News October 28, 2025

తుఫాను ఎఫెక్ట్.. ఎక్కడ ఏం జరుగుతోంది!

image

✎ తుఫాను ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్
✎ VJA కొండపై నివసించే ప్రజలను అలర్ట్ చేసిన అధికారులు
✎ VZM జిల్లాలో 69 ముంపు ప్రాంతాల గుర్తింపు, 71 పునరావాస కేంద్రాలు ఏర్పాటు
✎ నిలకడగానే ప్రవహిస్తున్న వంశధార, నాగావళి నదులు
✎ పెన్నా, సంగం బ్యారేజీలకు భారీగా వరద నీరు
✎ ధ్వంసమైన ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్.. అలలకు రోడ్డుపైకి చేరుతున్న రాళ్లు

News October 28, 2025

భారతదేశపు మొదటి మహిళా స్టంట్ ఉమన్

image

హీరోయిన్లకు యాక్షన్ సీన్లుంటే వాటికోసం స్టంట్ ఉమన్లు ఉంటారు. కానీ 50ఏళ్ల క్రితం ఓ మహిళ ఇలా స్టంట్లు చేసిందంటే నమ్ముతారా? ఆమే భారతదేశపు మొదటి మహిళా స్టంట్ ఉమన్ రేష్మా పఠాన్. ఐదు దశాబ్దాల కెరీర్‌లో 400 కి పైగా చిత్రాల్లో ఆమె స్టంట్లు చేశారు. షోలే సినిమా తర్వాత ఆమె గురించి అందరికీ తెలిసింది. ఆమె సేవలకుగాను ‘ఫిలిం క్రిటిక్స్ గిల్డ్’ రేష్మాను ఫస్ట్ క్రిటిక్స్ ఛాయిస్ ఫిలిం అవార్డుతో సత్కరించింది.

News October 28, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

● స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.410 కోట్ల నిధులు విడుదల
● నేడు టీటీడీ బోర్డు సమావేశం.. వైకుంఠ ద్వార దర్శనాలపై చర్చ
● మలేరియా నివారణ చర్యల్లో భాగంగా గిరిజన ప్రాంత ప్రజలకు 89,845 దోమ తెరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం
● స్త్రీనిధిలో నేటి నుంచి 31 వరకు జరగాల్సిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల ఇంటర్వ్యూలు తుఫాన్ కారణంగా DEC 1 నుంచి 4కు వాయిదా

News October 28, 2025

కల్పసూత్రాల్లో ఏం ఉంటాయంటే..?

image

కర్మలను ఆచరించే విధానాన్ని, ఆంతర్యాన్ని తెలిపేవే కల్పసూత్రాలు. ఇవి ఏ మంత్రం ఎక్కడ వాడాలి, క్రతువులకు కావలసిన సామగ్రి, పండితుల సంఖ్యను వివరిస్తాయి. ఇవి 3 రకాలు. యజ్ఞయాగాదుల శ్రుతి ఆధారిత క్రతువులను వివరించేవి శ్రౌతసూత్రాలు. గర్భాదానం, వివాహం, ఉపనయనం వంటి గృహస్థ ధర్మాలకు సంబంధించినవి గృహ్యసూత్రాలు. రాజధర్మాలు, ఆశ్రమ ధర్మాలు, నీతి నియమాలను బోధిస్తూ ధర్మమార్గంలో నడిపించేవి ధర్మ శాస్త్రాలు.<<-se>>#VedikVibes<<>>

News October 28, 2025

పెయ్య దూడకు జున్నుపాలను నిర్లక్ష్యం చేయొద్దు

image

పశువు ఈనిన ఒక గంట లోపల దూడకు జున్ను పాలు తాగించాలి. ఈ సమయంలోనే జున్ను పాలలో రోగనిరోధక శక్తిని కలిగించే యాంటీబాడీస్‌ను దూడ వినియోగించుకునే శక్తిని కలిగి ఉంటుంది. ఆలస్యమైతే ఈ యాంటీబాడీస్‌ను జీర్ణించుకొనే శక్తి పెయ్యలో తగ్గుతుంది. జున్ను పాలలో తేలికగా జీర్ణమయ్యే మాంసకృత్తులు, విటమిన్-ఎ ఎక్కువగా ఉంటాయి. జున్ను పాలు తాగిన దూడలు 6 నెలల వయసు వరకు రోగనిరోధక శక్తిని ఎక్కువగా కలిగి ఉండి త్వరగా పెరుగుతాయి.

News October 28, 2025

348 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో 348 GDS ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఏపీలో 8, తెలంగాణలో 9 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల వయసు 20 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.750. విద్యార్హత, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ippbonline.com/

News October 28, 2025

వాట్సాప్‌లో ‘కవర్ ఫొటో’ ఫీచర్!

image

వాట్సాప్ యూజర్లకు త్వరలో ‘కవర్ ఫొటో’ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఫేస్‌బుక్, X తరహాలో ఇందులోనూ ప్రొఫైల్ పిక్ బ్యాక్ గ్రౌండ్‌లో కవర్ ఫొటోను యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం బిజినెస్ అకౌంట్లకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను సాధారణ వినియోగదారుల కోసం డెవలప్ చేస్తున్నారు. ప్రొఫైల్ పిక్‌ సెట్టింగ్స్ తరహాలోనే కవర్ ఫొటోను ఎవరెవరు చూడాలనేది కూడా యూజర్లు డిసైడ్ చేసుకోవచ్చు.

News October 28, 2025

SBIలో 10 పోస్టులు… అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

SBI‌లో 10 డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MBA, PGDM, PGDBM, CFA/CA అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు గరిష్ఠ వయసు 45ఏళ్లు, మేనేజర్ పోస్టుకు 36ఏళ్లు, డిప్యూటీ మేనేజర్ పోస్టుకు 30ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in/

News October 28, 2025

కర్నూలు ప్రమాదం.. 19 వాహనాలు తప్పించుకున్నాయ్!

image

AP: కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బైకర్ శివశంకర్ 2.45amకు డివైడర్‌ను ఢీకొట్టి అక్కడికక్కడే చనిపోగా, బైకు రోడ్డు మధ్యలో పడింది. vకావేరీ బస్సు 2.55am ప్రాంతంలో బైకును ఢీకొట్టింది. అయితే ఈ మధ్యలో 19 వాహనాలు బైకును తప్పించుకొని వెళ్లాయి. ఈ బస్సు డ్రైవర్‌కు అది కనిపించలేదా? నిర్లక్ష్యమా? అనేది తేలాల్సి ఉంది. ఆ బైకును ఒక్కరు పక్కకు జరిపినా 19ప్రాణాలు దక్కేవి.

News October 28, 2025

‘మీ ఫోన్ ఏమైంది?’ జనార్దనరావుకు సిట్ ప్రశ్నలు

image

AP: నకిలీ మద్యం కేసులో సిట్ అధికారులు జనార్దనరావును అతని ఫోన్ గురించి అడిగినట్లు తెలుస్తోంది. ‘SA వెళ్లాక మీ ఫోన్ ఏమైంది? ఆధారాలు బయట పడతాయని ధ్వంసం చేశారా? ములకలచెరువులో నకిలీ మద్యం యూనిట్ వెలుగుచూశాకే మీ ఫోన్ పోయిందా?’ అని ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. తన ఫోన్ చోరీకి గురైందని, ఎలా పోయిందో తెలియలేదని జనార్దనరావు సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. అందులో ఆధారాలున్నాయా? అని అడగ్గా మౌనంగా ఉండిపోయారు.