News April 15, 2024
పతిరణ.. మ్యాచ్ టర్నర్!

MIపై CSK గెలవడంలో పతిరణ కీలక పాత్ర పోషించారు. ఓపెనర్లు రోహిత్, కిషన్ చెలరేగడంతో ఓ దశలో ముంబై 207 పరుగుల భారీ లక్ష్యాన్ని సులువుగా ఛేదించగలదని ఫ్యాన్స్ అనుకున్నారు. అదే టైమ్‌కు ఎనిమిదో ఓవర్లో రంగంలోకి దిగిన పతిరణ కిషన్, SKY వికెట్లు పడగొట్టి ముంబైని కష్టాల్లోకి నెట్టారు. క్రీజులో కుదురుకుంటున్న తిలక్ వర్మను 14 ఓవర్లో, షెపర్డ్‌ను 18వ ఓవర్లో ఔట్ చేయడంతో ముంబై చేతులెత్తేసింది.
Similar News
News December 13, 2025
మహిళలూ ఈ తప్పులు చేస్తున్నారా?

మహిళలు చేసే కొన్ని తప్పులు గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయంటున్నారు నిపుణులు. 30 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఏడాదీ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి. ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, తక్కువ పండ్లు, కూరగాయలు తిన్నప్పుడు ఆహారంలో యాంటీఆక్సిడెంట్లు లోపిస్తాయి. దీంతో రోగనిరోధక శక్తి తగ్గి HPV ఇన్ఫెక్షన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. వీటితో పాటు గర్భధారణలో చేసే తప్పులు కూడా దీనికి కారణమంటున్నారు.
News December 13, 2025
HILTP: భూ బదిలీకి ఒక్క దరఖాస్తూ రాలేదు

TG: హిల్ట్ (HILT) విధానం కింద పారిశ్రామిక భూముల బదిలీ కోసం రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (TSIIDC)కు ఇంకా ఎలాంటి దరఖాస్తులూ అందలేదు. తెలంగాణలో 21 పారిశ్రామికవాడలు ఉన్నాయి. HILTను NOV 22న ప్రకటించారు. దీని కింద భూముల బదిలీకి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే పరిశ్రమల యాజమాన్యాల నుంచి ఎలాంటి స్పందన రాలేదని అధికారులు తెలిపారు. త్వరలోనే యాజమాన్యాలతో ప్రభుత్వం భేటీ కానుంది.
News December 13, 2025
పప్పు గింజల పంటల్లో చిత్త పురుగులు.. నివారణ

మినుము, పెసర, అలసంద, కంది లాంటి పప్పు గింజల పైర్లు లేత దశలో(2-4 ఆకులు) ఉన్నప్పుడు చిత్త/పెంకు పురుగులు ఆశిస్తాయి. ఆకుల అడుగు భాగాల్లో చేరి రంధ్రాలు చేసి తినేస్తాయి. దీంతో మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. వీటి నివారణకు కిలో విత్తనానికి థయోమిథాక్సామ్ 5గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5ML మందులతో విత్తనశుద్ధి చేసుకోవాలి. పంటలో లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6ML లేదా ఎసిఫేట్ 1.5గ్రా. కలిపి పిచికారీ చేసుకోవాలి.


