News May 7, 2025
పాక్ నిర్ణయం.. పెరగనున్న విమాన టికెట్ ధరలు?

పాక్ గగనతలం మీదుగా భారత విమానాలు ఎగరడం నిషేధించడంతో విమాన టికెట్ ధరలు 8-12 శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తర భారతం నుంచి యూరప్, నార్త్ అమెరికా, మధ్య ప్రాచ్య దేశాలకు వెళ్లే విమానాలు ఇకపై అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించనున్నాయి. దీంతో అదనపు ఇంధన ఖర్చుల దృష్ట్యా ప్రయాణికులపై ధరల భారం పడనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రయాణ సమయం 2 నుంచి 3గంటల వరకూ పెరగనుంది.
Similar News
News February 19, 2026
‘ఇంజినీర్’ అంటూ బంగ్లాదేశ్ PMపై ట్రోల్స్.. కారణమిదే!

బంగ్లాదేశ్ కొత్త PM తారిఖ్ రెహ్మాన్‌ను ఇంజినీర్ అంటూ ప్రతిపక్ష నేతలు, నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఎన్నికల <<19125261>>ఫలితాలను<<>> తనకు అనుకూలంగా ఇంజినీరింగ్(మార్చుకున్నారని) చేశారని విమర్శిస్తున్నారు. ‘విద్యార్హతలు లేకుండానే ఇంజినీర్ అయ్యాడు’, ‘ది మ్యాన్, మిత్, లెజెండ్, ఇంజినీర్’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. రెహ్మాన్ హయ్యర్ సెకండరీ(12వ తరగతి) వరకే చదువుకోవడం గమనార్హం. 17 ఏళ్లు లండన్‌లో ప్రవాసంలో ఉన్నారు.
News February 19, 2026
GK: ఫిబ్రవరిలో ముఖ్య రోజులు

feb 4: ప్రపంచ క్యాన్సర్ దినం
feb 10: ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం
feb 11: అంతర్జాతీయ బాలిక, మహిళల విజ్ఞాన దినోత్సవం
feb 13: ప్రపంచ రేడియో దినోత్సవం
feb 20: ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం
feb 21: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
– ప్రతిరోజూ 2amకు జనరల్ నాలెడ్జ్ కంటెంట్ పొందండి
News February 19, 2026
వాళ్లు ఇండియాను ఓడించలేదు: పాక్ క్రికెటర్

ఇండియాతో మ్యాచ్‌లో పాక్ <<19153355>>ఘోరంగా<<>> ఓడిపోవడం తెలిసిందే. ఈ క్రమంలో తమపై <<19155191>>తీవ్ర విమర్శలు<<>> చేస్తున్న మాజీలకు పాక్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ కౌంటర్ ఇచ్చారు. ‘మాజీ క్రికెటర్లకు వాళ్ల సొంత అభిప్రాయాలు ఉంటాయి. వారు దిగ్గజాలు. కానీ మేం చేసినట్లు వాళ్లు చేయలేదు. మేం ప్రపంచకప్‌లో ఇండియాను ఓడించాం. అయినా విమర్శలనేవి క్రికెట్ చరిత్రలో భాగం’ అని అన్నారు. 2021 T20 WCలో ఇండియాపై పాక్ గెలిచింది.


