News May 2, 2024
టీ20 వరల్డ్ కప్‌కు పాక్ టీమ్ ప్రకటన

బాబర్ ఆజమ్ కెప్టెన్‌గా టీ20 వరల్డ్ కప్‌కు పాకిస్థాన్ జట్టును ప్రకటించింది. 18 మంది సభ్యులకు టీమ్‌లో చోటు కల్పించింది.
జట్టు: బాబర్ ఆజమ్, అమీర్, షాహీన్, ఆజం ఖాన్, ఫఖర్, రౌఫ్, హసన్ అలీ, ఇఫ్తికర్, ఇమాద్ వసీం, అబ్బాస్ అఫ్రీది, రిజ్వాన్, ఇర్ఫాన్ ఖాన్, నసీమ్, అయూబ్, సల్మాన్ అఘా, అబ్రార్, షాదాబ్, ఉస్మాన్ ఖాన్
Similar News
News December 5, 2025
నేడు ప్రపంచ మృత్తికా దినోత్సవం

ప్రపంచ జనాభాకు అందే ఆహారంలో 95శాతం నేల నుంచే అందుతోంది. అందుకే మనిషి ఉనికికి, జీవనానికి మట్టి మూలాధారం. నేల ఆరోగ్యంగా, సారవంతంగా ఉన్నప్పుడే మానవ మనుగడ సాధ్యమవుతుంది. అందుకే భూమి ప్రాధాన్యత, సంరక్షణకు తీసుకోవాల్సి జాగ్రత్తలను వివరించడానికి ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ & అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఓ తీర్మానం చేసింది. 2014 DEC-5 నుంచి ఏటా ఈ రోజున ప్రపంచ నేల దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.
News December 5, 2025
ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి

TG: వచ్చే మూడేళ్లలో అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. తొలి విడతలో 4 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తామన్నారు. ఏప్రిల్ నుంచి రెండో విడత ఇళ్ల పంపిణీని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ ఇస్తామని తెలిపారు.
News December 5, 2025
‘పుష్ప-2’కు ఏడాది.. అల్లుఅర్జున్ స్పెషల్ ట్వీట్

‘పుష్ప2’ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ప్రేక్షకుల నుంచి లభించిన అపారమైన ప్రేమ తమకు మరింత ధైర్యాన్నిచ్చిందని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చిత్రాన్ని అద్భుతంగా మార్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘కెప్టెన్’ సుకుమార్ సహా చిత్రబృందానికి ధన్యవాదాలు చెప్పారు. ‘పుష్ప’గా ఈ 5ఐదేళ్ల ప్రయాణం తన జీవితంలో మరువలేనిదని కొనియాడారు.


