India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సెంట్రల్ ఫెసిలిటీ సెంటర్స్‌లో 145 కాంట్రాక్ట్ యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి ICAI/ICOAI/ICSIలో ఇంటర్మీడియట్/ ఎగ్జిక్యూటివ్ లెవల్‌లో ఉత్తీర్ణులైన CA/CS/CMS అభ్యర్థులు అర్హులు. వయసు 35ఏళ్ల లోపు ఉండాలి. వెబ్‌సైట్: https://www.mca.gov.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

AP: ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్ పథకం కింద రాష్ట్రంలో రూ.765 కోట్లతో ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకానుంది. దీంతో దాదాపు 955 మందికి ఉపాధి లభించనుంది. 3 రాష్ట్రాల్లో రూ.5,500 కోట్ల పెట్టుబడులతో 7 ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. వీటి ద్వారా రూ.36,559 కోట్ల విలువైన ఉత్పత్తుల తయారీ, 5,100 మందికి ఉద్యోగాలు లభిస్తాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

యోగాతోనే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని నమ్మిన నానమ్మల్ అనేక పురాతన యోగా శాసనాలను భావితరాలకు పంచారు. 1972లో యోగాసెంటర్ ప్రారంభించి 10L మందికిపైగా యోగా నేర్పారు. వారు దేశవిదేశాల్లో యోగాగురువులుగా స్థిరపడ్డారు. ఆమె చేసిన కృషికిగాను 2016లో కేంద్ర ప్రభుత్వం నారీశక్తి, 2019లో పద్మశ్రీతో సత్కరించింది. 99 ఏళ్ల వయసులో మరణించిన ఆమె ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
✍️ మరిన్ని స్ఫూర్తిదాయక కథనాల కోసం <<-se_10014>>వసుధ<<>> కేటగిరీ.

బాండా వర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ & టెక్నాలజీ 38 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి M.V.SC, PhDతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నవంబర్ 11వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీతో పాటు డాక్యుమెంట్స్‌ను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. టీచింగ్ స్కిల్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: buat.edu.in/

మేషం, వృషభం, తుల, మకరం, మీనం.. ఈ అన్ని రాశుల ఆకృతుల అర్థం మనకు తెలిసినా, మిథున రాశి దేన్ని సూచిస్తుందో కొందరికి తెలియదు. మిథున రాశి(Gemini) గుర్తులో జంట వ్యక్తులు కనిపిస్తారు. ఇది ద్వంద్వ స్వభావాన్ని సూచిస్తుందని పండితులు చెబుతున్నారు. ‘వీరు మాట్లాడేటప్పుడు 2 రకాలుగా ఆలోచిస్తారు. ప్రతి విషయంలో మంచి, చెడును చూస్తూ చురుగ్గా ఉంటారు’ అని అంటున్నారు. మీ రోజూవారీ రాశిఫలాల కోసం <<-se_10008>>జ్యోతిషం<<>> క్లిక్ చేయండి.

భారీ వర్షాలకు మెట్ట పంటలు ముంపునకు గురైతే పొలం నుంచి నీళ్లను సాధ్యమైనంత వేగంగా బయటకు పంపాలి. ఎకరాకు బూస్టర్ డోస్‌గా 25 కిలోల యూరియా మరియు 10 కిలోల పొటాష్‌ను మొక్కల మొదళ్లలో వెయ్యాలి. ఆకుమచ్చ, పొడ తదితర శిలీంద్ర తెగుళ్లను గమనిస్తే లీటరు నీటికి హెక్సాకోనజోల్ 2 గ్రాములు లేదా కార్బండిజమ్ 1గ్రామ్ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించి వారి సూచనలను పాటించాలి.

1. ఇతరుల గోప్య విషయాలను బయటపెట్టడం.
2. దేని గురించైనా పదే పదే అడగడం, భిక్షాటన చేయడం.
3. కఠినంగా, క్రూరంగా, పౌరుషంగా మాట్లాడడం.
4. మనోనిశ్చలత లేకుండా చంచలంగా ఉండటం.
5. ఆగ్రహాన్ని ప్రదర్శించడం. 6. అసత్యాలు చెప్పడం
7. ఇతరులకు దుఃఖం, కష్టం కలిగించడం.
8. మిత్రులను నిందించడం, తప్పు పట్టడం.
ఈ 8 లక్షణాలు సమాజంలో మీ గౌరవం కోల్పోయేలా చేసి, అధోగతికి దారితీస్తాయి. <<-se>>#Sankhya<<>>

వికీపీడియాకి ప్రత్యామ్నాయంగా ‘X’ అధినేత ఎలాన్ మస్క్ ‘గ్రోకీపీడియా’ను తీసుకొచ్చారు. ‘ప్రస్తుతం 0.1 వెర్షన్ అందుబాటులో ఉంది. 1.0 వెర్షన్ దీనికి పదింతలు వేగంగా ఉంటుంది. ఈ 0.1 వెర్షన్ వికీపీడియాకంటే ఎంతో బెటర్‌గా ఉంటుంది’ అని ట్వీట్ చేశారు. మీరు ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా దీనిలో సమాచారం దొరుకుతుందని చెబుతున్నారు. దీనిని ట్రై చేసిన కొందరు యూజర్లు ఎక్స్‌పీరియన్స్ బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

జుట్టుకు రంగువేసుకోవడం వల్ల హార్మోన్ల అసమతౌల్యత, క్యాన్సర్ రావొచ్చని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. తప్పనిసరైతే తప్ప డై వాడకూడదంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే అమోనియా, PPD, హైడ్రోజన్ పెరాక్సైడ్ తలలోని నేచురల్ ఆయిల్స్‌ని పొడిబారేలా చేస్తాయి. దీంతో జుట్టు రాలడం, పొడిబారడం, చిట్లడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే సెన్సిటివ్ స్కిన్ ఉంటే దురద, అలెర్జీ, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి విషయంలో సైబర్ నేరగాళ్లు బరితెగించారు. ఆయన డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి ఏకంగా పోర్న్ సైట్లలో పెట్టారు. ఆయన ఓ మహిళతో ఇంటిమేట్ సీన్లలో పాల్గొన్నట్లు AI వీడియోలు క్రియేట్ చేసి ప్లాట్‌ఫామ్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో నిందితులను అరెస్ట్ చేయాలంటూ చిరంజీవి CP సజ్జనార్‌ను కోరారు. ఇది తన గౌరవానికి భంగం కలిగించిందని ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.