా అందించింది.

TG: మొంథా తుఫాను ఎఫెక్ట్ రాష్ట్రంలోనూ కనిపిస్తోంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు HYD వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది. ఈ జిల్లాల్లో గంటకు 40-50 కి.మీ. వేగంతో గాలులు వీచే ఛాన్సుందని తెలిపింది.

‘సాలగ్రామం’ అనేది మహావిష్ణువుకు ప్రతిరూపమైన పవిత్ర శిల. అన్ని వేళలా విష్ణువు ఈ శిలలోనే నివాసం ఉంటాడని పండితులు చెబుతారు. అందుకే సాలగ్రామం లేకుండా ఇళ్లలోగానీ, గుళ్లలోగానీ దేవుడి పూజలు జరగవు. వైష్ణవులు, అద్వైతులు.. ఇలా భగవంతుడిని కొలిచే ఏ సిద్ధాంతం వారైనా తమతమ పూజలలో తప్పకుండా ఈ సాలగ్రామాలను పూజిస్తారు. దీనిని విష్ణువు నివాసంగా, పూజనీయ వస్తువుగా కూడా భావిస్తారు. ఈ శిల మీ ఇంట్లో ఉందా? COMMENT

AP పోలీస్ శాఖలోని 13 కేటగిరీల్లో 11,639 ఖాళీలున్నట్లు హోంశాఖ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కానిస్టేబుల్ నుంచి ఎస్సై వరకు సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, మెకానిక్, డ్రైవర్ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని పేర్కొంది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే స్పందించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా అత్యధికంగా కానిస్టేబుల్(APSP) 4,587, కానిస్టేబుల్(సివిల్) 3,622, కానిస్టేబుల్(AR) 2000 ఖాళీలున్నాయి.

సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్(CWC) 22 పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. వీటిలో జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీతోపాటు ఆఫీస్ మేనేజ్‌మెంట్ అండ్ సెక్రటేరియల్‌లో ఏడాది కోర్సు పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు నవంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://cwceportal.com/

అరటిలో పండు పరిమాణం, నాణ్యత పెంచేందుకు గెలల్లోని ఆఖరి హస్తం విచ్చుకున్న 5వ రోజు మరియు 15వ రోజున లీటరు నీటికి సల్ఫేట్ ఆఫ్ పొటాష్ 5 గ్రాములను కలిపి గెలలపై పిచికారీ చేయాలి. దీనితో పాటు 2 శాతం రంద్రాలు చేసిన తెల్లని పారదర్శక పాలిథీన్ సంచులను గెలలకు తొడగాలి. దీని వల్ల అరటిపండ్ల పరిమాణం పెరిగి లేత ఆకుపచ్చ రంగులో ఆకర్షణీయంగా తయారై నాణ్యమైన పండ్లను పొందవచ్చు. ఇవి ఎగుమతికి అనుకూలంగా ఉంటాయి.

TG: మాజీ మంత్రి హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ ఇవాళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన స్వయానా KCR బావ. దీంతో మాజీ CM కుటుంబమంతా ఉదయం నుంచి హరీశ్ ఇంటి వద్దే ఉంది. అయితే తన మామ అంత్యక్రియలకు కవిత దూరంగా ఉన్నారు. ఇటీవల హరీశ్‌పై ఆమె సంచలన ఆరోపణలు చేయడమే అందుకు కారణం. రాజకీయ విభేదాలతో కుటుంబాల మధ్యా వైరం పెరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ టైమ్‌లో కవిత వెళ్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పిల్లలు పెరిగే కొద్దీ వారికి అందించే పోషకాలు కూడా పెరగాలి. దానికి బీట్‌రూట్ మంచి ఆప్షన్ అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇందులో ఫైబర్, ఫోలేట్, మాంగనీస్, పొటాషియంతో పాటు విటమిన్ బి9 ఉండటం వల్ల ఎర్రరక్త కణాల తయారీకి, రక్త ప్రసరణకు తోడ్పడతాయి. పిల్లల్లో మెదడు, జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంతో పాటు రోగనిరోధకశక్తిని పెంచుతుంది. కాబట్టి పిల్లల ఆహారంలో దీన్ని చేర్చాలని చెబుతున్నారు.

మొంథా తీవ్ర తుఫాన్ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ, ఒడిశాకు వాతావరణ శాఖ ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలోని గుంటూరు, కృష్ణా, ప.గో, తూ.గో, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరంతో పాటు టీజీలోని భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో రేపు ఉదయం లోపు ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఒడిశాలోని గజపతి, గంజాం జిల్లాలకూ అలర్ట్ ఇచ్చింది. ఇక ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా కుండపోత వానలు పడుతున్నాయి.
Sorry, no posts matched your criteria.