News May 7, 2025

ఉగ్రదాడిపై అంతర్జాతీయ విచారణ జరగాలి: పాక్

image

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై అంతర్జాతీయ విచారణ జరగాలని పాకిస్థాన్ డిమాండ్ చేసింది. ఆ దేశ రక్షణ మంత్రి ఆసిఫ్ న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ‘అంతర్జాతీయ దర్యాప్తుకు సహకరించేందుకు పాక్ సిద్ధంగా ఉంది. ఆ దాడిలో మా పాత్ర ఏమీ లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రదాడిని భారత్ వాడుకుంటోంది. ఆధారాల్లేకుండా, దర్యాప్తు చేయకుండానే పాక్‌ను శిక్షించాలని చూస్తోంది’ అని ఆరోపించారు.

Similar News

News February 9, 2026

బాలీవుడ్ హీరో స్టైల్‌లో బిల్డప్ ఇచ్చి.. అడ్డంగా దొరికిన నకిలీ IT ఆఫీసర్

image

బాలీవుడ్ హీరో స్టైల్‌లో ట్రేడర్లను బురిడీ కొట్టించాలని చూసిన ఓ నకిలీ ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌కు చెందిన విజయ్‌సింగ్ చౌహాన్ (51) సూరత్‌లోని టెక్స్‌టైల్ మార్కెట్‌లో సీనియర్ IT అధికారిగా బిల్డప్ ఇస్తూ ₹30లక్షలు డిమాండ్ చేసి ₹4 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు. పక్కనే ఉన్న హోటల్‌కు క్యాష్‌తో రమ్మన్నాడు. అయితే సదరు ట్రేడర్‌కు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

News February 9, 2026

ప్రెగ్నెన్సీలో కలయికలో పాల్గొంటే..

image

ప్రెగ్నెన్సీ పీరియడ్‌లో శృంగారంలో పాల్గొనడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే హై రిస్క్‌ జోన్‌లో ఉన్న మహిళలు శృంగారానికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వెజైనా సమస్యలు, కవలలు, గతంలో ప్రీమెచ్యూర్‌ డెలివరీ అయినవాళ్లు కూడా శృంగారానికి దూరంగా ఉండాలి. అలాగే ఇన్‌ఫెక్షన్‌, లైంగికంగా సంక్రమించే వ్యాధులతో బాధపడుతుంటే వాళ్లు కూడా కలయికకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

News February 9, 2026

T20WCలో నేడు..

image

T20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ కోల్‌కతా, కొలంబో, అహ్మదాబాద్ వేదికగా 3 మ్యాచ్‌లు జరగనున్నాయి.
* ఉ.11 నుంచి.. స్కాట్లాండ్vsఇటలీ
* మ.3 నుంచి.. జింబాబ్వేvsఒమన్
* రా.7 నుంచి.. దక్షిణాఫ్రికాvsకెనడా
LIVE: స్టార్‌స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్