News March 16, 2024

SRH కెప్టెన్‌గా పాట్ కమిన్స్ రాణిస్తారు: స్మిత్

image

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ప్యాట్ కమిన్స్ రాణిస్తారని ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ధీమా వ్యక్తం చేశారు. ‘హైదరాబాద్‌ హెడ్ కోచ్ వెటోరీ ఆస్ట్రేలియా టీమ్‌కు అసిస్టెంట్ కోచ్‌ కూడా. ఆయనతో కమిన్స్‌కు చక్కటి అనుబంధం ఉంది. పైగా కెప్టెన్సీ బాధ్యత ఉన్న ప్రతిసారీ కమిన్స్ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారు. ఈసారి SRH రాణిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది’ అని స్మిత్ వ్యాఖ్యానించారు.

Similar News

News April 14, 2026

కొవిడ్ వ్యాక్సిన్‌తోనే నాన్న చనిపోయారు: వార్న్ కుమారుడు

image

స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మరణానికి కారణం కరోనా వ్యాక్సిన్ అని ఆయన కుమారుడు జాక్సన్ వార్న్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాక్సిన్‌‌తో తన తండ్రి అనారోగ్య సమస్యలు ముదిరాయని ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. ఇష్టం లేకపోయినా ఇతరుల ఒత్తిళ్లతో ఆయన టీకా డోసులు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని అంత్యక్రియలప్పుడే చెప్పాలని అనుకున్నా కొన్ని కారణాలతో ఆగిపోయానని అన్నారు. కాగా షేన్ వార్న్ 2022లో చనిపోయారు.

News April 14, 2026

40 నిమిషాల పాటు మోదీ-ట్రంప్ ఫోన్ కాల్

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్ కాల్‌లో 40 నిమిషాల పాటు మాట్లాడారు. US-ఇరాన్ సీజ్‌ఫైర్ ప్రకటించాక వీరిద్దరూ కాల్ మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. పశ్చిమాసియాలోని పరిస్థితులు సహా వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యంపై చర్చించారు. హార్ముజ్ భద్రతపైన కూడా చర్చించినట్లు ప్రధాని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

News April 14, 2026

దేశంలో 16 మంది బీజేపీ సీఎంలు.. లిస్ట్ ఇదే

image

⋆ అస్సాం-హిమంత బిశ్వ శర్మ, అరుణాచల్‌ప్రదేశ్-పెమా ఖండూ
⋆ ఛత్తీస్‌గఢ్-విష్ణుదేవసాయ్, ఢిల్లీ-రేఖా గుప్తా
⋆ గోవా-ప్రమోద్ సావంత్, గుజరాత్-భూపేంద్ర పటేల్
⋆ హరియాణా-నాయబ్ సింగ్ సైనీ, UP-యోగి ఆదిత్యనాథ్
⋆ MP-మోహన్ యాదవ్, మహారాష్ట్ర-దేవేంద్ర ఫడణవీస్
⋆ మణిపుర్-యుమ్నాం ఖేమ్‌చంద్ సింగ్, ఉత్తరాఖండ్-పుష్కర్ సింగ్ ధామి
⋆ ఒడిశా-మోహన్ చరణ్ మాఝీ, త్రిపుర-మాణిక్ సాహా
⋆ రాజస్థాన్-భజన్‌లాల్ శర్మ, బిహార్-సామ్రాట్ చౌదరి