News October 28, 2025

20 రోజుల్లోనే జుట్టు పెరుగుదల.. గుడ్‌న్యూస్ చెప్పిన చైనా

image

బట్టతల సమస్య యువతను కలవరపెడుతోంది. చాలామందికి యుక్తవయసులోనే బట్టతల వచ్చేస్తోంది. అలాంటి వారికి నేషనల్ తైవాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ పరిశోధనలో సహజమైన కొవ్వు ఆమ్లాలతో తయారైన సీరం 20 రోజుల్లో జుట్టును పునరుద్ధరించిందని తెలిపారు. ఇది నిద్రాణంగా ఉన్న జుట్టు కుదుళ్ల మూల కణాలను మేల్కొల్పుతుంది. ఎలుకలతో పాటు ఓ ప్రొఫెసర్ కాలుపై ప్రయోగించగా అది సానుకూల ఫలితాలు ఇచ్చింది.

News October 28, 2025

కర్ణాటక కాంగ్రెస్‌కు TDP కౌంటర్

image

AP: గూగుల్ డేటా సెంటర్‌పై కర్ణాటక కాంగ్రెస్ అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ‘KA గూగుల్‌‌ను కోల్పోలేదు. దానిని మరో రాష్ట్రానికి మళ్లించారు. ఉచితాలు, సబ్సిడీల ఆశచూపి దానిని పొందారు. మేము పెట్టుబడుల కోసం అభ్యర్థించం, అడుక్కోం’ అంటూ KA కాంగ్రెస్ చేసిన ట్వీట్‌కు TDP కౌంటరిచ్చింది. ‘AP పురోగతి కర్ణాటక కాంగ్రెస్ ఫేవరెట్ టాపిక్ అయిపోయింది. మన అభివృద్ధి వారికి కాస్త ఘాటుగా అనిపిస్తోంది’ అని ట్వీట్ చేసింది.

News October 28, 2025

రైతులకు కేంద్రం శుభవార్త

image

దేశంలోని రైతులను ఆదుకొనేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫెర్టిలైజర్ సబ్సిడీకి ఆమోదం తెలిపినట్లు సమాచారం. దీంతో రైతులకు ₹3వేల కోట్లమేర లబ్ధి చేకూరనుంది. PM అధ్యక్షతన జరుగుతున్న కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఫెర్టిలైజర్ సబ్సిడీ అంశంపై చర్చించి ఆమోదించినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో పాటు ఇతర మరికొన్ని సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలపైనా మధ్యాహ్నం 3కి మీడియాకు వెల్లడిస్తారు.

News October 28, 2025

వాట్సాప్ నుంచి గ్యాస్ బుక్ చేయొచ్చు!

image

LPG సిలిండర్‌ను వాట్సాప్‌లోనూ బుక్ చేసుకోవచ్చు. భారత్ గ్యాస్, Indane, HP గ్యాస్ కస్టమర్‌లు తమ రిజిస్టర్డ్ నంబర్ నుంచి కంపెనీ అధికారిక వాట్సాప్ నంబర్‌కు “Hi” లేదా “REFILL” అని మెసేజ్ చేస్తే చాలు. ఈ 24×7 సేవ ద్వారా తక్షణ బుకింగ్ కన్ఫర్మేషన్, డెలివరీ ట్రాకింగ్, చెల్లింపు సౌకర్యాలు లభిస్తాయి. Bharat- 1800 22 4344, Indane- 75888 88824, HP Gas -92222 01122 నంబర్లకు వాట్సాప్ చేయొచ్చు. SHARE IT

News October 28, 2025

బొట్టు ఎందుకు పెట్టుకోవాలి?

image

బొట్టు పెట్టుకోవడం అలంకరణ మాత్రమే కాదు. దీని వెనుక శాస్త్రీయ కారణాలున్నాయి. కనుబొమ్మల నడుమ ఖాళీ స్థలాన్ని ఆజ్ఞ చక్రం అంటారు. ఇది శరీరంలో ముఖ్యమైన నాడీ కేంద్రం. ఇక్కడ తిలకం దిద్దితే ఆజ్ఞ చక్రం ఉత్తేజితమై ముఖ కండరాల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మనసును శాంతంగా ఉంచి, సానుకూల శక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది.
☞ రోజూ ఆధ్యాత్మిక సమాచారం, ధర్మసందేహాల నివృత్తి కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

News October 28, 2025

కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై CBN భేటీ

image

AP: రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉపసంఘంతో CM CBN సమీక్ష చేపట్టారు. గతంలో జరిగిన అశాస్త్రీయ విభజనతో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించే పలు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారు. పునర్విభజనలో ప్రస్తుత కొన్ని జిల్లాల భౌగోళిక సరిహద్దులను మార్పు చేయనున్నారు. నేతలు, సంఘాల వినతి మేరకు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై చర్చిస్తున్నారు. Dy CM పవన్ కళ్యాణ్, మంత్రులు భేటీలో పాల్గొన్నారు.

News October 28, 2025

మునగ సాగు.. ఎకరాకు రూ.4 లక్షల ఆదాయం

image

మునగ సాగుతో అధిక ఆదాయం పొందుతున్నారు కర్ణాటకకు చెందిన ఉమేశ్‌రావు. 2010 నుంచి 10 ఎకరాల భూమిలో సహజ ఎరువులు వాడుతూ మునగసాగు చేస్తున్నారు. మార్కెట్‌లో మునగాకులపొడికి ఉన్న డిమాండ్ చూసి దాన్నే తయారు చేసి వివిధ కంపెనీలకు విక్రయిస్తున్నారు. ఏటా ఎకరాకు రూ.4 లక్షల చొప్పున 10 ఎకరాల నుంచి రూ.40 లక్షల ఆదాయం పొందుతున్నారు.✍️ ప్రతిరోజూ ఇలాంటి కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News October 28, 2025

మీరు వాడే పసుపు నాణ్యమైనదేనా? ఇలా చెక్ చేయండి

image

అన్ని రకాల వంటల్లో పసుపుదే కీలకపాత్ర. అయితే ఇటీవల కల్తీ పసుపు మార్కెట్లోకి వస్తోంది. దీన్ని గుర్తించడానికి కొన్ని చిట్కాలున్నాయి. ఒక గ్లాసు వెచ్చని నీళ్లలో చెంచా పసుపు వేసి 20ని. ఉంచాలి. స్వచ్ఛమైనదైతే గ్లాస్ అడుగుకు పసుపు చేరుతుంది. పైకి తేలితే కల్తీ. అలాగే చేతిపైన కొద్దిగా పసుపు వేసి కాసేపు నలపాలి. మృదువుగా అనిపించి రంగు మారకుంటే నాణ్యమైనది. గరుకుగా ఉండి రంగు మారితే నకిలీ.

News October 28, 2025

అవసరమైతే కేంద్రం సాయం కోరుతాం: CBN

image

AP: అందరూ సహాయక చర్యల్లో పాల్గొనాలని CM చంద్రబాబు కూటమి నేతలకు టెలీకాన్ఫరెన్స్‌లో పిలుపునిచ్చారు. ‘రాత్రికి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య తుఫాను తీరం దాటుతుంది. కృష్ణా, ప.గో, కోనసీమ, ఏలూరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. ప్రాణనష్టం పూర్తిగా తగ్గించడం, ఆస్తినష్టం నివారించేలా చర్యలు చేపట్టాం. పిల్లలు, గర్భిణులు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలి. అవసరమైతే కేంద్రం సాయం కోరుతాం’ అని తెలిపారు.

News October 28, 2025

కళ్ల కింద డార్క్ సర్కిల్స్.. ఇలా మాయం

image

ఒత్తిడి, హార్మోన్ల ప్రభావం, నిద్రలేమి, మొబైల్, కంప్యూటర్ స్క్రీన్ ఎక్కువగా చూడటం వల్ల మహిళల్లో కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి. ఈ సమస్యకు ఇంట్లోని పదార్థాలతోనే సహజంగా తగ్గించుకోవచ్చు. పచ్చి పాలు/బంగాళదుంప రసంలో దూదిని ముంచి కళ్ల కింద పెట్టి 20ని. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. రోజుకు 2సార్లు ఇలా చేయాలి. బంగాళదుంప/కీరా ముక్కను కళ్లకింద 10ని. రుద్ది నీటితో కడిగేసుకున్నా ప్రయోజనం ఉంటుంది.