News February 9, 2025
భారత్‌పై పాక్ గెలవాలి: పాక్ పీఎం

ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో పాటు భారత్‌పైనా విజయం సాధించడం తమ లక్ష్యమని పాక్ PM షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. ‘జట్టు చాలా బలంగా ఉంది. అందరూ బాగా ఆడుతున్నారు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ముందున్న లక్ష్యం. అయితే చిరకాల ప్రత్యర్థి భారత్‌పై గెలవడం కూడా కీలకం. దేశమంతా జట్టుకు మద్దతుగా ఉంది. 29 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఐసీసీ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నాం. ఇది గర్వ కారణం’ అని పేర్కొన్నారు.
Similar News
News February 11, 2026
బీట్ రూట్ సాగులో కలుపు నివారణ ఎలా?

బీట్ రూట్‌లో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. విత్తిన 24-48 గంటల్లోపు ఎకరాకు తేలిక నేలల్లో 200 లీటర్ల నీటిలో పెండిమిథాలిన్ 1.25 లీటర్లు, అదే బరువు నేలల్లో అయితే 200 లీటర్ల నీటిలో అలాక్లోర్ 1.25L కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 15 రోజులకు 200 లీటర్ల నీటిలో మెట్రిబుజిన్ 300 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. గింజ మొలకెత్తిన 20-25 రోజుల తర్వాత కలుపు తీసి మన్ను ఎగదోస్తే గడ్డ బాగా ఊరుతుంది.
News February 11, 2026
DRDOలో 25 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News February 11, 2026
అష్టమ శనితో వివాహం ఆలస్యం!

జాతకంలో ఎనిమిదో స్థానంలో శని సంచరిస్తే పెళ్లి సంబంధాలు ఆగిపోతాయని అంటారు. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో రోజూ ‘హనుమాన్ చాలీసా’ పఠించాలి. అది రక్షణ కవచంలా పనిచేస్తుంది. నువ్వుల నూనెతో శనైశ్చరుడికి అభిషేకం చేయాలి. కాకులకు బెల్లం కలిపిన అన్నం పెట్టాలి. వికలాంగులకు సాయం చేస్తే శని ప్రభావం తగ్గి పరిస్థితులు అనుకూలిస్తాయి. ఓర్పుతో చేసే దైవ ప్రార్థన వివాహ మార్గంలోని ముళ్లను తొలగిస్తుంది.


