India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భారత క్రికెట్ సంఘం(ICA) అధ్యక్షురాలిగా భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి ఎన్నికయ్యారు. చెన్నైలో జన్మించిన శాంత ఆల్‌రౌండర్‌గా 1976-1991 మధ్య కాలంలో భారత జట్టుకు ఆడారు. కెరియర్లో 16 టెస్టులు మాత్రమే ఆడిన ఆమె.. న్యూజిలాండ్‌పై చరిత్రాత్మక విజయంలో భాగమయ్యారు. 8 మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించారు. మహిళా క్రికెట్‌కు విశేష సేవలందించిన ఆమెకు 1976లో అర్జున అవార్డు లభించింది.

మొంథా తుఫాను ప్రభావంతో బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. తాజా వాతావరణ సమాచారం, అధికారుల సూచనలు, సహాయక చర్యల వివరాలు తెలుసుకోవడానికి ‘Way2News’ను ఫాలో అవ్వండి. కచ్చితమైన, తాజా అప్‌డేట్‌లను అందిస్తూ మిమ్మల్ని సురక్షితంగా ఉంచడంలో వే2న్యూస్ తోడుగా ఉంటుంది.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ జర్మనీలో మెకానిక్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ/డిప్లొమా/బీటెక్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు నవంబర్ 10వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు రూ.2.50లక్షల నుంచి రూ.3 లక్షల వరకు జీతం చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://naipunyam.ap.gov.in/

ఆసీస్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన భారత్ రేపటి నుంచి 5 మ్యాచుల T20 సమరానికి సిద్ధమైంది. బుమ్రా జట్టులోకి రానుండటం ప్లస్ కానుంది. అతడి సారథ్యంలో పేస్ దళం AUSను ఎలా కట్టడి చేస్తుందో చూడాలి. అటు యంగ్ ఇండియా బ్యాటర్లు ఏ మేరకు రాణిస్తారనేది ఆసక్తిగా మారింది.
స్క్వాడ్: సూర్య, అభిషేక్, గిల్, తిలక్, నితీశ్, దూబే, అక్షర్, జితేశ్, వరుణ్, బుమ్రా, అర్ష్‌దీప్, కుల్దీప్, హర్షిత్, సంజూ, రింకూ, సుందర్

రెండోసారి US అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మూడోసారీ పోటీ చేయాలని ఉందన్నారు. మలేషియా నుంచి టోక్యోకు వెళ్తుండగా ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ విషయం బయటపెట్టారు. వచ్చే ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్‌గా నిలబడతారన్న వాదనలను ఆయన కొట్టిపారేశారు. మూడోసారి అధ్యక్షుడిగా పోటీ చేసే మార్గాలున్నాయని, ఇంకా ఆ దిశగా ఆలోచించలేదన్నారు. అయితే US చట్టం ప్రకారం మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయలేరు.

సాధారణంగా వర్కింగ్ ఉమెన్‌కు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. అటు ఇంటిని-ఇటు ఉద్యోగాన్నీ బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా 30ఏళ్లు దాటిన తర్వాత దీనికి తగ్గట్లు జీవనశైలిని మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవడంతో పాటు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలని చెబుతున్నారు.

Way2Newsలో మహిళల కోసం ప్రత్యేకంగా ‘వసుధ’ కేటగిరీని ప్రవేశపెట్టాం. ఇందులో ప్రతి రోజూ ఉమెన్ హెల్త్, ప్రెగ్నెన్సీ, బ్యూటీ, హెయిర్ కేర్ టిప్స్, వంటింటి చిట్కాలు, ఫ్యాషన్, స్ఫూర్తిదాయక కథనాలు, చైల్డ్ కేర్, పేరెంటింగ్‌పై ఆర్టికల్స్ అందుబాటులో ఉన్నాయి.
* స్క్రీన్‌పై క్లిక్ చేసి కింది భాగంలో కేటగిరీలు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>కి వెళ్లవచ్చు. కేటగిరీలు కన్పించలేదంటే యాప్ అప్డేట్ చేసుకోండి.

TG: మల్లోజుల, ఆశన్న బాటలోనే మావోయిస్టు కీలక నేత లొంగిపోయారు. 45 ఏళ్లు అజ్ఞాతంలో ఉన్న రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ ఇవాళ DGP శివధర్ రెడ్డి ఎదుట సరెండర్ అయ్యారు. మంచిర్యాల(D) మందమర్రికి చెందిన ఆయన సింగరేణి కార్మికుడిగా పనిచేస్తూ 1980లో పీపుల్స్ వార్ ఉద్యమాలకు ఆకర్షితుడయ్యారు. 1984లో AITUC నేత అబ్రహం హత్య కేసులో అరెస్టై ADB సబ్ జైలు నుంచి తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లారు.

AP: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కనిపించట్లేదని YCP ఆరోపిస్తోంది. ‘మంత్రి కందుల దుర్గేశ్ నియోజకవర్గంలోనే పునరావాస కేంద్రాలు కనిపించట్లేదు. కలెక్టర్ ఆదేశాలిచ్చినా అధికారులు కనీసం పట్టించుకోవట్లేదు. తుఫాన్ బాధితుల్ని ఆదుకునే తీరు ఇదేనా? విజయనగరం జిల్లా గుర్లలో తుఫానుతో వరి పంట నేలకొరిగింది. రైతుల్ని పరామర్శించడం కాదు కదా.. కనీసం కూటమి నేతలు పట్టించుకోవట్లేదు’ అని ట్వీట్ చేసింది.

భారీ తుఫానులు, వరదలు సంభవించినప్పుడు రైతులు తమ ప్రాణాలను, ఆస్తులను కాపాడుకునే ప్రయత్నంలో, పశువులను అలాగే కట్టేసి వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోతారు. అవి వరద నీరు వల్ల ఎటూ వెళ్లలేని స్థితిలో ప్రాణాలు కోల్పోతాయి. అందుకే వరదల సమయంలో పశువులను పాకల్లో కట్టకుండా వదిలేయాలి. వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా పశువులను ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. వాటికి కొంత మేతను అందించాలి.
Sorry, no posts matched your criteria.