News October 28, 2025

బరితెగించారు.. పోర్న్ సైట్లలో చిరంజీవి డీప్ ఫేక్ వీడియో

image

మెగాస్టార్ చిరంజీవి విషయంలో సైబర్ నేరగాళ్లు బరితెగించారు. ఆయన డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి ఏకంగా పోర్న్ సైట్లలో పెట్టారు. ఆయన ఓ మహిళతో ఇంటిమేట్ సీన్లలో పాల్గొన్నట్లు AI వీడియోలు క్రియేట్ చేసి ప్లాట్‌ఫామ్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో నిందితులను అరెస్ట్ చేయాలంటూ చిరంజీవి CP సజ్జనార్‌ను కోరారు. ఇది తన గౌరవానికి భంగం కలిగించిందని ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News October 28, 2025

రాష్ట్రంలో మెగా జాబ్ మేళా

image

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తుళ్లూరులోని CRDA ఆఫీస్, స్కిల్ హబ్ వద్ద రేపు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 10 మల్టీ నేషనల్ కంపెనీలు 400 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. నిరుద్యోగ అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రెజ్యూమ్, సర్టిఫికెట్లు తీసుకుని ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు.

News October 28, 2025

నిత్యారాధన ఫలితాలు

image

శివ మహాపురాణం ప్రకారం.. నిత్యారాధన విశేష ఫలితాలనిస్తుంది. ఆదివారం సూర్యారాధన నేత్ర, శిరో, చర్మ రోగాలను పోగొడుతుంది. అన్నదానం చేయడం శుభకరం. సంపద కోసం సోమవారం లక్ష్మీదేవిని, రోగ నివారణకై మంగళవారం కాళిని, కుటుంబ క్షేమం కోసం బుధవారం విష్ణువును, ఆయువుకై గురువారం, భోగాలకై శుక్రవారం సకల దేవతలను, అపమృత్యువు నివారణకై శనివారం రుద్రాది దేవతలను పూజించాలి. ఈ నిత్యారాధనలు మనకు సకల శుభాలు కలిగిస్తాయి. <<-se>>#SIVOHAM<<>>

News October 28, 2025

ఈ మందు ‘యమ’ డేంజర్

image

TG: రాష్ట్రంలో ఆత్మహత్యలకు వినియోగిస్తున్న పారాక్వాట్ గడ్డిమందును బ్యాన్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొన్నిగంటల్లోనే గడ్డిని మాడిపోయేలా చేసే ఈ మందును రైతులు వాడతారు. అయితే ఆత్మహత్యలకూ వినియోగించడం ఆందోళన కలిగిస్తోంది. ఇది తాగిన వెంటనే కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. విరుగుడు లేకపోవడంతో 98% కేసుల్లో మరణాలు సంభవిస్తున్నాయి. మన దేశం కేరళ, ఒడిశాతో పాటు 32దేశాల్లో నిషేధం ఉంది.

News October 28, 2025

మునగ సాగు.. ఏటా రూ.40 లక్షల ఆదాయం

image

మునగ సాగుతో అధిక ఆదాయం పొందుతున్నారు కర్ణాటకకు చెందిన ఉమేశ్‌రావు. 2010 నుంచి 10 ఎకరాల భూమిలో సహజ ఎరువులు వాడుతూ మునగసాగు చేస్తున్నారు. మార్కెట్‌లో మునగాకులపొడికి ఉన్న డిమాండ్ చూసి దాన్నే తయారు చేసి వివిధ కంపెనీలకు విక్రయిస్తున్నారు. ఏటా ఎకరాకు రూ.4 లక్షల చొప్పున 10 ఎకరాల నుంచి రూ.40 లక్షల ఆదాయం పొందుతున్నారు.✍️ ప్రతిరోజూ ఇలాంటి కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News October 28, 2025

మరికాసేపట్లో తీవ్ర తుఫానుగా ‘మొంథా’!

image

AP: ‘మొంథా’ తుఫాను దూసుకొస్తోంది. గడిచిన 6గంటల్లో 17kmph వేగంతో కదులుతున్నట్లు APSDMA తెలిపింది. ప్రస్తుతం మచిలీపట్నంకి 230KM, కాకినాడకు 310KM, విశాఖపట్నంకి 370KM దూరంలో కేంద్రీకృతమైందని చెప్పింది. మరికాసేపట్లో తీవ్ర తుఫానుగా బలపడనుందని వివరించింది. రాత్రికి మచిలీపట్నం-కాకినాడ మధ్య తీరం దాటే ఛాన్స్ ఉందని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని హెచ్చరించింది.

News October 28, 2025

ఇతిహాసాలు క్విజ్ – 49

image

1. శ్రీరామదాసుగా ప్రసిద్ధి చెందిన రామ భక్తుడు ఎవరు?
2. భూలోకానికి పైన ఉండే మొదటి లోకం ఏది?
3. రామ సేతువు నిర్మాణంలో ప్రధాన ఇంజినీర్లు ఎవరు?
4. యుద్ధాన్ని చూస్తూ దాన్ని ధృతరాష్ట్రునికి వివరించింది ఎవరు?
5. శివుడు తన జటాజూటంలో బంధించిన నది ఏది?
✑ సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 28, 2025

అక్టోబరు ఆఖరు నుంచి మామిడి చెట్లకు నీరు వద్దు

image

మామిడిలో మంచి పూత రావాలంటే రైతులు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అందులో భాగంగా ఇప్పటికే చెట్లకు పోషకాలు అందించాల్సి ఉంటుంది. ఈ నెల చివరి నుంచి మామిడి చెట్లు నిద్రావస్థలో ఉంటాయి. అందుకే ఈ నెలాఖరు నుంచి మామిడి చెట్లకు నీరు పెట్టడం పూర్తిగా ఆపేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఈ కాలంలో చెట్లకు నీరు పెట్టడం వల్ల చెట్ల రెమ్మల్లో కొత్త ఇగుర్లు వచ్చి పూత రాకుండా పోతుందని చెబుతున్నారు.

News October 28, 2025

CCRHలో 31 పోస్టులు..

image

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి 31 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు నవంబర్ 6 నుంచి 10 వరకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. కన్సల్టెంట్ పోస్టులకు నవంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని స్పీడ్ పోస్ట్ చేయాలి. వెబ్‌సైట్: https://ccrhindia.ayush.gov.in/

News October 28, 2025

‘మొంథా’ తుఫాను UPDATES

image

➤ విశాఖ, కోనసీమ, కాకినాడ తదితర జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం.. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం
➤ తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
➤ విశాఖకు వచ్చే 16రైళ్లు రద్దు
➤ 11 జిల్లాల్లో 6 లక్షల హెక్టార్ల పంటలపై తుఫాను ప్రభావం!
➤ తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి 787మంది గర్భిణులు సమీప ఆస్పత్రులకు తరలింపు
➤ సహాయక చర్యలకు సిద్ధమైన తూర్పు నౌకాదళం.. సరకు రవాణా విమానాలు, హెలికాప్టర్లు రెడీ