India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: 317 జీవో కింద స్థానికత కోల్పోయిన టీచర్ల బదిలీలకు దరఖాస్తుల గడువు ఆదివారంతో ముగిసింది. మొత్తం 6,500 అప్లికేషన్లు వచ్చాయి. వీటిని డీఈవోలు పరిశీలించాక ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి పంపిస్తారు. ఉద్యోగుల స్థానికత, కేటాయింపు ప్రక్రియలో జరిగిన పొరపాట్లు, ఇతర కారణాలపై 3-4 రోజుల్లో స్క్రూటినీ పూర్తికానుంది. వచ్చిన దరఖాస్తుల్లో సగం అప్లికేషన్లు మాత్రమే నిబంధనల ప్రకారం అర్హత సాధించే అవకాశం ఉందని సమాచారం.

AP: భారీ వర్షాల నేపథ్యంలో అవసరం లేని రూట్లలో బస్సు సర్వీసులను తాత్కాలికంగా నిలివేయాలని అధికారులను RTC MD తిరుమలరావు ఆదేశించారు. ప్రయాణికుల రద్దీ ఉండే మార్గాల్లోనే సర్వీసులను నడపాలని సూచించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రాత్రి హాల్ట్‌లు ఉంచొద్దని, ముంపునకు అవకాశమున్న కాల్వలు, కాజ్ వేలు, కట్టల మీదుగా వెళ్లే రూట్లలో బస్సులు నడపవద్దన్నారు. దూరప్రాంత సర్వీసులనూ రద్దీని బట్టే నడపాలని చెప్పారు.

ప్రస్తుతకాలంలో పిల్లలు స్మార్ట్ గ్యాడ్జెట్లతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. అయితే వారికి దీంట్లో ఉండే కష్టనష్టాల గురించి చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనంటున్నారు నిపుణులు. సోషల్‌మీడియాపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలి. ఏదైనా పోస్ట్ చేసేముందు ఆలోచించాలని, గోప్యతకు ప్రాధాన్యతనివ్వాలని వారికి చెప్పాలి. ఆ పరిచయాలతోపాటు ఆఫ్‌లైన్‌లో దొరికే మానవసంబంధాల ప్రాధాన్యతనూ వారికి వివరించాలంటున్నారు.

AP: మొంథా తుఫాను ప్రభావంతో నేడు విశాఖ, విజయవాడ విమానాశ్రయాలకు పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎయిరిండియా, ఇండిగో, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఫైట్లు నిలిచిపోనున్నాయి. అయితే ఇండిగో ఫైట్లు 10.45AM వరకు, ఢిల్లీ-VJA సర్వీసులు నడుస్తాయని VJA ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. అటు ఢిల్లీ, భువనేశ్వర్, VJA, రాయ్‌పూర్, హైదరాబాద్, బెంగళూరు నుంచి విశాఖకు వెళ్లే సర్వీసులన్నీ ఆగిపోనున్నాయి.

హనుమంతుడు అపారమైన శక్తి, ధైర్యం, నిస్వార్థ భక్తికి ప్రతీక. ప్రజలు ఆయనను కష్టాలను తొలగించే ఆపద్బాంధవుడిగా, ఆరోగ్య ప్రదాతగా నమ్ముతారు. రాముని సేవలో ఆయన చూపిన నిష్ఠ కారణంగా ఆయన్ని ఎక్కడ పూజించినా రాముని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అందుకే గ్రామాన్ని, ప్రజలను రక్షించే రక్షక దేవతగా ప్రతి ఊరిలో ఆయన ఆలయాన్ని నిర్మించడం భారతీయ సంప్రదాయంగా మారింది. ఆయనను పూజిస్తే ధైర్యం, బలం లభిస్తాయని నమ్ముతారు.

AP: పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో ఉన్న ‘మొంథా’ తుఫాను గడిచిన 6గంటల్లో 15Kmph వేగంతో ఉత్తర-వాయవ్య దిశగా కదిలిందని APSDMA తెలిపింది. ప్రస్తుతానికి మచిలీపట్నంకి 280km, కాకినాడకు 360km, విశాఖపట్నంకి 410km దూరంలో కేంద్రీకృతమై ఉందని చెప్పింది. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని హెచ్చరించింది. అత్యవసరమైతే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని సూచించింది.

TGSRTCలో 1,743 ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ, హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ (HPMV), హెవీ గూడ్స్ వెహికల్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్ పోస్టులకు 22-35 ఏళ్లు, శ్రామిక్ ఉద్యోగాలకు 18-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.tgprb.in/

డిగ్రీ ఉంటేనే సోషల్ మీడియా రీల్స్ చేసేలా చైనా కొత్త నిబంధన తీసుకొచ్చింది. తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మెడిసిన్, లా, ఎడ్యుకేషన్, ఫైనాన్స్ వంటి అంశాలపై వీడియోలు చేయాలంటే ఆయా సబ్జెక్టులపై వారు డిగ్రీ చేసి ఉండాలి. అలాగే SM ప్లాట్‌ఫామ్స్ కూడా వారి డిగ్రీని వెరిఫై చేయాల్సి ఉంటుంది. రూల్స్ పాటించని వారి ఖాతాలను డిలీట్ చేయడమే కాకుండా రూ.12 లక్షల వరకు ఫైన్ విధిస్తారు.

AP: ‘మొంథా’ తుఫాను తీరం వైపు వేగంగా కదులుతోంది. దీంతో నేడు కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు, శ్రీకాకుళం-నెల్లూరు వరకు అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది. రాయలసీమలో అక్కడక్కడ భారీ వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సాయంత్రం/రాత్రికి మచిలీపట్నం-కాకినాడ మధ్య తుఫాను తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. 90-110Kmph వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.

TG: పదో తరగతి పరీక్షలను మార్చి మూడో వారం నుంచి నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం. 16 లేదా 18వ తేదీ నుంచి ఎగ్జామ్స్ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహిస్తామని ఇటీవల అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏటా ఇంటర్ పరీక్షలు ముగిసే రెండు రోజుల ముందు టెన్త్ ఎగ్జామ్స్ మొదలవడం ఆనవాయితీగా వస్తోంది.
Sorry, no posts matched your criteria.