India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRDPR) 9పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనుంది. వీటిలో సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి. బీఈ, బీటెక్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఎర్త్& ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, జియో ఇన్ఫర్మాటిక్స్, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 29న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. వెబ్‌సైట్: http://career.nirdpr.in

నిద్ర నాణ్యతను మెరుగుపరుచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు సూచిస్తున్నారు. ‘రోజూ నిద్రపోయే సమయాన్ని ఫిక్స్ చేసుకోండి. వారాంతాల్లోనూ ఒకే సమయానికి పడుకుని, మేల్కొంటే శరీరం ఒకే దినచర్యకు అలవాటు పడుతుంది. పడుకునే 30-60 నిమిషాల ముందు టీవీలు, ల్యాప్‌టాప్స్‌కు దూరంగా ఉండాలి. దీనికి బదులు పుస్తకాలు చదవండి. గదిని చల్లగా, చీకటిగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోండి’ అని చెబుతున్నారు.

కలుపు నివారణలో మల్చింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్లాస్టిక్ షీటును మొక్క చుట్టూ నేలపై కప్పడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు. ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల నేల తేమను నిలుపుకుంటుంది. కలుపు కట్టడి జరుగుతుంది. పంట ఏపుగా పెరిగి దిగుబడి బాగుంటుంది. కూరగాయల సాగుకు ఇది అనుకూలం. మల్చింగ్ చేసిన ప్రాంతంలో పంటకాలం పూర్తయ్యాక దున్నాల్సిన అవసరం లేకుండా పాత మొక్కలను తీసేసి వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటుకోవచ్చు.

AP: ‘మొంథా’ తుఫాను తీరంవైపు దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో కదిలినట్లు APSDMA తెలిపింది. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 160KM, కాకినాడకు 240KM, విశాఖపట్నానికి 320KM దూరంలో కేంద్రీకృతమైనట్లు వివరించింది. తుఫాను ప్రభావాన్ని విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని వివరించింది. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించింది.

యోగాతోనే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని నమ్మిన నానమ్మల్ అనేక పురాతన యోగా శాసనాలను భావితరాలకు పంచారు. 1972లో యోగాసెంటర్ ప్రారంభించి 10L మందికిపైగా యోగా నేర్పారు. వారు దేశవిదేశాల్లో యోగాగురువులుగా స్థిరపడ్డారు. ఆమె చేసిన కృషికిగాను 2016లో కేంద్ర ప్రభుత్వం నారీశక్తి, 2019లో పద్మశ్రీతో సత్కరించింది. 99 ఏళ్ల వయసులో మరణించిన ఆమె ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
✍️ ఉమెన్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>కి వెళ్లండి.

భారత క్రికెట్ సంఘం(ICA) అధ్యక్షురాలిగా భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి ఎన్నికయ్యారు. చెన్నైలో జన్మించిన శాంత ఆల్‌రౌండర్‌గా 1976-1991 మధ్య కాలంలో భారత జట్టుకు ఆడారు. కెరియర్లో 16 టెస్టులు మాత్రమే ఆడిన ఆమె.. న్యూజిలాండ్‌పై చరిత్రాత్మక విజయంలో భాగమయ్యారు. 8 మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించారు. మహిళా క్రికెట్‌కు విశేష సేవలందించిన ఆమెకు 1976లో అర్జున అవార్డు లభించింది.

మొంథా తుఫాను ప్రభావంతో బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. తాజా వాతావరణ సమాచారం, అధికారుల సూచనలు, సహాయక చర్యల వివరాలు తెలుసుకోవడానికి ‘Way2News’ను ఫాలో అవ్వండి. కచ్చితమైన, తాజా అప్‌డేట్‌లను అందిస్తూ మిమ్మల్ని సురక్షితంగా ఉంచడంలో వే2న్యూస్ తోడుగా ఉంటుంది.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ జర్మనీలో మెకానిక్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ/డిప్లొమా/బీటెక్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు నవంబర్ 10వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు రూ.2.50లక్షల నుంచి రూ.3 లక్షల వరకు జీతం చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://naipunyam.ap.gov.in/

ఆసీస్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన భారత్ రేపటి నుంచి 5 మ్యాచుల T20 సమరానికి సిద్ధమైంది. బుమ్రా జట్టులోకి రానుండటం ప్లస్ కానుంది. అతడి సారథ్యంలో పేస్ దళం AUSను ఎలా కట్టడి చేస్తుందో చూడాలి. అటు యంగ్ ఇండియా బ్యాటర్లు ఏ మేరకు రాణిస్తారనేది ఆసక్తిగా మారింది.
స్క్వాడ్: సూర్య, అభిషేక్, గిల్, తిలక్, నితీశ్, దూబే, అక్షర్, జితేశ్, వరుణ్, బుమ్రా, అర్ష్‌దీప్, కుల్దీప్, హర్షిత్, సంజూ, రింకూ, సుందర్

రెండోసారి US అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మూడోసారీ పోటీ చేయాలని ఉందన్నారు. మలేషియా నుంచి టోక్యోకు వెళ్తుండగా ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ విషయం బయటపెట్టారు. వచ్చే ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్‌గా నిలబడతారన్న వాదనలను ఆయన కొట్టిపారేశారు. మూడోసారి అధ్యక్షుడిగా పోటీ చేసే మార్గాలున్నాయని, ఇంకా ఆ దిశగా ఆలోచించలేదన్నారు. అయితే US చట్టం ప్రకారం మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయలేరు.
Sorry, no posts matched your criteria.