News April 4, 2024
డేంజర్ జోన్‌లో పంత్!

KKRతో మ్యాచ్‌లో DC స్లో ఓవర్ రేటు మెయింటేన్ చేయడంతో BCCI మరోసారి జరిమానా విధించింది. CSKతో మ్యాచులోనూ DC ఇదే తప్పు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు రూ.12 లక్షలు ఫైన్ వేయగా.. రెండోసారి అదే తప్పు చేసినందుకు పంత్‌కు రూ.24 లక్షల జరిమానా వేసింది. ఇంపాక్ట్ ప్లేయర్ సహా ఢిల్లీ ఆటగాళ్లందరికీ రూ.6 లక్షల జరిమానా పడింది. మరోసారి ఇదే జరిగితే పంత్‌కి రూ.30 లక్షల ఫైన్‌తో పాటు ఒక మ్యాచ్ నిషేధిస్తారు.
Similar News
News February 17, 2026
అన్నమయ్య: రైతులకు మామిడి కవర్లను పంపిణీ చేసిన జేసీ

జిల్లాకు మంజురైన రూ. 5.5 కోట్ల మామిడి కవర్లను జేసీ శివనారాయణ శర్మ పంపిణీ చేశారు. జిల్లాలో మామిడి 37 వేల హెక్టార్లలో సాగయింది. అందులో తినడానికి అనువైన రకాలు బేనిషాన్, రసాలు, హిమాంపసంద్, మల్లిక ఉన్నాయి. వీటిలో అధిక ఆదాయం పొందాలంటే కవర్లు ఉపయోగం తప్పనిసరని రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన కవర్లను సోమవారం మదనపల్లి కలెక్టరేట్లో జేసీ పంపిణీ చేసినట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారులు సుభాషిని, ప్రసాద్ తెలిపారు.
News February 17, 2026
తిరుపతి కలెక్టరేట్‌కు 443 అర్జీలు.!

తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 443 అర్జీలు అందినట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సోమవారం తెలిపారు. అర్జీదారుల సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్జీదారులకు తాగునీరు, మెడికల్ క్యాంప్, టీ వంటి సౌకర్యాలు కల్పించి వారి వినతులను స్వీకరించామన్నారు. శాఖలవారీగా రెవెన్యూ విభాగంలో అత్యధికంగా 280 అర్జీలు వచ్చాయన్నారు.